మిర్యాలగూడ రూరల్, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో పట్టు సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి మిర్యాలగూడలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు 2008లో తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్‌ముఖర్జీకి లేఖను అందించామని, ఆ లేఖనే పరిగణనలోకి తీసుకోవాలని పలుమార్లు ప్రకటించారని గుర్తు చేశారు.
నేడు బాబు మాటమార్చి సమైక్యాంధ్రకు మద్దతుగా ఢిల్లీలో దీక్ష చేపడుతానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ప్లీనరీలో తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అడ్డు చెప్పబోదని చెప్పి ఇప్పుడు సమైక్యాంధ్ర అనడం ఏమిటన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కందిమళ్ల లకా్ష్మరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, చౌగాని భిక్షంగౌడ్, తిరునగర్ భార్గవ్, డీసీసీబీ డెరైక్టర్ సజ్జల రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కుర్చీ కోసమే దీక్షలు : ఎంపీ గుత్తా
Published Mon, Oct 7 2013 3:30 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement