చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి... | The chief guest at the closing ceremony of the sports carnival | Sakshi

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి...

Published Fri, Jan 23 2015 5:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి...

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి...

గుంటూరు స్పోర్ట్స్: కళాశాల వాతావరణం చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. తాడికొండ మండలం మోతడక గ్రామంలో చలపతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురువారం జరిగిన స్పోర్ట్స్ కార్నివాల్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. తొలుత స్పీకర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చలపతి విద్యాసంస్థల చైర్మన్ వై.వి.ఆంజనేయులుకు స్పీకర్ కోడెల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ సంగీతవిభావరి ఆహూతులను అలరించాయి.

శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ నన్నపనేని రాజకుమారి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఆర్డీవో భాస్కర్‌నాయుడు, జిల్లాపరిషత్ ఉపాధ్యక్షుడు పూర్ణచంద్రరావు, కళాశాల ప్రిన్సిపాల్ సి.రవికాంత్, డెరైక్టర్ వినయ్‌కుమార్, ఫిజికల్ డెరైక్టర్లు, శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement