
టెట్ ప్రశాంతం
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. నగరంలో 78 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పరీక్షలు నిర్వహించటంతో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద హడావుడి నెలకొంది. ఎప్పటినుంచో ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు పిల్లాపాపలతో సహా కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాశారు.
అయితే పరీక్షా కేంద్రాల గుర్తింపులో అభ్యర్థులు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఒకే పేరుతో రెండు ప్రాంతాల్లో విద్యాసంస్థలు ఉండడంతో అభ్యర్థులు తికమక పడ్డారు. కొందరు పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అనంతరం ఇది తమ కేంద్రం కాదని తెలియడంతో కొందరు అభ్యర్థులు ఆ కేంద్రాలకు పరుగులు పెట్టారు. పైగా ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో సకాలంలో చేరతామో లేదోనని కంగారుపడ్డారు.