చిత్తూరు (క్రైమ్),న్యూస్‌లైన్ : లిఫ్ట్ అడిగితే కారులో బంధించి ఆభరణాలు దోచుకున్నారని వీ.కోటకు చెందిన ఉపాధ్యాయురాలు డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం ఎస్పీ బంగ్లాలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిం చారు. వీ.కోటకు చెందిన ఉపాధ్యాయురాలు అదే మండలంలోని లింగాపురం పాఠశాలలో పనిచేస్తోంది. ఈనెల 14వ తేదీన బంద్ కారణంగా బస్సులు రాకపోవడంతో వీ.కోట బస్టాప్ వద్ద కారును ఆపి లిఫ్ట్ ఇవ్వాలని కోరింది. కారు ఎక్కి కొంతదూరం వెళ్లేసరికి అం దులోని ముగ్గురు వ్యక్తులు ఆమె నోట్లో గుడ్డకుక్కి బంగారు ఆభరణాలు దోచుకుని మార్గమధ్యంలో వదిలేసి వెళ్లిపోయారు.
అదేరోజు ఆమె వీ.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కార్వేటినగరానికి చెందిన కానిస్టేబుల్ సిద్ద య్య లంచాలు ఇవ్వాలని, అదే స్టేషన్‌లో పనిచేసే మరో కానిస్టేబుల్ రాజ్‌కుమార్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, బంగారుపాళ్యం మండలం దొరచెరువు వద్ద ఏకాంబరనాయుడు డాబా నడుపుతూ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. మదనపల్లె చిప్పిలి ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోందని మహిళలు ఫిర్యాదు చేశారు. తన భర్తపై కొంతమంది దాడిచేసి గాయపరిచినా పోలీసులు పట్టించుకోలేదని గంగవరానికి చెందిన మహిళ తెలి పింది.
చిత్తూరులో సమైక్యవాదుల ముసుగులో కొంతమంది కోర్టు ఎదురుగా ఉన్న వీధిలో రోడ్డుపై సీసాలు పగులగొట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు అందింది. సదుం ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో వెంకటప్ప సారా అమ్ముతున్నాడని ఆ ప్రాం త వాసులు ఫిర్యాదు చేశారు. చిత్తూరు నుంచి తిరుపతికి బదిలీ చేయడంతో డ్యూటీ చేయడానికి ఇబ్బంది పడుతున్నామని హోమ్‌గార్డు ఫిర్యాదు చేశారు. పుంగనూరులో తన భర్త రమణారెడ్డి వ్యభిచార గృహానికి వెళుతున్నాడని, తననూ ఆ వృత్తిలోకి రావాలని వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇసుక అక్రమ రవాణా, సారా విక్రయాలు, బెల్టుషాపుల ఆగడాలు, వరకట్న వేధింపులు తదితరాలతో కలిసి 25 మొత్తం ఫిర్యాదులందాయి.
లిఫ్ట్ అడిగితే నగలు దోచుకున్నారు
Published Thu, Aug 29 2013 2:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement
Advertisement