'తెలంగాణ' పార్లమెంట్ లోనే తేలుతుంది: చిదంబరం
తెలంగాణ బిల్లును గెలిపించడమా.. ఓడించడమా అన్నది పార్లమెంట్ లో తేలుతుంది అని కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం అన్నారు. బిల్లుపై అనుకూలత, వ్యతిరేకత అనేది ఈ లోక్‌సభలో కాకుంటే వచ్చే లోక్‌సభలోనూ ఉంటుంది అని చిదంబరం అనడం అనేక సందేహాలకు తావిస్తోంది.
తెలంగాణ నుంచి 17 మంది, సీమాంధ్ర నుంచి 25 మంది ఎంపీలున్నారని, ఎంపీలంతా వారి ప్రాంతాలనుకూలంగా వ్యవహరిస్తే, వచ్చే లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది అని చిదంబరం స్ఫష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపాం. శ్రీకృష్ణ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా పార్లమెంట్ ముందుకు వచ్చిన తర్వాతనే తెలంగాణ బిల్లుపై నిర్ణయం తీసుకున్నామని చిదంబరం వ్యాఖ్యలు చేశారు.