
ఆలయాల మూసివేత
సూర్యగ్రహణం సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలు మంగళవారం రాత్రి మూసి వేశారు. తిరుమలలోని వేంకటేశ్వరస్వామితోపాటు తిరుపతిలోని పలు స్థానిక ఆలయాలు, కాణిపాకం, నారాయణవనం, తిరుచానూరు ఆలయాలు కూడా మూసి వేశారు. ఈ ఆలయాలన్నింటినీ బుధవారం ఉదయం పది గంటల తరువాత తెరవనున్నారు.
తిరుచానూరు: సూర్యగ్రహణం సందర్భంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం రాత్రి 8.30 గంటలకు మూసి వేశారు. తిరిగి బుధవారం ఉదయం సూర్యగ్రహ ణం అనంతరం 10 గంటలకు ఆలయ తలుపులు తెరచి, శుద్ధి, పుణ్యావచనం నిర్వహించనున్నారు. 10.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని నిద్ర మేల్కొల్పి, 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సహస్రనామ, నిత్యార్చన, 12 నుంచి 1 గంట వరకు మొదటి గంట(నైవేద్యం) సమర్పిస్తారు. అనంతరం అమ్మవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు. అలాగే యోగిమల్లవరంలోని శ్రీపరాశరేశ్వరస్వామి ఆలయం కూడా మూసి వేశారు. బుధవారం ఉదయం 10 గంట లకు తెరిచి స్వామి వారికి నిత్య కైంకర్యాలు, అభిషేక పూజల ను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎం.రామకృష్ణ,ప్రధానార్చకులు మూర్తి గురుకుల్ తెలిపారు.
కాణిపాక ఆలయం
ఐరాల: సూర్యగ్రహణం సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ప్రధాన ద్వారాలను అధికారులు మూసివేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు దేవస్థాన పరిధిలో అనుబంధ ఆలయాలైన వరదరాజ స్వామి, మరగదాంబికా సమేత మణికంఠేశ్వరస్వామి ఆలయాలను మూసివేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యావహచనం, గ్రహణ శాంతి, అభిషేకాలను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు ఈఓ పూర్ణచంద్రరావు తెలిపారు.
వేదనారాయణ స్వామి ఆలయాలు
నాగలాపురం : సూర్యగ్రహణం నేపథ్యంలో బుధవారం ఉదయం 5.30 నుంచి 9.30 గంటల వరకు నాగలాపురంలోని వేదనారాయుణస్వామి ఆల యుం, సురుటపల్లి పళ్లికొండేశ్వరస్వామి ఆలయం మూసి వేయనున్నారు. సూర్య గ్రహణం అనం తరం 10 గంటలకు పైన ఆలయు శుద్ధి, సంప్రోక్షణ అనంతరం నిత్య కైంకర్యాలు నిర్వహించి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
కల్యాణ వెంకన్న ఆలయం
నారాయణవనం: పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం సాయంత్రం ముసివేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యావచనం తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.