నార్నూర్, న్యూస్‌లైన్ : నార్నూర్ మండలం జామ్ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రేమ పేరిట వేధిస్తున్న ఉపాధ్యాయుడిని తొలగించాలని శుక్రవారం విద్యార్థినులు ఆందోళనబాట పట్టారు. ఉపాధ్యాయుడు శంకర్ తీరుపై హెచ్‌ఎం లక్ష్మణ్‌కు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు, పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. తరగతి గదిలో బోధిస్తున్న ఉపాధ్యాయుడు శంకర్‌ను చితకబాదారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అందోళనకు దిగారు.
అడ్డుకోబోయిన ఎస్సై సంతోష్‌సింగ్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తరగతి గదిలో ప్రేమ పాఠాలు బోధించడం, రాత్రి వేళల్లో పడుకున్నా గదిలోకి వచ్చి ఇబ్బంది పెట్టడం, సదరు విద్యార్థినికి సబ్బులు, డ్రెస్సులు, వస్తువులు ఇచ్చి మభ్య పెట్టేవారని విద్యార్థినులు పేర్కొన్నారు. మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం జరుగుతున్న విషయాలు హెచ్‌ఎంకు చెప్పినా పట్టించుకోలేదన్నారు.
నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి.. : గిరిజన సంఘాల డిమాండ్
కీచక ఉపాధ్యాయుడు శంకర్ ను సస్పెండ్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కనక యాదవ్‌రావ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెడ్మా బొజ్జు, తుడం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతిలు డిమాండ్ చేశారు. పాఠశాల ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన పాఠశాలల్లో గిరిజన విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, బాధిత ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చర్య తీసుకోకుంటే అందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వాస్తవమే.. నివేదిక ఐటీడీఏ పీవోకు సమర్పిస్తా.. - చందన, ఏటీడ బ్ల్యూవో
అందోళన విషయం తెలుసుకున్న ఏటీడ బ్ల్యూవో చందన పాఠశాలను సందర్శించారు. వివరాల ను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. బా ధిత ఉపాధ్యాయునిపై వచ్చిన ఆరోపణ వాస్తవమేనన్నారు. నివేదికను ఐటీడీఏ పీవోకు సమర్పిస్తానని తెలిపారు. పాఠశాలను సందర్శించిన వారిలో లంబాడ హక్కుల పొరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాథోడ్ ఉతం, సర్పంచ్‌లు రాథోడ్ మధకర్, బానోత్ గజానంద్‌నాయక్, రాయి సెంటర్ జిల్లా సార్‌మెడి దుర్గు పటెల్, ఎల్‌హెచ్‌పీస్ జిలా అధ్యక్షులు అడే సురేశ్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆశ్రమంలో ఉద్రిక్తత
Published Sat, Dec 28 2013 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement