'చంద్రబాబు మీ సీఎం కాదు.. మా సీఎం' | tdp workers over action at swarna bharathi trust | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు మీ సీఎం కాదు.. మా సీఎం'

Published Sun, Aug 24 2014 3:29 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

'చంద్రబాబు మీ సీఎం కాదు.. మా సీఎం' - Sakshi

'చంద్రబాబు మీ సీఎం కాదు.. మా సీఎం'

నెల్లూరు: స్వర్ణభారతి ట్రస్టు 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు ఓవర్యాక్షన్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎదుటే పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు నాయుడు మీ సీఎం కాదు.. మా సీఎం అంటూ విరుచుకుపడ్డారు. నేతల ఒత్తిడికి తలొగ్గి వాహనాలకు పోలీసులు అనుమతిచ్చారు.

సమన్వయం లోపంతో గందరగోళం నెలకొనడంతో అంతకుముందు వీఐపీల వాహనాలను పోలీసులు ఆపేశారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రోడ్డుమార్గానా రేణిగుంటకు చంద్రబాబు పయనమయ్యారు. రేణిగుంట నుంచి విమానంలో ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.

కాగా, 2019 జాతీయ క్రీడలు నెల్లూరులో నిర్వహించేందుకు యత్నిస్తానని చంద్రబాబు అంతకుముందు చెప్పారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement