Siddharth College
-
అర్హత సాధిస్తే.... సీటు గ్యారంటీ
పరీక్ష రేపే ఏర్పాట్లు పూర్తి విజయవాడ రీజియన్‌లో 70 పరీక్షా కేంద్రాలు హాజరుకానున్న 37 వేల మంది విద్యార్థులు పెనమలూరు, న్యూస్‌లైన్ : ఈ నెల 22న జరగనున్న ఎంసెట్- 2014 ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తే ఇంజనీరింగ్‌లో సీటు గ్యారంటీ అని రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.మోహనరావు తెలిపారు. మంగళవారం ఆయన కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంసెట్ ఏర్పాట్ల వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌కి 2,81,718 మంది, మెడిసిన్‌కి 1,11,779 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. మెడిసిన్, ఇంజనీరింగ్ రెండు పరీక్షలూ రాసేవారు 1,071 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు మొత్తం 3 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మెడిసిన్‌లో మాత్రం మూడు వేల సీట్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 రీజనల్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. విజయవాడ రీజియన్‌కు సంబంధించి నగరంలో మొత్తం 70 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో ఇంజనీరింగ్‌కి 22,050 మంది, మెడిసిన్‌కి 14,950 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఇంజనీరింగ్ దరఖాస్తుదారుల సంఖ్య 1,698 తగ్గగా మెడిసిన్‌కి 802 పెరిగినట్లు చెప్పారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించం... ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని రీజనల్ కోఆర్డినేటర్ తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మెడిసిన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందని వివరించారు. ఈ పరీక్ష నిర్వహణకు 54 మంది పరిశీలకులు, 1,860 మంది ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. నగరంలో పరీక్షా పత్రాలు అందజేయడానికి 9 రూట్లు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్షకు ఉదయం 9.15 గంటలకు, మెడిసిన్‌కు మధ్యాహ్నం 1.45 గంటలకు పరీక్ష హాలులోకి అనుమతిస్తామన్నారు. పరీక్షా సమయం ముగిసేవరకు విద్యార్థులను బయటికి వెళ్లడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎంసెట్ పరీక్ష కారణంగా విజయవాడలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని రీజనల్ కోఆర్డినేటర్ చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున పరీక్షకు ముందుగానే బయలుదేరాలని ఆయన సూచించారు. విద్యార్థులు పాటించాల్సిన ముఖ్య విషయాలివీ... విద్యార్థులు పాటించాల్సిన ముఖ్య అంశాలను మోహనరావు వివరించారు. విద్యార్థులు ఆన్లైన్ అప్లికేషన్‌పై ఫొటో అంటించి అటెస్టేషన్ చేయించి తీసుకురావాలి. దానిని పరీక్ష హాలు పరిశీలకునికి అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కులధృవీకరణ పత్రం అందజేయాలి. ఓఎంఆర్ షీట్ పై అభ్యర్థి పూర్తి వివరాలు నమోదు చేయాలి. విద్యార్థుల వేలిముద్ర నామినల్ ఈట్‌పై వేయాలి. ఓఎంఆర్ షీట్‌పై బ్లూ, బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో సమాధానం నమోదు చేయాలి. హాల్‌టిక్కెట్ తప్పనిసరి. పరీక్ష హాలులోకి కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ప్రశ్నపత్రాన్ని విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లవచ్చు. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. -
విజయవాడ ఈస్ట్ కౌంటింగ్‌లో గందరగోళం
వైఎస్సార్ సీపీ ఏజెంట్ల ఆందోళన ఈవీఎంలో ఓట్లు తారుమారు ! గంటసేపు నిలిపివేత రీకౌంటింగ్ చేస్తామన్న ప్రకటనతో సాగిన కౌంటింగ్ పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాక్షి, విజయవాడ: విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలోని ఒక ఈవీఎంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లు కాస్త ఇండిపెండెంట్ అభ్యర్థికి పోలైనట్లు ఈవీఎంలో కనిపించి ప్రధాన పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడనట్లు మిషన్ చూపడం వివాదానికి కారణమయ్యింది. శుక్రవారం కానూరులోని పీవీపీ సిద్ధార్థ కళాశాలలో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి రాధకృష్ణ, టీడీపీ నుంచి గద్దె రామ్మోహనరావు కాంగ్రెస్ నుంచి దేవినేని నెహ్రు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఉద యం 8గంటలకు కౌంటింగ్ మెదలైంది. ఆరో రౌండ్లో మూడో నెంబరు టేబుల్లో ఉన్న ఈవిఎం పనితీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాణిగారితోటలోని 176 పోలింగ్ బూత్‌లో ఉన్న ఈవి ఎం లెక్కింపులో ఇబ్బంది తలెత్తింది. ఎనిమిదో నెంబరు స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వంగవీటి రాధకృష్ణకు సున్నా ఓట్లు వచ్చినట్లు రాధ తర్వాత స్థానంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి 668 ఓట్లు వచ్చినట్లు మిషన్‌లో నమోదయాఇంది. వాస్తవానికి వంగవీటి రాధకృష్ణకు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. దీంతో అక్కడ మెజార్టీ వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఎజెంట్లు ధీమాతో ఉన్నారు. అయితే లెక్కింపులో సున్నా రావటంతో ఏజెంట్లు అశ్చర్యానికి లోనై అక్కడి అధికారులను ప్రశ్నించగా వారేమి బదులివ్వకపోవటంతో ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తక్షణమే కౌంటింగ్ నిలిపివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. తర్వాత రిటర్నింగ్ అధికారి మళ్లీ 176 బూత్ ఓట్లను రీకౌంటింగ్ చేస్తామని ప్రకటించారు. అయితే వివాదం తలెత్తిన క్రమంలో సుమారు గంటసేపు కౌంటింగ్ ప్రకియ నిలిచిపోయింది. సిబ్బంది పోరపాటుతో... వాస్తవానికి ఈవిఎంలు తెచ్చిన సిబ్బంది చేసిన పోరపాటు వల్ల ఈవివాదం జరిగింది. కౌం టింగ్ కేంద్రంలో మూడో నెంబరు టేబుల్లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు, 10 నెంబరు టేబుల్లో విజయవాడ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈక్రమంలో 10 నెంబరు టేబుల్లో లెక్కించాల్సిన పార్లమెంట్ ఈవిఎంను మూడో టేబుల్లో పెట్టి అసెంబ్లీ ఓటింగ్‌గా లెక్కించటంతో ఈసమస్య ఉత్పన్నం అయింది. పార్లమెంట్ ఈవిఎంలో 8 నెంబరు స్వతంత్ర అభ్యర్థి, అసెంబ్లీలో రాధా ఉన్నారు. దీంతో పార్లమెంట్ ఈవిఎంను అసెంబ్లీలో లెక్కించటంతో సున్నా ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహం అనంతరం సుమారు గంటసేపు కౌంటింగ్ ఆపివేసి సమస్య మూలాల్ని గుర్తించి తర్వాత ఏజెంట్ల అనుమతితో ఈవిఎంలు మార్చి లెక్కించగా 176 బూత్‌లో వంగవీటి రాధాకృష్ణకు 300 పైచిలుకు ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ సెంటర్‌కు కలెక్టర్, సీపీ వివాదం తలెత్తిందన్న సమాచారం తెలుసుకున్న కలెక్టర్ రఘునందన్‌రావు, విజయవాడ నగర కమిషనర్ బి. శ్రీనివాసులు ఈస్ట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అక్కడి అధికారులు అప్పటికే సమస్యను సరిదిద్దారు. ఈక్రమంలో కౌంటింగ్ కేంద్రంలోని ఏజెంట్లతో అధికారులు మాట్లాడారు. దీంతో బందోబస్తు అక్కడ భారీగా పెంచారు. మరోవైపు 267 బూత్‌లు కావటంతో 37 రౌండ్లు ఏర్పాటు చేశారు. దీంతో కౌంటింగ్ అలస్యంగా సాగుతుంది. -
దారితప్పుతున్న ‘గురు’ స్థానం!
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ‘గురుబ్రహ్మ.. గురుర్విష్ణు.. గురుదేవో మహేశ్వరః.. గురుసాక్షాత్ పరబ్రహ్మ.. తస్మైశ్రీ గురవేనమః’. తల్లిదండ్రుల తరువాత గురువుకే ప్రముఖ స్థానం ఇచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడితో సరిపోల్చారు. గురుపూజోత్సవానికి ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారంటే గురువుకు ఈ దేశంలో, సమాజంలో ఏ స్థాయిలో గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటీవలి పరిణామాలను చూస్తుంటే గురుశిష్యుల పవిత్రబంధం అపహాస్యమవుతోంది. విద్యావ్యవస్థలో ప్రయివేటు విష సంస్కృతి చొరవడడంతో చదువు‘కొన’డం ప్రారంభమయింది. విజ్ఞానం స్థానంలో వ్యాపారం జోరందుకోవడంతో గురుశిష్యులనే పదానికి అర్థమే మారిపోయిందంటున్నారు విద్యావేత్తలు. కార్పొ‘రేట్’ ఆవరణలో గురువు కాలయముడిగా, కీచకుడిగా మారుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గురువుల వద్దకు తమ పిల్లల్ని పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల నగరంలోని పి.బి. సిద్ధార్థ కాలేజీ, ఆంధ్ర లయోల ఇంజినీరింగ్ కళాశాల, వడ్డేశ్వరం కె.ఎల్. యూనివర్సిటీల్లో జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే యాజమాన్యాల వికృత చేష్టలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. సిద్ధార్థ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు అధ్యాపకుడే కారణమన్న ఆరోపణలు మరిచిపోకముందే లయోల కళాశాలలోనూ మరో అధ్యాపకుడు విద్యార్థుల్ని వేధించడం బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాటవినకపోతే మార్కులు కోతే పలు ఎయిడెడ్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధ్యాపకులు డెరైక్టర్లదే హవా. తమ మాట వినకుండా ఎదురుతిరిగితే ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ మార్కుల్లో కోత వేస్తారు. తమ చేతిలో ఉన్న ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ మార్కులను తగ్గించేసి వేధింపులకు గురిచేస్తారు. చివరికి తమ దారిలోకి తెచ్చుకునే విధంగా కొందరు అధ్యాపకులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటానమస్ విధానం కూడా ఇందుకు దోహదపడుతోందని విద్యావేత్తలు భావిస్తున్నారు.