గుండె గూటికి పండగొచ్చింది.. | The beginning of the golden age says ysr congress leaders | Sakshi
Sakshi News home page

గుండె గూటికి పండగొచ్చింది..

Published Wed, Sep 25 2013 5:46 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

The beginning of the golden age says ysr congress leaders

ఎక్కడ చూసినా పండగ వాతావరణం.... బాణసంచా మోతలు...ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వీధుల్లో సంబరాలు, ర్యాలీలు ఇది  మంగళవారం పల్లెలు పులకించిన తీరు...పట్టణాలు ప్రభవించిన వైనం. బెయిల్‌పై జగన్‌మోహన్‌రెడ్డి విడుదల కావడంతో దసరా, దీపావళి పండుగలు ఒక్కరోజే వచ్చినట్టు కార్యకర్తల్లో ఆనందం ఎగసిపడింది. సామాన్య ప్రజలు సైతం వీధుల్లోకి వచ్చి సంతోషాన్ని పంచుకున్నారు. 
 
 విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో  జిల్లావ్యాప్తంగా మంగళవారం కూడా సంబరాలు మిన్నంటాయి. వాడవాడలా వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. అన్నసంతర్పణలు చేశారు. కేక్‌లు కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ స్వర్ణ యుగాన్ని ప్రజలు చూస్తారని, సమైక్యాంధ్ర సాధించి తీరుతామని నాయకులు చెబుతున్నారు. విజయనగరం పట్టణంలో  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో  స్థానిక నాగవంశపు వీధిలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళు
 
 లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు వచ్చాడన్నారు. సరైన సమయంలో జగన్ నాయకత్వంలో ప్రజలు వైఎస్ స్వర్ణయుగాన్ని చూస్తారన్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాళ్ల గౌరీశంకర్, అవనాపు విక్రమ్  అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం టౌన్‌లో పట్టణ పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మేళతాళాలతో బాణసంచా కాల్చి ఆనందోత్సవాలు జరిపారు. ముందుగా వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలే శారు. మండలంలో నర్సి పురం, పెదబొండపల్లి, తాళ్లబురిడి, ఎమ్మార్‌నగరం గ్రామాల్లో కూడా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి వైఎస్ విగ్రహాలకు పాలా భిషేకాలు చే శారు. 
 
 నర్సిపురంలో అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీతానగరంలో పార్టీ సమన్వయకర్త గర్భాపు  ఉదయభాను, నాయకులు వాకాడ నాగేశ్వరరావు, ఉడముల గౌరునాయుడుల ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి  సంబ రాలు జరిపారు. హనుమాన్ జంక్షన్ నుంచి వైఎస్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. బూర్జిలో  పీఏసీఎస్   అధ్యక్షుడు చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో  కేక్ కట్ చేశారు. 400 మందికి అన్నదానం చేశారు. వంతరాంలో  గ్రామ సర్పంచ్ బెవర హేమలత ఆధ్వర్యంలో  సంబరాలు జరిపారు. గంగాడలో గంట శంకరరావు ఆధ్వర్యంలో బాణసంచా  కాల్చారు. బలిజిపేట మండలం నారాయణపురం గ్రామసర్పంచ్ మండల ప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. 
 
 పార్టీ మండల కన్వీనరు శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. బొ బ్బిలిలో వైఎస్‌ఆర్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు తూముల రాంసుధీర్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కోటలో టపాసులు కాలుస్తూ జగన్, వైఎస్ ఫొటోలు, వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు చేతపట్టి పట్టణంలో ర్యా లీ నిర్వహించారు. ఎస్. కోట మండలంలో పెదకండేపల్లిలో  గ్రామస్థాయి నాయకులు , కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరిపి, ర్యాలీ నిర్వహించారు. జామి మండలంలో  కలగాడ సర్పంచ్  రాయవరపు మాధవి ఆధ్వర్యంలో  మూడువేల మందికి అన్నసం తర్పణ నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త డాక్టర్ గేదెల తిరుపతి పాల్గొన్నారు.  రామయ్యపాలెంలో వైఎస్‌ఆర్ సీపీ నేత బండారు పెదబాబు ఆధ్వర్యంలో మందుగుండు కాల్చారు.  
 
 జాగరంలో మండల కన్వీనరు సూరిబాబు రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిం చారు. కొత్తభీమసింగిలో పార్టీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. కురుపాం మండలంలో  చప్పగుత్తిలి, ధర్మలక్ష్మిపురంలలో మండల కన్వీనరు ఆరిక ఎల్లయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నిమ్మల వెంకటరావుల ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి, అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు. జియ్యమ్మవలస మండలం చినతుంబలి, చినమేరంగిలో నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, రెడ్డిశకుంతల ఆధ్వర్యంలో  ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, బాణసంచా కాల్చారు. కొమరాడ మండలంలో పార్టీ నాయకులు గులిపల్లి సుదర్శనరావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. 
 
 గరుగుబిల్లిలో  రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురంలో పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సాలూరులో పట్టణ వైఎస్‌ఆర్ సీపీ కన్వీనరు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో చిన హరిజన పేటలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఎస్సీసెల్ కన్వీనరు మజ్జి అప్పారావు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్    ముగడ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.    మండల కన్వీనరు జి.కనకలింగేశ్వరరావు ఆధ్వర్యంలో విజ యోత్సవ ర్యాలీ నిర్వహించారు.  మామిడిపల్లిలో తప్పెటెగుళ్లు ప్రదర్శించారు.  చీపురుపల్లిలో అంబేద్కర్ నగర్‌లో యువత, మహిళలు  ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.
 
  నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం మోదవలసలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో పార్టీ నాయకులు గండిబోయిన ఆది ఆధ్వర్యంలో  గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. పెదతాడివాడలో సంబరాలు జరిగాయి. వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు . నెల్లిమర్లలో  బైక్ ర్యాలీని పార్టీ నాయకుడు జనాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement