తెలంగాణ ముసాయిదా బిల్లు కాసేపట్లో రాష్ట్రానికి చేరనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతిని కలిసి ముసాయిదా బిల్లును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సురేష్ కుమార్ ఆయనకు అందజేస్తారు. దీనిపై చర్చించి, అభిప్రాయాలను తెలియజేయడానికి రాష్ట్ర అసెంబ్లీకి జనవరి 23 వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ బిల్లు మీద ఇప్పటికే సీమాంద్ర ప్రాంత నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఓ తీర్మానం చేయాలని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే మరోవైపు తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరిపోయింది.
రాష్ట్రానికి తెలంగాణ ముసాయిదా బిల్లు
Published Thu, Dec 12 2013 5:53 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement