విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ‘గురుబ్రహ్మ.. గురుర్విష్ణు.. గురుదేవో మహేశ్వరః.. గురుసాక్షాత్ పరబ్రహ్మ.. తస్మైశ్రీ గురవేనమః’. తల్లిదండ్రుల తరువాత గురువుకే ప్రముఖ స్థానం ఇచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడితో సరిపోల్చారు. గురుపూజోత్సవానికి ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారంటే గురువుకు ఈ దేశంలో, సమాజంలో ఏ స్థాయిలో గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.
కానీ ఇటీవలి పరిణామాలను చూస్తుంటే గురుశిష్యుల పవిత్రబంధం అపహాస్యమవుతోంది. విద్యావ్యవస్థలో ప్రయివేటు విష సంస్కృతి చొరవడడంతో చదువు‘కొన’డం ప్రారంభమయింది. విజ్ఞానం స్థానంలో వ్యాపారం జోరందుకోవడంతో గురుశిష్యులనే పదానికి అర్థమే మారిపోయిందంటున్నారు విద్యావేత్తలు. కార్పొ‘రేట్’ ఆవరణలో గురువు కాలయముడిగా, కీచకుడిగా మారుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
గురువుల వద్దకు తమ పిల్లల్ని పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల నగరంలోని పి.బి. సిద్ధార్థ కాలేజీ, ఆంధ్ర లయోల ఇంజినీరింగ్ కళాశాల, వడ్డేశ్వరం కె.ఎల్. యూనివర్సిటీల్లో జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే యాజమాన్యాల వికృత చేష్టలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. సిద్ధార్థ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు అధ్యాపకుడే కారణమన్న ఆరోపణలు మరిచిపోకముందే లయోల కళాశాలలోనూ మరో అధ్యాపకుడు విద్యార్థుల్ని వేధించడం బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మాటవినకపోతే మార్కులు కోతే
పలు ఎయిడెడ్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధ్యాపకులు డెరైక్టర్లదే హవా. తమ మాట వినకుండా ఎదురుతిరిగితే ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ మార్కుల్లో కోత వేస్తారు. తమ చేతిలో ఉన్న ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ మార్కులను తగ్గించేసి వేధింపులకు గురిచేస్తారు. చివరికి తమ దారిలోకి తెచ్చుకునే విధంగా కొందరు అధ్యాపకులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటానమస్ విధానం కూడా ఇందుకు దోహదపడుతోందని విద్యావేత్తలు భావిస్తున్నారు.
దారితప్పుతున్న ‘గురు’ స్థానం!
Published Wed, Apr 9 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement
Advertisement