srikrishna committee
-
అది వంద మందిదే.. అందరిదీ కాదు.. ఢిల్లీ ఎక్కడుంది
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): అన్ని వర్గాల భాగస్వామ్యం లేని అమరావతి రాజధాని ఎలా అవుతుందని రాయలసీమ మేధావుల ఫోరం ప్రశ్నించింది. రాజధాని ఏర్పాటు సమయంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను గత సర్కారు విస్మరించిందని పేర్కొంది. అమరావతిలో 50 నుంచి వంద మంది వ్యక్తం చేసే అభిప్రాయం రాçష్టం మొత్తానికి వర్తిస్తుందా? అని నిలదీసింది. అమరావతి రైతుల పేరుతో చేపట్టిన ఉద్యమంలో నిజాయితీ లేదని, కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే ఉందని ఫోరం స్పష్టం చేసింది. అది ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన నాయకులు, ప్రజాభిమానాన్ని కోల్పోయిన పార్టీలు నడిపిస్తున్న పెయిడ్ ఉద్యమమని విమర్శించింది. అమరావతి రైతుల పేరిట రాయలసీమ వాసులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించింది. రాయలసీమకు హైకోర్టు వద్దని అడ్డుపడుతున్న వారు ఎస్వీయూలో బహిరంగ సభ నిర్వహిస్తామంటే ఎలా అనుమతిస్తామని సూటిగా ప్రశ్నించింది. తిరుపతిలో సభ నిర్వహించేందుకు వీలు లేదని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఫోరం ప్రకటించింది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అందరూ స్పందించాలని, ఈ అంశంపై బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్తామని ఫోరం ప్రకటించింది. శ్రీకాళహస్తి, పుత్తూరు, ఎస్వీ యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను జాగృతం చేస్తామని స్పష్టం చేసింది. ‘ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచన – రాయలసీమ ప్రజల మనోగతం’ అనే అంశంపై రాయలసీమ మేధావుల ఫోరం మంగళవారం ఎస్వీయూలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీ ఎక్కడుంది? ‘రాజధాని నడిబొడ్డున ఉండాలన్న నిబంధన ఎక్కడుంది? దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉందా?’ అని ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఆధారంగా ఏమూల నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. తమిళనాడు నుంచి రాయలసీమకు వస్తున్న పెట్టుబడులను గత ప్రభుత్వం అడ్డుకుని అమరావతిలోనే పెట్టాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసని చెప్పారు. డబ్బులు వెదజల్లి రెచ్చగొట్టే యత్నాలు.. అమరావతి ఒక వర్గానికి సంబంధించిన రాజధాని అని ప్రొఫెసర్ ఎ.సుధాకరయ్య పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఉంటే అమరావతి రైతులకు వచ్చే నష్టం ఏమిటని ప్రొఫెసర్ నాగోలు కృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం పేరిట డబ్బులు వెచ్చించి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు జరుగుతున్న కుట్రని చెప్పారు. రాయలసీమలో ఎక్కడ సభ తలపెట్టినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటును ఏనాడు ప్రశ్నించలేదని ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. కోస్తా ప్రజలకు రాజధాని అడిగే హక్కు న్యాయపరంగా, నైతికంగా లేదన్నారు. తాము ఉత్తరాంధ్రతో కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామన్నారు. సీమవాసుల మద్దతు దుష్ప్రచారమే.. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ వాసులు అమరావతికి మద్దతిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సీమ ప్రజలు తమ ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నట్లు నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తిరస్కరించిన ఒకరిద్దరు నాయకులు మినహా ఎవరూ అమరావతి ఉద్యమాన్ని అంగీకరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే మోసానికి గురై మద్రాస్, కర్నూలు నుంచి రాజధాని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే దక్కాలని స్పష్టం చేశారు. ఇక్కడ గ్రామీణ వాతావరణం గల పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. అమరావతి రైతులు రాజధానికి భూములు త్యాగం చేశారని కొందరు నాయకులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని, వ్యాపారమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావాలని గతంలో బీజేపీ, వామపక్షాలు ఒప్పుకున్నాయని, రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గత సర్కారు పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలోసీమకు మెడికల్ సీట్లు రాకుండా నష్టం కలిగించిందని, దీనిపై ఉద్యమిస్తే అడ్డుకుందని గుర్తు చేశారు. -
డేటా భద్రతకు చట్టం
సమాచార సాంకేతిక రంగ నిపుణులు ఎంతకాలం నుంచో కోరుతున్న వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం సాకారం అయ్యేందుకు తొలి అడుగు పడింది. కేంద్ర కేబినెట్ బుధవారం ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఏడాదిపాటు ఐటీ రంగ నిపుణులతో, సంస్థలతో సంప్రదింపులు జరిపి, వివిధ దేశాలు అమలు చేస్తున్న చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ బిల్లును రూపొందించింది. ఆ కమిటీ నిరుడు సమర్పించిన బిల్లుపై అభిప్రాయాలు సేకరించి తగిన మార్పులు, చేర్పులూ చేశాక ప్రస్తుత బిల్లు కేబినెట్ ముందుకొచ్చింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్తో అనుసంధానమైంది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు మొదలుకొని అనేకానేక ఎలక్ట్రానిక్ పరికరాలు అందులో భాగంగా మారాయి. ఈ డిజిటల్ యుగంలో ఈమెయిల్ ఖాతా లేని వారు, వేర్వేరు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ప్రారంభించనివారు ఉండరు. అలా ఖాతా ప్రారంభించే ప్రతి ఒక్కరినుంచి వివిధ సంస్థలు విస్తృతంగా డేటా సేకరిస్తున్నాయి. వారి పేరు, వయసు, చిరునామా, ఫోన్ నంబర్, వారి ఇష్టాయిష్టాలు మొదలైనవన్నీ అందులో ఉంటాయి. అయితే ఈ సమాచారాన్నంతా వారు దేనికి వినియోగిస్తారో, ఎందుకు సేకరిస్తారో ఎవరికీ తెలియదు. గూగుల్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాలన్నీ డేటా సేకరణ చేస్తున్నాయి. నాలుగేళ్లక్రితం కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) అనే సంస్థకు ఫేస్బుక్ తన ఖాతాదార్ల సమాచారాన్ని అమ్ముకుందని వెల్లడైంది. ఇలాంటి డేటాతో వ్యాపార వాణిజ్య సంస్థలు తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవడం రివాజైంది. సీఏ సంస్థ మన దేశంలోని కొన్ని రాజకీయ పక్షాలతో ఒప్పందం కుదుర్చుకుని భిన్న ప్రాంతాల ఓటర్ల కుల, మత వివరాలు, వారి ఇష్టాయిష్టాలు వగైరాలు అందజే సింది. పౌరుల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడి చాలామంది బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఆ మధ్య ఆధార్ డేటా కూడా లీకైంది. ఈ నేపథ్యంలో డేటా పరిరక్షణ చట్టం అవసరం ఎంతో వుంది. సమాచార సాంకేతిక నిపుణులు దీని అవసరం గురించి ఎప్పటినుంచో చెబుతున్నారు. చాలా దేశాలు ఇప్పటికే ఈ తరహా చట్టాలు తీసుకొచ్చాయి. తమ ఖాతాదార్లు వీడియోలు చూసే సగటు సమయం గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందని ఫేస్‌బుక్‌పై అనేక వాణిజ్య ప్రకటన సంస్థలు న్యాయస్థానాల్లో కేసులు వేస్తే మొన్న అక్టోబర్‌లో ఫేస్బుక్ యాజ మాన్యం 4 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. తమ పౌరులు ఫేస్బుక్ ఖాతాల్లో వ్యక్తిగత విని యోగం కోసం పెట్టుకున్న ఫొటోలన్నీ బట్టబయలయ్యాయని, అందుకు 2లక్షల 70 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని టర్కీ శ్రీముఖం పంపింది. అక్కడ మాత్రమే కాదు... రష్యా, ఇటలీ, బ్రిటన్, అమెరికా, జర్మనీ తదితర దేశా లన్నిటా ఫేస్‌బుక్‌పై లక్షలాది డాలర్లు పరిహారంగా చెల్లించా లంటూ దావాలు పడ్డాయి. ఈ ఏడాది ఇంతవరకూ దాఖలైన కేసుల్లో ఫేస్బుక్ సంస్థ దాదాపు 516 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం దాని వార్షిక ఆదాయంలో దాదాపు ఏడున్నర శాతం. డేటా సేకరణ, నిక్షిప్తం, వినియోగం వంటి అంశాల్లో ఈ బిల్లు అనేక నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించింది. వ్యక్తుల ముందస్తు అనుమతి లేనిదే వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ అందజేయరాదని బిల్లు నిర్దేశిస్తోంది. అయితే పౌరుల సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేయాలన్న విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సంస్థలన్నీ ఆ సమాచారాన్ని ఈ దేశంలో నెలకొల్పే సర్వర్లలో మాత్రమే భద్రపరచాలని లోగడ చెప్పగా, ఇప్పుడు దాన్ని సవరించి వ్యక్తుల సున్నితమైన సమాచారాన్ని, కీలక సమాచారాన్ని ఇక్కడి సర్వర్లలో ఉంచాలని...ఇతరత్రా సమాచా రమైతే ఆయా సంస్థలు ఏ సర్వర్లలో భద్రపరిచినా అభ్యంతరం లేదని తాజా ముసాయిదా బిల్లు చెబుతోంది. ప్రభుత్వం ఇచ్చే నిర్వచనాన్నిబట్టి ‘కీలక సమాచారం’ ఏమిటన్నది నిర్ణయమవుతుంది. అవసరాన్నిబట్టి ఈ నిర్వచనం పరిధిలోకి కొత్త అంశాలు చేరే అవకాశం ఉంటుంది. సున్నితమైన సమాచారం విషయంలో ఖాతాదారు అనుమతి అవసరమవుతుంది. డేటా నిక్షిప్తానికి ఇక్కడ సర్వర్లు నెలకొల్పాలని మన ప్రభుత్వం పట్టుదలకుపోతే... వేరే దేశాల్లోని మన సంస్థలపై కూడా అక్కడి ప్రభుత్వాలు ఇలాంటి షరతులే పెట్టే ప్రమాదం ఉందని, అందువల్ల తమపై ఆర్థిక భారం పడుతుందని ఐటీ సంస్థలు మొరపెట్టుకున్నాయి. దీంతో బిల్లులో మార్పులు చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్వంటి సంస్థలు ఖాతాదారులు అందజేసే వ్యక్తిగత సమాచారాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాల్సివుంటుంది. ఈ బిల్లు చట్టమైతే వారు నిజమైన వ్యక్తులేనా లేక వేరేవారి పేర్లతో ఖాతాలు ప్రారంభించారా అన్నది తెలుసుకోకతప్పదు. తప్పుడు పేర్లతో ప్రవేశించినవారే సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా, బాధ్యతారహితంగా వ్యాఖ్యానాలు చేయడం, కించపరచడం లాంటివి చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిబంధన పొందుపరిచారు. అలాగే అన్ని సంస్థలూ తమ తమ ప్రతినిధులను ఈ దేశంలో నియమించుకోవడం ఇకపై తప్పనిసరి. సంస్థలకు జవాబు దారీతనం ఉండాలన్న సంకల్పంతో ఈ నిబంధన పెట్టారు. ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారణైతే సంస్థలో డేటా పరిరక్షణ బాధ్యతలు చూస్తున్న వ్యక్తికి మూడేళ్లవరకూ జైలు, రూ. 15 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. తమ వ్యక్తిగత డేటా అవాంఛిత వ్యక్తులు, సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు. అయితే ఇతర హక్కుల మాదిరి ఈ హక్కుకు భౌగోళిక సరిహద్దులుండవు. కనుక ఇలాంటి చట్టానికి రూపకల్పన చేయడం కత్తి మీది సాము. ఈ క్రమంలో ప్రభుత్వాలకు వ్యక్తుల డేటాపై ఏదోమేరకు ఆధిపత్యం లభించడం కూడా తప్పనిసరి. ఆలస్యంగానైనా ఇలాంటి చట్టం రాబోతుండటం హర్షించదగ్గ విషయం. -
అమరావతికి పార్లమెంట్ ఆమోదం లేదు!
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం నియమించిన శివ రామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పటికీ దానికి పార్లమెంట్ ఆమోదం లేదని, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం మాత్రమే ఉందని పలువురు వక్తలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద నగరాన్ని నిర్మించాలనే భ్రమలో చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లూ కొట్టుమిట్టాడి.. దాని చుట్టూనే పరిభ్రమించిందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి.. చంద్రబాబు చెప్పినట్టు ఏ రైతూ సొంతంగా తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని, మెడ మీద కత్తి పెట్టి భూములు లాక్కున్నారన్నారు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్– అభివృద్ధి– సమస్యలపై ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఆంధ్రప్రదేశ్’ విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ముగింపు రోజైన సోమవారం అమరావతి, రాజధాని అభివృద్ధిపై సదస్సు జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సెస్ (హైదరాబాద్)కు చెందిన డాక్టర్ సి.రామచంద్రయ్య, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పురేంద్ర ప్రసాద్, వి.రాజగోపాల్, సామాజిక సేవా కార్యకర్తలు అనుమోలు గాంధీ, ఎం.శేషగిరిరావు, మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, తదితరులు ప్రసంగించారు. చంద్రబాబు తలపెట్టిన భూసమీకరణ పెద్ద బోగస్ అని, సీఆర్డీఏ ప్రాంతంలో గత ఐదేళ్లు మిలటరీ తరహా పాలన సాగిందని శేషగిరిరావు ఆరోపించారు. చివరకు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకున్నారన్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే చెప్పి తన అనుచరులు భూములు కొనుక్కునేలా చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేయించారని ధ్వజమెత్తారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు సీఆర్డీఏ పనికి వచ్చిందని, వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయని గాంధీ ఆరోపించారు. రాజధాని నిర్మాణాన్ని అవుట్సోర్సింగ్ సంస్థలకు అప్పగించడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని పురేంద్రప్రసాద్ చెప్పారు. ప్రతి గ్రామాన్ని పోలీసు క్యాంపుగా మార్చి ప్రజలను భయపెట్టి భూముల్ని గుంజుకున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. మాజీ ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ ప్రజలకు ఏది కావాలో దాన్నే పాలకులు చేపడితే సత్ఫలితాలు వస్తాయన్నారు. -
చందా కొచర్ దోషే!!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ కమిటీ... ఈ వ్యవహారంలో ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం ఈ విషయాలు వెల్లడించింది. చందా కొచర్ ఇప్పటికే రాజీనామా చేసినప్పటికీ... నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. రాజీనామా కాస్తా ఉద్వాసనగా మారడంతో ఆమె పొందిన ఇంక్రిమెంట్లు, బోనస్‌లు, వైద్య చికిత్స పరమైన ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్స్ మొదలైనవి రద్దవుతాయని తెలిపింది. 2009 ఏప్రిల్ నుంచి 2018 మార్చి దాకా చందా కొచర్ పొందిన బోనస్‌లన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. వివాదం వెలుగు చూశాక చాన్నాళ్ల దాకా చందా కొచర్‌ను వెనకేసుకొచ్చిన బ్యాంక్... తాజాగా నివేదిక నేపథ్యంలో స్వరం మార్చడం గమనార్హం. ఈ వివాదంలో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ తదితరులపై సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంక్ నైతిక నియమావళి, విధుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను చందా కొచర్ ఉల్లంఘించారని విచారణ నివేదికలో వెల్లడైంది’ అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఆమె అశ్రద్ధ వల్ల బ్యాంక్ విధానాలు నిర్వీర్యమయ్యాయని ఆక్షేపించింది. ఆకాశం నుంచి అధఃపాతాళానికి.. దేశీ రిటైల్ బ్యాంకింగ్ స్వరూపాన్ని మార్చేసిన అత్యంత శక్తిమంతమైన మహిళగా కొన్నాళ్ల క్రితం దాకా సర్వత్రా ప్రశంసలు అందుకున్న చందా కొచర్ .. వీడియోకాన్ రుణ వివాదంతో అప్రతిష్ట పాలైన సంగతి తెలిసిందే. 2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన రూ. 3,250 కోట్ల రుణాల విషయంలో అవకతవకలు జరిగాయని, ఈ లావాదేవీల ద్వారా చందా కొచర్ భర్త దీపక్ కొచర్, ఆమె కుటుంబ సభ్యులు లబ్ధి పొందారంటూ కొన్నాళ్ల క్రితం ప్రజావేగు ఒకరు బైటపెట్టడంతో ఈ కేసుపై అందరి దృష్టి మళ్లింది. బ్యాంకు నుంచి రుణం పొందిన వెంటనే వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ .. దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిన కమిటీలో చందా కొచర్ కూడా ఉండటం అనుమానాలు రేకెత్తించింది. ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ముందుగా చందా కొచర్‌ను వెనకేసుకొచ్చినప్పటికీ.. వివాదం మరింత ముదరడంతో వెనక్కి తగ్గింది. 2018 జూన్ 6న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో సమగ్ర విచారణ కోసం స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో పరిశీలించిన డైరెక్టర్లు తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదంపై విచారణ జరుపుతున్న సీబీఐ.. ఇటీవలే చందా కొచర్, దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్ తదితరులపై క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. షాకింగ్ నిర్ణయం తనను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించాలన్న బ్యాంక్ బోర్డు నిర్ణయంపై చందా కొచర్ విచారం వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్ర నిరాశకు, షాక్‌కు గురిచేసిందన్నారు. బ్యాంకు మంజూరు చేసే రుణాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలేవీ ఏకపక్షంగా ఉండవని ఆమె స్పష్టం చేశారు. ‘అంతిమంగా సత్యమే జయిస్తుందని నమ్ముతున్నాను. కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో నేనెప్పుడూ వెనుకాడలేదు, ఒక ప్రొఫెషనల్‌గా ఎప్పుడూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు‘ అని చందా కొచర్ చెప్పారు. లాభం 3% డౌన్ రూ. 1,605 కోట్లు ∙మొండిబాకీలకు పెరిగిన కేటాయింపులు న్యూఢిల్లీ: మొండిబాకీలకు కేటాయింపులు పెరగడంతో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో 3 శాతం క్షీణించి రూ.1,605 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.1,650 కోట్లు. క్యూ3లో ఆదాయం రూ. 16,832 కోట్ల నుంచి రూ.20,163 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం వృద్ధితో రూ. 5,705 కోట్ల నుంచి రూ.6,875 కోట్లకు పెరిగింది. ట్రెజరీ ఆదాయం కూడా రూ. 66 కోట్ల నుంచి ఏకంగా రూ.479 కోట్లకు ఎగియగా, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతంగా నమోదైంది. మొండి బాకీలు క్షీణించినప్పటికీ.. వాటికి సంబంధించిన కేటాయింపులు రూ. 3,570 కోట్ల నుంచి రూ. 4,244 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే లాభం 1.1 శాతం క్షీణించి రూ. 1,874 కోట్లుగా నమోదైంది. అనుబంధ సంస్థల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు అసెట్ క్వాలిటీ మెరుగుపడినా.. మొండిబాకీలకు మరింత ప్రొవిజనింగ్ చేయాలని బ్యాంక్ భావించడమే ఇందుకు కారణం. మొత్తం ప్రొవిజనింగ్ 18.89 శాతం పెరిగింది. ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తిని మెరుగుపర్చుకోవడం, గత మొండిబాకీల ప్రభావాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సంస్థ సీఈవో సందీప్ బక్షి తెలిపారు. 2.58 శాతానికి ఎన్పీఏలు.. మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) స్వల్పంగా 7.82% నుంచి 7.75%కి తగ్గాయి. అటు నికర ఎన్పీఏలు 4.20 శాతం నుంచి 2.58 శాతానికి దిగివచ్చాయి. విలువపరంగా చూస్తే మాత్రం స్థూల ఎన్పీఏలు రూ. 46,038 కోట్ల నుంచి రూ.51,591 కోట్లకు పెరగ్గా, నికర మొండిబాకీలు మాత్రం రూ.23,810 కోట్ల నుంచి రూ. 16,252 కోట్లకు తగ్గాయి. బుధవారం బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 5.29 శాతం ఎగిసి రూ. 365.25 వద్ద క్లోజయ్యింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
ఆన్లైన్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్
న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్, మింత్రా.. వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో భారీ డిస్కౌంట్ల కోసం వేచిచూస్తున్నారా? ఈ సారి డిస్కౌంట్ ఆఫర్లో ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయాలని ప్లాన్ వేసుకున్నారా? అయితే ఇది మీకు కచ్చితంగా నిరాశ కలిగించే వార్తనే. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ఆఫర్ చేసే మెగా డిస్కౌంట్ ఆఫర్లకు ఇక త్వరలోనే కళ్లెం పడబోతుంది. భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించి తక్కువ ధరలకు ప్రొడక్ట్‌లను విక్రయించే వాటిపై ఓ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాను కూడా ప్రతిపాదించింది. ఈ ముసాయిదాలో వినియోగదారులను ఆకర్షించేందుకు, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ఇప్పటివరకు ఇస్తూ వచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్లను నిలిపివేయాల్సి ఉందని ప్రతిపాదించారు. ఈ ముసాయిదా విధానాన్ని సోమవారం స్టేక్‌హోల్డర్స్‌కు కూడా షేర్ చేసింది. ఈ ప్రతిపాదిత చట్టంలోకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ విక్రయ సంస్థలతో పాటు స్విగ్గీ, జొమాటో లాంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సైట్లు, ఆర్థిక లావాదేవీలు అందించే పేటీఎం, అర్బన్‌క్లాప్, పాలసీ బజార్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు రానున్నాయి. ఈ ముసాయిదా ఈ-కామర్స్ విధానాన్ని కేంద్రం, డేటా ప్రైవసీపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అందించిన ప్రతిపాదనల మేరకు రూపొందించింది. వ్యక్తిగత వివరాల భద్రత బిల్లు- 2018 ముసాయిదాను జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందులో వ్యక్తుల కీలక సమాచారాన్ని భారత్‌లో ఉన్న కేంద్రాల్లోనే నిక్షిప్తం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ-కామర్స్ విధాన ముసాయిదాను కూడా ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగానే రూపొందించినట్లు వాణిజ్య కార్యదర్శి- డిజిగ్నేట్ అనుప్ వాదవాన్ తెలిపారు. ఈ-కామర్స్ విధాన ముసాయిదా రూపకల్పన నిమిత్తం ఓలా, స్నాప్‌డీల్, మేక్ మై ట్రిప్, అర్బన్ క్లాప్, జస్ట్‌డయల్ ప్రతినిధులతో ఓ నిపుణుల కమిటీని కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారత్ ఈ-కామర్స్ రంగం 25 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఈ దశాబ్దంలో 200 బిలియన్ డాలర్లను తాకనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈ-కామర్స్ రంగం భారీగా బలపడింది. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు వినియోగదారులను క్యాష్ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. దీంతో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు అక్రమ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ.. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఫిజికల్ రిటైల్ స్టోర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ అమ్మకాల్లో అక్రమ డిస్కౌంట్లకు చెక్ పెట్టడానికి ఇప్పడివరకు ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేదు. కొన్ని బ్రాండులు సైతం తమ ఉత్పత్తులను ఆన్లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్ విక్రయిస్తున్నాయని వాపోతున్నాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని భావించిన ప్రభుత్వం, ముసాయిదా ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. -
పట్టిసీమ జపం మానండి బాబూ..!
నేడు పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు విడుదల చేయనున్నారు. అయితే సిద్ధేశ్వరం ద్వారానే పోతిరెడ్డిపాడు తూముల నుంచి రాయలసీమకు నీరందుతుందనే నిజాన్ని గ్రహించి, పట్టిసీమ జపం మాని, సీమకు నీరందించే మార్గం వైపు సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలి. లేదంటే శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టుగా మరో సీమ ఉద్యమాన్ని చవిచూడక తప్పదు. ఈనెల 6వ తేదీన పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు విడుదల చేస్తున్నట్టు చంద్ర బాబు ప్రకటించారు. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణకు మళ్లించి రాయలసీమకు మేలు చేస్తు న్నామని పదే పదే తెలుగు దేశం ప్రభుత్వం ఊదరగొడు తున్నది. పట్టిసీమ ప్రభుత్వ ఉత్తర్వులో రాయలసీమకు నీళ్లు ఇస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు. కానీ, రాయల సీమకు పట్టిసీమ ద్వారా నీరందిస్తామని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. శుష్క వాగ్దానాలతో రాయలసీమ వాసుల్ని వంచించడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడడం లేదు. రాయలసీమకు కృష్ణా జలాలను తరలించేందుకు ఉన్న ఏకైక మార్గం పోతిరెడ్డిపాడు. ఈ పోతిరెడ్డిపాడు తూముల ద్వారా నీరు విడుదల చేయాలంటే శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 841 అడుగులపైన ఉండాలి. అయితే, శ్రీశైలం జలాశయంలో 854 అడుగు లకు పైన ఉంటేనే రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే నిబం ధన ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1996లో జీవో నంబరు 69 ద్వారా శ్రీశైలం కనీస నీటి మట్టపు స్థాయిని 834 అడుగులకు కుదించింది. ఈ 69వ నంబరు జీవోను రద్దుచేసి తిరిగి 854 అడుగుల కనీస నీటిమట్టం స్థాయిని ఉంచితే తప్ప పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు అందవు. 1996కు ముందు కనీస నీటి మట్టపు స్థాయి 854 అడుగులు ఉండేది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటిమట్టం స్థాయి ఉండేలా జీవో తీసుకువస్తే, టీడీపీ వర్గం తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి తిరిగి 834 అడుగుల స్థాయిలో ఉండేట్టుగా జీవోను తీసుకు వచ్చింది. రాయలసీమ ప్రాంతానికి నీరు అందించే చాలా పథకాలకు శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు తూముల ద్వారా మాత్రమే నీరు తీసుకోవాల్సి ఉంటుంది. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు కొన్ని నికర జలాల మీద, మరికొన్ని మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ నీళ్లయినా పోతిరెడ్డిపాడు తూముల ద్వారానే రావాల్సి ఉంటుంది. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండినప్పుడు దాని పూర్తి స్థాయి 885 అడుగులు ఉంటుంది. జీవో 69 ప్రకారం జలాశయం కనీస నీటి విడుదల మట్టం (మినిమం డ్రాడౌన్ లెవెల్) 834 అడుగులు. శ్రీశైలం జలాశయం ఎగువ భాగంలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అడుగు భాగం మట్టం (సిల్ లెవెల్) 842 అడుగులు. రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా నీరందా లంటే క్యారీ ఓవర్ రిజర్వాయర్‌గా శ్రీశైలం రిజర్వాయరు లోనే పైభాగంలో కృష్ణానదిపై 860 అడుగుల సిల్ లెవెల్‌తో ఒక అలుగు నిర్మించాలి. ఇదే సిద్దేశ్వరం అలుగు. ఈ అలుగు శ్రీశైలం డ్యాంకు సుమారు 90 కిలోమీటర్ల పై భాగాన ఉంటుంది. ఈ అలుగు 600 మీటర్లకు మించి లేదు. ఖర్చు 600 కోట్ల రూపాయలు కూడా కాదు. ఈ అలుగు వల్ల 50 టీఎంసీల నీళ్లు నిలువ చేయవచ్చు. దీనివల్ల పోతిరెడ్డిపాడు ద్వారా రాయల సీమకు నీళ్లందివ్వడం తేలిక. తెలంగాణ ప్రాంతానికి 90 రోజులపాటు నీరు తీసుకుపోయే అవకాశం జీవో నంబర్ 69 ఇస్తున్నది. 825, 802 సిల్ లెవెల్ గల శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ), కల్వకుర్తిలకు ఏ ఇబ్బందీ లేదు. నాగా ర్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఉన్న కోస్తా ప్రాంతానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. కృష్ణానది పోటెత్తి ప్రవహించినప్పుడు సీమకు నీరు తీసుకెళ్లడంలో విఫలమైన బాబు ప్రభుత్వం.. గోదావరి నీటిని మళ్లించడం ద్వారా కృష్ణా డెల్టాలో మిగిలే నీటిని సీమలో వినియోగించుకుంటామని చెప్పడం విడ్డూరం. దీనికే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు ప్రజ లను మభ్యపెడుతోంది. నిజానికి గోదావరి, కృష్ణా నదులు రెండింటిలో దాదాపు ఒకే సమయంలో వరద లొస్తాయి. కృష్ణాలో వరదలు ఉన్నప్పుడు గోదావరి నీటిని లిఫ్ట్ చేయవలసిన అవసరం లేదు. అలాగే కృష్ణా డెల్టాకు నీటి అవసరం ఉన్నప్పుడు గోదావరిలో వరద లేకపోతే లిఫ్ట్ చేయడానికి అవకాశమూ ఉండదు. అంటే కృష్ణా డెల్టాకే గోదావరి నీటి తరలింపుపై గ్యారంటీ లేదు. కానీ గోదావరి నీటిని కృష్ణా డెల్టా అవసరాలకు వాడి, అక్కడ మిగిలే కృష్ణా నికరజలాలను శ్రీశైలం నుంచి సీమకు నీళ్లిస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యా స్పదం. సీమపై నిజంగానేబాబుకు చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా సామర్థ్యానికి అనుగు ణంగా కాలువలను సిద్ధం చేయాలి. దీన్ని విస్మరించి పట్టిసీమతో సీమకు నీళ్లిస్తామంటే అంతకు మించిన నయవంచన మరొకటి లేదు. పట్టిసీమ, పట్టిసీమ అని రాయలసీమ వాసులను మోసగించవద్దు. రాయలసీమ వాసులకు వాస్తవాలు తెలుసు. తమకు నీళ్లు ఎట్లా వస్తాయో తెలుసు గనుకనే ‘సిద్ధేశ్వరం అలుగు - రాయలసీమకు వెలుగు’ అనే నినా దంతో దాదాపు 30 వేల మంది రైతులు ఇటీవలే కృష్ణా నదిలో కవాతు చేసిన సంగతి తెలుగుదేశం ప్రభుత్వం మరవద్దు. అటు తెలంగాణకుగాని, ఇటు కోస్తా ప్రాంతా నికిగాని ఏ ఇబ్బందీ లేని జీవో నంబరు 69 రద్దు చేయడంతోపాటు, సిద్ధేశ్వరం ద్వారానే పోతిరెడ్డిపాడు తూముల నుంచి రాయలసీమకు నీరందుతుందనే నిజాన్ని గ్రహించి, పట్టిసీమ జపం మాని రాయల సీమకు నీరందించే అంశంపై చంద్రబాబు దృష్టి పెట్టాలి. లేదంటే శ్రీకృష్ణ కమిటీ కరాఖండిగా చెప్పినట్టుగా మరో రాయలసీమ ఉద్యమాన్ని చవిచూడక తప్పదు. వ్యాసకర్త అధ్యక్షుడు, రాయలసీమ - భూమన్, అధ్యయనాల సంస్థ 90107 44999 -
విభజన చట్టబద్ధం కాదు: మేకపాటి
స్టే ఇవ్వాలని సుప్రీంలో మేకపాటి పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా, బలవంతంగా విభజిస్తోందని... విభజనపై స్టే ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. ‘అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ కేంద్రం విభజిస్తోంది. రాష్ట్ర ప్రజలకు దీనిపై న్యాయపోరాటం మినహా మరే ప్రత్యామ్నాయం లేకుండా చేసింది. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులనూ పట్టించుకోకుండా విభజన చేస్తోంది. రాజధాని చుట్టూ పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు ఏర్పడ్డాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు ఈ విషయంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. గత 50 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే పెట్టుబడులన్నీ కేంద్రీకృతమయ్యాయి. వాటిలో 90 శాతం సీమాంధ్ర వారివే. 99 శాతం ప్రభుత్వరంగ సంస్థలన్నీ ఇక్కడే నెలకొన్నాయి. పైగా 2012-13 సాఫ్ట్వేర్ పరిశ్రమ టర్నోవర్ రూ. 55,000 కోట్లు అయితే.. ఒక్క హైదరాబాద్ టర్నోవరే రూ. 54,800 కోట్లు. మరి మిగిలిన సీమాంధ్ర పరిస్థితి ఏంటి? అమ్మకపు పన్నులో 75 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు రెవెన్యూ లోటు తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు తమ అవసరాలు నిండితే గానీ నీళ్లు వదలట్లేదు. వీటిపై అనేక న్యాయవివాదాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగితే కింది ప్రాంతమైన సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక ఆర్టికల్ 371(డి)ని కూడా కేంద్రం విస్మరిస్తోంది...’ అని పిటిషన్లో విన్నవించారు. అందువల్ల ఈ బిల్లు చట్టబద్ధంగా లేద ని ఆదేశాలివ్వాలంటూ కోరారు. అయితే ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు సరైన సమయం కాదంటూ కోర్టు గతంలో మేకపాటి దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
'తెలంగాణ' పార్లమెంట్ లోనే తేలుతుంది: చిదంబరం
తెలంగాణ బిల్లును గెలిపించడమా.. ఓడించడమా అన్నది పార్లమెంట్ లో తేలుతుంది అని కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం అన్నారు. బిల్లుపై అనుకూలత, వ్యతిరేకత అనేది ఈ లోక్‌సభలో కాకుంటే వచ్చే లోక్‌సభలోనూ ఉంటుంది అని చిదంబరం అనడం అనేక సందేహాలకు తావిస్తోంది. తెలంగాణ నుంచి 17 మంది, సీమాంధ్ర నుంచి 25 మంది ఎంపీలున్నారని, ఎంపీలంతా వారి ప్రాంతాలనుకూలంగా వ్యవహరిస్తే, వచ్చే లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది అని చిదంబరం స్ఫష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపాం. శ్రీకృష్ణ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా పార్లమెంట్ ముందుకు వచ్చిన తర్వాతనే తెలంగాణ బిల్లుపై నిర్ణయం తీసుకున్నామని చిదంబరం వ్యాఖ్యలు చేశారు. -
విడిపోతే సీమాంధ్రకు తీవ్ర నష్టం: వట్టి
ప్యాకేజీలు లేవు.. ఆర్థికసాయమూ లేదు.. సాక్షి, హైదరాబాద్: తమకు ప్యాకేజీలు లేవని, ఆర్థిక సహాయమూ లేదంటూ.. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోతే తమ ప్రాంతమైన సీమాంధ్ర అనేక రంగాల్లో తీవ్రంగా నష్టపోతుందని పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. విభజన అనంతరం సీమాంధ్ర కేవలం వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అరుునందువల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, దీని చుట్టూ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వెలిశాయని చెప్పారు. రాష్ర్ట ఐటీ రంగంలో 99.97 శాతం హైదరాబాద్ చుట్టూనే ఉందన్నారు. ఇంత అభివృద్ధి చెందిన తర్వాత తమను ఇక్కణ్ణుంచి వెళ్లిపొమ్మనడం అన్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ-2013 బిల్లుపై గురువారం ఆయన శాసనసభలో మాట్లాడారు. ‘కొత్త రాజధానిని ఎక్కడ నిర్మించాలి? అందుకు అయ్యే నిధులు ఎక్కడినుంచి వస్తాయి? సంబంధిత సమాచారం బిల్లులో లేదు’ అని అన్నారు. ‘ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. విడిపోవడం వల్ల సీమాంధ్ర ప్రాంతానికి నిధుల కొరత ఏర్పడుతుంది. జీతాలు, పింఛన్లను ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఆంధ్రా ప్రాంతం కంటే తెలంగాణాలోనే ఎక్కువ అభివృద్ధి ఉంది. శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో ఈ విషయమే స్పష్టం చేసింది. ఉన్నత విద్యా సంస్థలతో పాటు, కేంద్ర పరిశోధనా కేంద్రాలు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారుు. ఐటీఐఆర్‌ను కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు’ అని వట్టి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తే హెలికాప్టర్‌ను పేల్చివేస్తామని ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల్ని, తెలంగాణ జాగృతి నేత కవిత వ్యాఖ్యల్ని మంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు. అసలెందుకు విభజిస్తున్నారో చెప్పలేదు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనలన్నిటి నీ ఉల్లంఘించారని వట్టి విమర్శించారు. ‘రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారో చెప్పలేదు.. విభజన కోరుతూ రాష్ట్ర తీర్మానం లేదు.. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో రాష్ట్రాల విభజన జరిగిన సందర్భాల్లో దానికి ఆయా రాష్ట్రాల ఆమోదం ఉంది. కానీ ఇక్కడ మెజారిటీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు. ఇందిరాగాంధీ వంటి వారు కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సభ్యుల మనోభావాల ప్రకారం ఆ నిర్ణయాన్ని మార్చుకునేవారు. ఇప్పుడు కూడా రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం పునరాలోచించాలి. విభజనతో నీటి సమస్యలు మరింత రెట్టింపవుతారుు’ అని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రాంతం వారిని దోపిడీ దారులుగా పేర్కొడం మానేయాలని సూచించారు. -
‘ఆరో ఆప్షన్’ అమలుకు ఒత్తిడి తెండి
రాజకీయ పార్టీలకు జస్టిస్ లక్ష్మణరెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి తలెత్తిన సమస్యలను పరిష్కారించాలనే చిత్తశుద్ధి కేంద్రానికి ఉంటే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ఆప్షన్లో పొందుపరిచిన సూచనలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర నేత జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందులో సూచించిన అత్యుత్తమ పరిష్కార మార్గాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, సభ్యులు రాంబాబు, సూర్యనారాయణలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు సొంత ఎజెండాను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా శ్రీ కృష్ణ కమిటీ సూచించిన ఆ ఆప్షన్‌ను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకమంటూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు సీపీఎం, మజ్లిస్ పార్టీలు స్పష్టం చేయటాన్ని అభినందిస్తున్నట్టు వెల్లడించారు. మిగతా రాజకీయపార్టీలు కూడా విభజనకు వ్యతిరేకమంటూ కేంద్ర హోంశాఖకు లేఖల రూపంలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈనెల 7న భేటీ అవుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో సమైక్య ఉద్యమ తీవ్రతను తెలిపేలా ఆరు, ఏడు తేదీల్లో రహదారులను దిగ్బంధించాలని వేదిక కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఈనెల 8న ‘వంద రోజుల సమైక్య ఉద్యమ’సమీక్షను నిర్వహించి అన్ని ఉద్యమ కమిటీలు, వేదిక జిల్లా కమిటీలు భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజనకు తోడ్పడే కేంద్ర మంత్రుల బృందాన్ని, అఖిల పక్ష సమావేశాలను బహిష్కరించాలని కోరారు. -
తెలుగువారి ‘హోం’కు ‘వర్క్’
విశ్లేషణ: ఈ ‘నోట్’ పిండితార్థాన్ని బట్టి చూస్తే సీమాంధ్రలోని 13 జిల్లాలు కూడా (స్వచ్ఛందంగా చేరగోరే ఇతర జిల్లాలను కూడా కలుపుకుని) తెలంగాణలో చేరడమంటే ఇప్పుడున్న రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడమనేగదా! సునామీలు, కుంభవృష్టి, పెనుతుపానులు, టార్నా డోలు, టార్పీడోలు వాటికి తెలియకుండానే దిశలూ దిక్కులూ మార్చుకుంటాయి. ఆంధ్రపదేశ్ విభజన ప్రక్రియ కూడా అగమ్యగోచరంగా మారి భిన్నమైన దిక్కులలో ప్రయాణిస్తూ అన్నిటినీ ప్రశ్నార్థకం చేస్తోం ది! ‘విభజన’ ప్రతిపాదనకు ఎలాంటి ప్రత్యామ్నా యాలతో పరిష్కారం వెతకాలా అన్న మీమాంసలో యూపీయే కొట్టుమిట్టాడుతోంది! ఏ పరిష్కారమూ దొరకక చేస్తున్న పని - తల్లినీ తండ్రినీ చంపిన ఓ ప్రబుద్ధుడు ‘అయ్యా నేను తల్లీ తండ్రీ లేనివాణ్ణి, భిక్షపెట్ట’మని అడుక్కున్న ట్టుగా ప్రభుత్వ శాఖలలోని గడప గడపా తిరుగుతోంది! స్వార్ధ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడానికి సాహసించిన కాంగ్రెస్ పాలకులు నేడు దిక్కు తోచని ‘కంగారు’ల్లాగా పరుగులు పెడుతున్నారు! సుశీల్ కుమార్ షిండేకు ఆయన హోంశాఖ అధికారులే విచిత్రమైన ‘గమనిక’ను (‘నోట్’ను) సమర్పిం చబోవటం ఈ కంగారులో భాగమే. ‘నోట్’లో పంచదార! ‘హోం’వర్క్ ఫలితంగా మంత్రికి సమర్పించిన ఆ ‘నోట్’లో మూడు ప్రతి పాదనలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో విచిత్రమైన ప్రతిపాదన కూడా ఉంది. మొదటి పరిష్కారం ‘తెలంగాణలోని పది జిల్లాలకు తోడుగా స్వచ్ఛం దంగా వచ్చి చేరగోరే ఇతర జిల్లాలను కూడా పరిగణనలోకి తీసుకుని అన్నిం టినీ కలిపి తెలంగాణగానే ఏర్పాటు చేయండి!’ అంటే మొదటి ఎస్ఆర్సీ (ఫజల్ అలీ), శ్రీకృష్ణ కమిటీల మొదటి ప్రతిపాదన సమైక్యాంధ్రనే హోంశాఖ అభిలషిస్తోందా?! ఈ ‘నోట్’ను ఎవరు తయారు చేశారోగాని సదరు పత్రకా రుడు మహా‘సరసుడే’ కాదు, హోంశాఖలో బహుశా ప్రజలను విభజించి పాలిం చడం తెలియని అజ్ఞాత సమైక్యవాది అయి ఉండాలి! బహుశా రాష్ట్ర మెజారిటీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే ఈ ‘నోట్’ డ్రాఫ్టింగ్ జరిగినట్టుంది. ఈ ‘నోట్’ పిండితార్థాన్ని బట్టి సీమాంధ్రలోని 13 జిల్లాలు కూడా (స్వచ్ఛందంగా చేరగోరే ఇతర జిల్లాలను కూడా కలుపుకుని) తెలంగాణలో చేరడమంటే ఇప్పు డున్న రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడమనేగదా! పేరు మార్చుకుందాం! ఈ సందర్భంగా రాజ్యాంగ పరిశీలకులందరి దృష్టికీ రావలసిన అంశం ఉంది. ఏ కేంద్ర పాలక పక్షం, ఏ‘3’వ అధికరణ ఆధారంగా ఏ తెలుగు జాతిని చీల్చా లని ఉవ్విళ్లూరుతోందో సరిగ్గా అదే అధికరణలోని ‘ఇ’ క్లాజు అవసరాన్ని బట్టి ‘రాష్ట్రం పేరును మార్చకునే’ హక్కును కూడా ప్రసాదించిందని మరచిపోరాదు! అంటే, తెలంగాణ పది జిల్లాలతో పాటు ఎన్ని జిల్లాలు వచ్చి చేరితే అన్ని జిల్లా లూ కలిసిన ‘తెలంగాణ రాష్ర్టం’గా ఏర్పడవచ్చునని బాహాటంగానే ప్రకటించి నట్టయింది! ఆ లెక్కన మిగిలిన 13 జిల్లాలూ, ఆ పది జిల్లాలతోనూ కలిసి వెరసి - అక్షరాలా ‘తెలంగాణ’యే అవుతుందిగదా! నిజానికి యావత్తు రాష్ట్రమూ ‘తెలంగాణ’యే. ‘తెలంగాణ’ అంటే, తెలుగులకు (తెలుగు వారికి) ఆణెము / ఆణియము, అంటే తెలుగు వారు నివసించే చోటు అనీ, ప్రాంతం అనీ, స్థిర నివాసమనీ అనే అర్థం. సుమారు 300 ఏళ్లు సీమాంధ్ర ప్రాంతాలతోపాటు దక్కన్ వరకూ ఏలిన మహమ్మదీయ (ముసల్మాన్) పాలకులు (చరిత్ర జ్ఞాన శూన్యులైన నేటి నేతలకంటె) నాడేతెలివిగా వ్యవహరించారు కాబట్టే ఈ తెలుగు ప్రాంతాన్ని ‘తెలంగాణ’ అని పిలిచారు. (చూ: ఇండియా; ఎ హిస్టరీ ‘గ్రంథంలో జాన్కేయి 2000, హార్వర్ కాలిన్స్ పబ్లిషర్స్ ప్రచురించిన దేశ పటం: పేజీ:280)! బహుశా హోంశాఖ ‘నోట్’ కూడా తెలంగాణలో అన్ని జిల్లాలూ (ఎనీ అదర్ డిస్ట్రిక్ట్స్ దట్ కమ్ ఫార్వర్డ్ టు జాయిన్ ఇన్ తెలంగాణ విల్ బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ టు ఫామ్ తెలంగాణ) వచ్చి చేరమని ఆహ్వానం పలికి ఉంటుంది! అర్థవంతంగా ఉంటుంది! రాజ్యాంగంలోని 3వ అధికరణం ‘ఇ’ సెక్షన్ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్’ను కృత్రి మంగా విభజించకుండానే అర్థవంతంగానూ, సహజంగానూ, చారిత్రికంగానూ జాతి-భాషాపరంగానూ సుఖంగా అమరగల ‘తెలంగాణ’ అని పేరు మార్చు కోవచ్చుగదా! దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు రాష్ట్రం ఏర్పడి నప్పుడు - అకారాది క్రమం కోసమని అటు ఇంగ్లీష్ వర్ణమాలకు, ఇటు తెలుగు వర్ణమాలకు సమస్థాయిలో ఉన్న తొలి అక్షరాలతో ‘ఎ’ / ‘ఆ’ ఆంధ్రప్రదేశ్ ఏర్ప డటం శుభదాయకం అనుకున్నారు నాటి పెద్దలు. ఆ ఆశతోనే (ఆంధ్రప్రదేశ్) తప్పు సమాసం అయినా ఎంచుకున్నారు. ‘ప్రజాప్రతినిధుల’ వేషంలో దేశ, రాష్ట్రాల వివిధ పాలక పక్షాలు, ముఖ్యం గా కాంగ్రెస్ సహా కొన్ని ప్రధాన ప్రతిపక్షాలూ ఇన్నేళ్లుగా భారత రాజ్యాంగ చట్టాన్ని సహితం తమ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని తప్పుడు సవరణలతో పక్కదారులు పట్టించడానికి కూడా వెనుదీయలేదు. వాటిల్లో కొన్ని రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్రూట్ మెజారిటీ ద్వారా పార్లమెంటును చాటు చేసుకుని నేటి రేపటి పాలక పక్షాల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన సవరణలే! ఈ సవరణలేవీ డాక్టర్ అంబేద్కర్ లేదా తొల్లింటి ముసాయిదా రాజ్యాంగం తలపెట్టినవి కావు! స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పాలకులూ, మతరాజకీయాలను నిరసించిన ఆ రాజ్యాంగ సభ నిర్ణయాలనే అవమానించి ఉల్లంఘిస్తూ వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలూ, వాటి సంకీర్ణ పాలనా వ్యవస్థలూ రాజ్యాంగాన్ని వక్రమార్గం పట్టిస్తూ రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) స్వభావానికీ, దాని ప్రజాహిత స్ఫూర్తికీ బద్ధ విరుద్ధమైన సవరణ చట్టాలూ తీసుకొచ్చారు! వాటిలో నేటి రాష్ట్ర సమస్యకు ప్రత్యక్షంగా సంబంధం కలవి రాజ్యాంగంలోని 3వ, 4వ అధికరణలు. దేహభక్తే తప్ప దేశభక్తి ఏది! కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన 3వ అధికరణ భాషా ప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాలు, ఈడేర్చుకోవడానికి ఉద్దేశించింది కాదు కనుకనే ప్రత్యేకంగా మన రాష్ట్రం సుస్థిరత కోసం 371 అధికరణకు ‘డి’ క్లాజు ద్వారా రాజ్యాంగాన్ని సవరణ చట్టం తీసుకొచ్చి, దానికి భాష్యం చెప్పా లన్నా, వ్యతిరేకంగా తీర్పు చెప్పాలన్నా ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప, మిగతా ఏ కోర్టుకూ, చివరికి ఉద్యోగాలకు చెందిన మార్పులకూ, ప్రమోషన్లకూ మరే ఇతర సంబంధిత సమస్యలపైనా తీర్పులుగానీ, వ్యాఖ్యానాలు గాని చేసే హక్కు లేకుండా చేసింది! అంటే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే హక్కును పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమింపజేస్తున్న 3వ అధికరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి వినియోగించే ముందు 371(డి) సవరణ చట్టానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ద్వారానే పార్లమెంటుకు, దాని ద్వారా కేంద్ర కేబినెట్కూ, సాధ్యమవుతుందిగాని అడ్డదారుల్లో కాదు! పైగా హోంశాఖ చూపిస్తున్న ‘నోట్’లో నేడు వ్యతిరేకులుగా మారి ప్రజల కోసం పదవుల్ని త్యాగం చేయలేని ‘దేహభక్తి’కి తప్ప దేశభక్తికి దూరమైన నాయకులకు తెలియని రెండవ అంశంగా ఉంది. ఆ అంశం నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణకు సంబంధించి ఇచ్చిన ‘ఒకటవ వివరణ’లోనే ఉంది. ఇది రెండు రకాల భాష్యాలకి అవకాశమిస్తోంది. ఎలా అంటే, 3వ అధికరణలో ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకూ ఉన్న క్లాజుల్లో ‘రాష్ట్రం’ అనే పదంలో కేంద్రపాలిత (యూనియన్ టెరిటరీ - యూటీ) ప్రాంతం అనే పదం కూడా చేరి ఉంది! మిగిలిన సూత్రాలు అందుకే, ఇదే అదననుకొని రాజధాని యూటీగా మార్చి క్రమంగా అన్ని హం గుల్నీ కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవాలన్నది హోంశాఖ రెండవ సూత్రం! అయితే, జనాన్ని పాలక పక్షాలు గందరగోళపరచడం కోసం చేసిన ప్రయత్నం - మినహాయింపు ‘క్లాజు’ పేరిట ’రాష్ట్రం’ అనే పదంలో ‘కేంద్రపాలిత ప్రాంతం ‘చేరి ఉండగా పేర్కొనడమూ! ఇటీవల కొందరు పార్లమెంటు సభ్యులూ, రాష్ట్ర ప్రజలూ, రాష్ట్రేతర స్థానిక వ్యాపారులూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలూ దశాబ్దాలుగా పెంచి, అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ‘కేంద్రపాలిత ప్రాంతం’గానో (యూటీ) లేదా దేశానికి రెండవ రాజధానిగానో ప్రకటించిన తరువాతనే రాష్ర్ట ‘విభజన’ గురించి ఆలోచించాలి గాని అంతకుముందు కాదని ప్రతిపాదించడానికి కారణం 3వ అధికరణంలోని ఈ అయోమయపు ‘వివరణ-1’ కాబట్టి - ఇంతకూ రాజ్యాం గం సాధికార షెడ్యూల్‌కు బద్ధమై మైదాన ప్రాంతాల మోతుబరుల దోపిడీకి గురవుతున్న ఆదివాసీ గిరిజన తెగలు తమ లిపి, ప్రత్యేక సంస్కృతి పరిరక్షణకు విశాఖ, తూర్పుగోదావరి, ఉత్తర తెలంగాణలోని గిరిజన ప్రాంతాలన్నింటినీ విడగొట్టి భద్రాచలం రాజధానిగా మన్య రాష్ట్రం ఏర్పరచాలన్న డిమాండ్‌ను మరి ఎందుకు నిరాకరిస్తున్నట్లు? అర్థం తెలియకే... కాబట్టి మొత్తం తెలుగు జాతి ఉనికినీ, భారతదేశ చరిత్రలో దాని విశిష్టతనూ సంరక్షించి కాపాడుకోవడానికి గాను, ‘ఆంధ్ర’ అనే పదం (తెలుగు అనేది తెలి యక) పట్ల అజ్ఞానంతో కొందరు ‘ఎలర్జీ’ పెంచుకున్నారు. తద్వారా తెలుగు జాతి మూలాలనే నరుక్కోబోయే వారిని కూడా కలుపుకుని వచ్చేందుకు వీలుగా రాష్ట్రాన్ని మొత్తంగానే 3వ అధికరణలోని ‘ఇ’ క్లాజు ప్రకారం ‘తెలంగాణ’ అని గానీ, ‘తెలుగు నాడు’ అని గానీ నామకరణం చేయడానికి ఏ ఆంధ్రుడికీ ఏ తెలుగు వాడికీ అభ్యంతరం ఉండదు. మనసారా ఆహ్వానించి తీరుతాడు! -
వద్దంటున్నా.. విభజనా ? : పి.లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: చట్టబద్ధంగా, శాస్త్రీయంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకొనే ముందు.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలనే జ్ఞానం ప్రభుత్వాలకు ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. వేదికకు చెందిన మరో నేత వి.లక్ష్మణరెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను విభజించి సీమాంధ్ర వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్లి పొమ్మంటున్నారు. 1973లో ప్రత్యేకాంధ్ర అడిగినప్పుడు ఇవ్వలేదు. తెలుగుజాతి అంతా ఒక్కటిగా ఉండాలని అప్పట్లో ఢిల్లీ పెద్దలు చెప్పారు. ఇప్పుడు మాత్రం సీమాంధ్ర ప్రజలు అడగకపోయినా రాష్ట్రం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సీమాంధ్ర ప్రజలు అంగీకరిస్తే మంచిదే! కానీ ఒప్పుకోవడం లేదు. కలిసి ఉంటామంటే.. వెళ్లి పొమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ఎంత వరకు సమంజసం?’ అని జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. ప్రజల మధ్య సాధారణంగా విద్వేషాలు ఉండవని కొందరు స్వార్థపరుల వల్లే విద్వేషాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతాల నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చి భద్రత కల్పించాలని పోలీసులకు సూచించారు. సీఎం చొరవ చూపి అసెంబ్లీని సమావేశపరచాలి ‘సీమాంధ్రలో వ్యతిరేకత రావడంతో తెలంగాణపై 2009 డిసెంబర్ ప్రకటనను కేంద్రం ఉపసంహరించుకుని శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇరు ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాలతో మాట్లాడి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నివేదికపై శాసనసభలో కూలంకషంగా చర్చించి రాజకీయాలను పక్కనబెట్టి విప్‌లు లేకుండా తీర్మానం చేయాలి’ అని జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకొని శాసనసభను సమావేశపరచాలని సూచించారు. ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉన్నందున రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 3 నుంచి సీమాంధ్రలో సదస్సులు రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే సమస్యలు, కలిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో, 5న గుంటూరులో, 7న విశాఖపట్నంలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. సదస్సుల్లో హైకోర్టు మాజీ న్యాయమూర్తులు లక్ష్మణరెడ్డితోపాటు టి.గోపాలకృష్ణ, మాజీ వీసీ వేణుగోపాలరెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్, రైతు నేతలు అక్కినేని భవానీప్రసాద్, ఎర్నేని నాగేంద్రనాథ్, ప్రొఫెసర్లు శామ్యూల్, రామకృష్ణరాజు, వీరభద్రారెడ్డితో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. హైదరాబాద్‌లోనూ సదస్సు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు. టీడీపీ లేఖ వెనక్కి తీసుకోవాలి రాష్ట్రంలో సీపీఎం, ఎంఐఎం, వైఎస్సార్ సీపీ.. మూడు పార్టీలే సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాయని వి.లక్ష్మణరెడ్డి చెప్పారు. మిగతా పార్టీలు కూడా తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను టీడీపీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ మాదిరిగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని చెప్పారు. -
మోడీకి సౌరాష్ర్ట ‘బేడీ’!
విశ్లేషణ: ‘‘ఉత్తర బెంగాల్‌లోని గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అవాస్తవమైన, అసహజమైన, జాతీయ ప్రయోజనాలకు హానికరమైన ప్రతిపాదనగా భారత ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి ప్రత్యేక రాష్ట్రంఏర్పాటు కోసం జరిగే ఉద్యమానికి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇలాంటి మతిలేని ప్రయత్నాల ద్వారా దేశ సంఘీభావాన్ని చెడగొట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం సహించబోదు’’ అని సర్దార్ పటేల్ 1952 జూలైలో హెచ్చరించారు. పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన మేకగా మారిపోతుం దా? మారిపోదు కనుకనే, దానికి ‘మేకవన్నెపులి’ అని పేరు పెట్టాల్సివచ్చింది! అలాగే 2000 మంది మైనారిటీల ఊచకోతకు బాధ్యుడై కూడా న్యాయవ్యవ స్థనూ, అసమర్థపు కాంగ్రెస్ పాలక వ్యవస్థనూ పదకొం డేళ్లుగా మభ్యపెడుతూ కేసుల నుంచి తప్పించుకుని తిరు గుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన ‘కంట్లో దూలాల్ని’ చూసుకోకుండా ఎదుటి వారి కళ్లల్లో నలుసుల్ని వెతకచూడటంలో ఆరితేరినవాడు! అశేష త్యాగాలతో ప్రజాబాహుళ్యం అరవై ఆరేళ్లనాడు సాధిం చుకున్న స్వాతంత్య్రాన్నీ, లౌకిక వ్యవస్థా స్థాపనను ప్రజ లకు గ్యారంటీ చేసి ప్రజలకు హామీ పడిన రాజ్యాంగాన్నీ ఈ ఆరు దశాబ్దాలలో కాంగ్రెస్ పాలకులు నీరుగార్చారు. మరోవైపు రాజకీయ ముసుగులో పాలనాశక్తిగా ‘హిం దూత్వ’ పేరిట అవతరించిన భారతీయ జనతాపార్టీ నాయకులు నేడు ‘మోడీత్వ’ రంగులో క్రమంగా బయట పడుతున్నారు. కాంగ్రెస్ పాలకుల తప్పుడు రాజకీయాలను చాటు చేసుకుని, దేశ ప్రజలను, రాష్ట్రాలను సామ్రాజ్యవలస పాలకుల మాదిరిగానే విభజించి పాలించే దుర్నీతికి బీజేపీ మత రాజకీయవాదులు కూడా గజ్జెకట్టారు. ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక ‘సంస్కరణల’కూ, విదేశీ బహుళ జాతి కంపెనీల, దేశీయ గుత్త పెట్టుబడి వర్గాల ప్రయో జనాల కోసం గొడుగుపట్టడంలో కాంగ్రెసూ, బీజేపీ నేడు పోటాపోటీలు పడుతున్నాయి! అందులో భాగంగానే, చివరికి జాతీయ స్వాతంత్య్రోద్యమం గుర్తించి ఏక భాషా సంస్కృతులు పునాదిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతర ణను సుసాధ్యం చేసిన పరిణామాన్ని తిప్పికొట్టేందుకు ఈ రెండు రాజకీయశక్తులూ తమ ఉనికి కోసం, ఒకటిగా ఉన్న రాష్ట్రాలను విడగొట్టేందుకు పూనుకుంటున్నాయి. ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ప్రజల మౌలిక సమస్యలైన తిండి, బట్ట, వసతి, ఉపా ధి అవసరాలను తీర్చగల ప్రణాళికాబద్ధమైన పథకాలను అమలుజరిపే బాధ్యత నుంచి ఈ రెండు పార్టీలు రోజు రోజుకీ దూరమవుతున్నాయి. అందుకే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థకు సహజ మైన చిట్కా వైద్యాన్ని, విభజించి పాలించే నీతిని ఆశ్ర యించి ప్రజల మధ్య ఘర్షణలను, చీలికలను పెంచడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. ఈ ధోరణి దేశ విభజనతోనే ప్రారంభమై నేటికీ కొనసాగుతోంది! ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య తగవులు, తంపులు పెట్టే ‘సంస్కృతి’ ఆధారంగానే స్వాతంత్య్రానంతర కాంగ్రెస్ అధిష్టానమూ, అనంతరదశలో బీజేపీ నాయకులూ పంజాబ్‌ను చీల్చడం (పంజాబ్-హర్యానాలుగా) దగ్గర నుంచి మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లను ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరా ఖండ్లుగా ముక్కలుగా బద్దలు కొట్టడం వరకూ కీలక పాత్ర వహించాయి. ‘విడిపోవటం వికాసం’ కోసమేననీ, ‘విడిపోయి కలిసి ఉందా’మనీ చేసే ప్రచారం, ఈ ‘విభజన’ రాజకీయ కుట్రలో ప్రధానాంశం! అదే సూత్రాన్ని ఇప్పుడు ఈ రెండు మత రాజకీయ పక్షాలూ, ఎన్నికలలో తమ స్వార్థ ప్రయో జనాల కోసం, భాషాప్రయుక్త ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాల స్వరూపాలను చెదరగొట్టి, సమైక్యంగా ఉంటూ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధుల్లోనే అభివృద్ధిని నమోదు చేసుకుంటున్న ప్రజలను చెల్లాచెదురుచేయడానికి సంకల్పించాయి. విడిపోతేనే వికాసమని చెప్పే మాటలు నీటి మూటలేనని ఎన్డీయే సృష్టించిన మూడు రాష్ట్రాలు చాటిచెబుతున్నాయి. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసమే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లను ప్రత్యేక రాష్ట్రాలుగా విభ జించామని ఆనాడు చెప్పారు. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదు సరికదా, ఏ రెండు రాష్ట్రాల నుంచి వీటిని ఏ ఉద్దేశంతో ‘చీల్చామ’ని చెప్పారో ఆ ఆదివాసీల బతుకుల్ని విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి రంగాలలో చట్టుబండలు చేశారు. మత రాజకీయాలను ఆశ్రయించి తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ గత ఐదేళ్ల క్రితం వరకూ కర్ణాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అప్పటిదాకా దక్షిణ భారతంలో కాలుమోపలేని బీజేపీ మొదటిసారిగా కర్ణాటకలో పూర్తిస్థాయి ప్రభు త్వాన్ని నెలకొల్పింది. అక్కడి నుంచి స్థానికంగా కర్ణాట కలో ఎన్ని రకాల మతఘర్షణలు చోటు చేసుకున్నాయో రాజకీయ పరిశీలకులకు తెలుసు! మరి ఈ నాడు ఈ పార్టీ పరిస్థితి ఏమిటి? ఏడు రాష్ట్రాల్లో తన అధికారం కూలి పోయి, ప్రస్తుతం పాలనాశక్తిగా బీజేపీ పాలన కేవలం నాలుగు రాష్ట్రాలకు కుదించుకుపోయింది! చివరికి దక్షిణా దిన చేజిక్కిందనుకున్న కర్ణాటక కూడా ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవమానకరంగా బీజేపీ చేజారిపోయింది! తాజాగా నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని నిల పడం కోసం ‘వికాస’ పురుషుని వేషంలో హైదరాబాద్ వచ్చి విభజన సభ జరిపాడు. తెలుగుజాతిని విడగొట్టేం దుకు, ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసేందుకు సాగుతున్న రాజకీయ కుట్రలో తనవంతు పాత్ర పోషించేందుకు వచ్చాడు. వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు, పోషకాహారానికి దూరమైపోయిన వేలాది మంది బాల బాలికల, శిశువుల అకాల మరణాలకు నిలయంగా ఉన్న గుజరాత్‌లోని సౌరాష్ర్ట ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా కాలంగా ఉద్యమిస్తోంది. ఏడు జిల్లాలతో కూడిన (జామ్‌నగర్, సురేంద్రనగర్, రాజ్‌కోట్, అమ్రేలి, భావ్ నగర్, పోర్బందర్, జునాగఢ్) సౌరాష్ట్రను గుజరాత్ నుంచి వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న ఉద్య మం అక్కడ ఉధృతంగా సాగుతోంది. దానికి పరిష్కారం చూపలేని మోడీ తగుదునమ్మా అని తెలుగు జాతిని రెం డుగా చీల్చాలని రంకెలేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముక్కలు కావాలి, బీజేపీ నాలుగు సీట్లు పెంచుకొని, ఢిల్లీ దర్బారుకు ఎగబాకాలనేది అసలు రంధి! వేర్పాటు ఉద్యమానికి ఊతం ఇవ్వడం అందుకే! నెహ్రూకు పోటీగా సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నిలు వెత్తు భారీ విగ్రహాలు ఆవిష్కరించాలని మోడీ ఆరాట పడుతున్నాడు. కానీ పటేల్ నిలబడింది భారతదేశ సమైక్య తకు, సంస్థానాల విలీనీకరణ ద్వారా రాష్ట్రాల సుస్థిరత కోసమేగాని మోడీలాగా విభజన ద్వారా వ్యక్తిగత ‘వికా సం’ కోసంకాదు! ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్రాల పున ర్విభజన కోసం నియమించిన మొదటి ఫజలలీ కమి షనూ, నిన్నమొన్నటి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రెండు నివేదికలూ మొదటి ప్రాధాన్యాన్ని ఏకీకృత సమై క్యాంధ్రకే ఇచ్చాయనేది గమనార్హం. శ్రీకృష్ణ కమిషన్ ఆరు ప్రాధాన్యాలలో మొదటి ప్రాధాన్యాన్ని, ఆఖరి మాటనూ (1/6 ప్రతిపాదనలు) ఆద్యంతాల బిగింపు లాగా సమైక్య రాష్ట్రమే సరైనదీ, పురోగతికి సవ్యమైనదీ అని స్పష్టం చేసింది! ఇక్కడ నరేంద్ర మోడీగాని, అతడి లాంటి బీజేపీ నాయకులుగానీ ఈ సందర్భంగా సర్దార్ పటేల్ 1952, జూలైలో పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని బట్టీ పట్టక పోయినా కనీసం చదువుకొని ఉండటం అవసరం! ఆనాడే గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన తలెత్తినప్పుడు సర్దార్ పటేల్ ఇలా హెచ్చరించారు. ‘‘ఉత్తర బెంగాల్‌లోని గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను అవాస్తవమైన, అసహజమైన, జాతీయ ప్రయోజనాలకు హానికరమైన ప్రతిపాదనగా భారత ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి ప్రత్యేక రాష్ట్రంఏర్పాటు కోసం జరిగే ఉద్యమానికి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇలాంటి మతిలేని ప్రయత్నాల ద్వారా దేశ సంఘీ భావాన్ని చెడగొట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం సహించబోదు’’ ఏక భాషాసంస్కృతుల ఆధారంగా సహేతుకమైన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును అభిలషిస్తూ జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానాలను గౌరవిస్తూ, అసహ జమూ, అశాస్త్రీయమైన పద్ధతుల్లో రాష్ట్రాల విభజనను వ్యతిరేకిస్తూ సర్దార్ పటేల్ ఈ మాట చెప్పారనే వాస్తవాన్ని మోడీ ప్రభృతులు తెలుసుకోవటం మంచిది! -
హే... శ్రీకృష్ణ..!
-
శ్రీకృష్ణ కమిటీ సూచనలను పట్టించుకోని కాంగ్రెస్