
జనం జగన్‌కే జై కొడుతున్నారు: భూమన
తిరుపతి: చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలకోరు అని, ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల కాలంలో ఈ హామీలను ఎందుకు అమలు పరచలేదని ప్రశ్నించారు. కేవలం వైఎస్ జగన్‌ను దృష్టిలో ఉంచుకొనే ఆల్ ఫ్రీ హామీలుయిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. జనం జగన్‌కే జై కొడుతున్నారని భూమన అన్నారు.
చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలు నరకం అనుభవించారని ఇక ఆయనకు అధికారం రావడం కలేనని అంతకుముందు చెప్పారు. వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనపై విశ్వాసం తో జగనన్న నాయకత్వంపై నమ్మకంతో కాంగ్రె స్, టీడీపీ వారు వైఎస్‌ఆర్‌సీపీలోకి వస్తున్నారన్నా రు.