గుప్తనిధుల కథ.. టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడి అరెస్ట్ | tdp zptc arrest in kurnoor district | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కథ.. టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడి అరెస్ట్

Published Sun, May 10 2015 11:04 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

గుప్తనిధుల కథ.. టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడి అరెస్ట్ - Sakshi

గుప్తనిధుల కథ.. టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడి అరెస్ట్

ఆలూరు: కర్నూలు జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలకు వెళ్లి టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు రేగుల రమణ అరెస్ట్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి దేవరగట్టు అటవీ ప్రాంతంలోని పురాతన కోటలో కొందరు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు హొళగుంద పోలీసులకు సమాచారం అందింది.

దీంతో అక్కడికి వెళ్లిన వారికి హాలహర్వి జెడ్పీటీసీ సభ్యుడు రేగుల రమణ, ఆయన సోదరుడు రేగుల రాము, నెరణికి చెందిన గాదేగౌడ, చింతకుంటకు చెందిన శేఖర్, వెంకటేశ్వర్లు, జగన్నాథం కనిపించారు. తొలుత పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పలుగు, పారలను స్వాధీనం చేసుకున్నారు. వారు ఉపయోగించిన కేఏ34 ఎన్6667, కేఏ34 ఎమ్7368 స్కార్పియో వాహనాలను సీజ్ చేశారు. వారంతా గుప్తనిధుల కోసమే అక్కడికి వచ్చినట్లు కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement