శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉపాధ్యాయులను బదిలీలకు నోచుకోకుండా చేస్తున్నాయి. బదిలీలు జరిగితే తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లిపోవచ్చని కొందరు ఉపాధ్యాయులు, ఇది వరలో బదిలీ అయినా రిలీవర్ లేక పాతస్థానాల్లోనే కొనసాగుతున్న వారు బదిలీల వల్ల తమకు విముక్తి లభిస్తోందని భావించారు. ఇటువంటి వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. విద్యాశాఖ 1956లో ఏర్పడిన తరువాత ఒకే అంశంపై ప్రభుత్వం విడుదల చేసిన ఐదు ఉత్తర్వుల అమలుకు నోచుకోక పోవడం ఇదే ప్రథమమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.
* సెప్టెంబరు 5న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 186ను విడుదల చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే వీటిపై మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఏ శాఖలోనూ బదిలీలు జరిగేందుకు అవకాశం లేకుండా పోయింది.
* సెప్టెంబర్ 30న ప్రభుత్వ మరో ఉత్తర్వు విడుదల చేస్తూ అక్టోబర్ పదో తేదీ వరకు బదిలీలపై ఆంక్షలను జన్మభూమి సందర్భంగా కొనసాగిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. జన్మభూమి పూర్తయినా ఇప్పటికి కూడా బదిలీల మార్గదర్శకాలు విడుదల కాలేదు.
* అక్టోబర్ 20న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 25ను విడుదల చేస్తూ ఉపాధ్యాయులకు బదిలీలు లేవని వర్క్ ఎడ్జిస్ట్‌మెంట్ పేరిట రేషనలైజేషన్ జరపాలని పేర్కొంది. ఈ ఉత్తర్వుల్లో జిల్లాను యూనిట్‌గా పరిగణించాలని తెలిపింది. దీన్ని అమలు చేయాలని యోచిస్తుండగా ప్రభుత్వం ఇంకో ఉత్తర్వును విడుదల చేసింది.
* అక్టోబర్ 30న 11925 సంఖ్యతో ఓ ఉత్తర్వును విడుదల చేస్తూ మండల పరిధిలో మాత్రమే వర్క్ ఎడ్జస్ట్‌మెంట్ పేరిట రేషనలైజేషన్ చేయాలని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పక్క మండలాలకు అవసరం మేరకు ఉపాధ్యాయులను తరలించాలని పేర్కొంది. 2013 బదిలీ ఉపాధ్యాయులను ఈ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకోకూడదు. గతంలో రేషనలైజేషన్‌లో వచ్చిన జూనియర్ ఉపాధ్యాయులను ఇప్పుడు అదనపు ఉపాధ్యాయునిగా చూపించకూడదు. ప్రస్తుతం పాఠశాలలో రెండేళ్లు సర్వీసు పూర్తికాకుంటే జూనియర్ అయినా రేషనలైజేషన్ చేయకూడదు. వీటివల్ల ఈ ఉత్తర్వులు అమలయ్యే సూచనలు లేవు. అయినా ప్రభుత్వం ఈ ఉత్తర్వును కాదని వేరొక ఉత్తర్వును విడుదల చేసింది.
* నవంబర్ ఆరో తేదీన 2093 సంఖ్య తో ఓ ఉత్తర్వును విడుదల చే స్తూ హైస్కూళ్లలో మాత్రమే సబ్జెక్టు టీచర్లను వర్క్ ఎడ్జ్‌స్ట్‌మెంట్ పేరిట రేషనలైజేషన్ చేయాలని తెలిపింది. హైస్కూళ్లలో ఏ మండలంలోనూ అదనపు ఉపాధ్యాయులు లేరని విద్యాశా ఖ ఎప్పుడో గుర్తించింది. అందువలన ఈ ఉత్తర్వులు అమలయ్యే పరిస్థితి లేదు.
* ఇలా రోజుకో రకమైన ఉత్తర్వును విడుదల చేస్తూ అధికారులను గందరగోళానికి గురిచేయడమే కాకుండా ఉపాధ్యాయులకు బదిలీలు లేకుండా చేసింది.
బదిలీలకు నోచుకోని అయ్యవార్లు!
Published Thu, Nov 13 2014 5:03 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement