సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి వెళ్లగొడతామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. ఆయనకు ఇక్కడ కర్రీ పాయింట్ పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వబోమని అన్నారు. ఆయన శుక్రవారం సచివాయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నుంచి విద్యా సంస్థలను మినహాయించాలని కోరారు.