childhood memories
-
డాన్స్ అనేది వైరల్ అని ఎందుకంటారంటే..
-
ఈ గాలి.. ఈ నేల... బాల్య స్మృతుల్లో కమలా హ్యారిస్
లుసాకా: అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ జాంబియా వెళ్లి తన బాల్య స్మృతుల్లో మునిగిపోయారు. తన తాత, భారత్‌కు చెందిన పి.వి.గోపాలన్ ఇంట్లో చిన్నప్పుడు వారితో గడిపిన రోజుల్ని గుర్తు చేస్తుకున్నారు. 1960 దశకంలో కమల హ్యారిస్ తాత చెన్నై నుంచి జాంబియా రాజధాని లుసాకా వెళ్లి అక్కడ ఇండియన్ ఫారెన్ సర్వీసు అధికారిగా సేవలందించారు. అప్పట్లో తాము నివసించిన ఇల్లు ఇప్పుడు లేకపోయినా ఆ ప్రాంతానికి వెళ్లిన కమల అక్కడ మట్టి పరిమళాన్ని ఆస్వాదించారు. ‘‘నా చిన్నతనంలో మా తాతయ్యతో గడిపిన రోజులు నాకెంతో విలువైనవి. ఈ ప్రాంతంలో నా బాల్యం గడిచింది. ఇప్పుడు మళ్లీ అక్కడే ఉన్నానన్న ఊహ ఎంతో మధురంగా ఉంది.బాల్య జ్ఞాపకాలు ఎప్పుడూ ఒక ఉద్వేగాన్ని ఇస్తాయి. ఇక్కడ్నుంచి మా కుటుంబం తరఫున ప్రతీ ఒక్కరికీ హాయ్ చెబుతున్నాను’’ అని అంటూ కమలా హ్యారిస్ ఉద్విగ్నతకు లోనయ్యారు. -
నాటి బుజ్జి పాపాయిలే.. నేటి స్టార్ హీరోయిన్లు (ఫొటోలు)
-
జ్ఞాపకాల అంగడి
వీటిలో ఎన్నిటిని గుర్తుపట్టారు? ఓ మై గుడ్నెస్ అన్నిటినా? అయితే మీరు పలు బ్రాండ్లకు మంచి బిజినెస్ ఇస్తున్నట్టే! వాట్ ఆర్ యూ టాకింగ్? ఇవి నా చిన్నప్పటి.. లేదా నా యూత్ మెమొరీస్.. వాటిని బ్రాండ్స్ ఏం చేసుకుంటాయి? బిజినెస్ చేసుకుంటాయి! ఎస్.. ఇప్పుడు వినియోగదారుల చిన్ననాటి.. టీనేజ్ జ్ఞాపకాలే పలు వ్యాపార సంస్థలకు పెద్ద బిజినెస్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ జ్ఞాపకాలే కొత్త బిజినెస్‌కు ఆలోచన పడేలా చేస్తున్నాయి.. నోస్టాల్జియాకున్న పవర్ అది! అందుకే దీన్ని నోస్టాల్జియా మార్కెట్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ తిరుగుతోంది ఈ ఇరుసు మీదే! ఇంట్లో.. బయటా.. ఎక్కడ ఏ వస్తువు కనపడినా.. ఏ పరిసరంలో తిరుగాడినా.. ఏ మాటలు.. పాటలు విన్నా.. అవన్నీ ఏదోరకంగా జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నవే అయ్యుంటాయి! లేదంటే గతంలోని ఏదో ఒక సందర్భాన్ని.. అపూర్వ క్షణాలను.. వ్యక్తులను గుర్తుచేసేవే ఉంటాయి! గమ్మత్తయిన ఓ వర్ణం.. అమ్మకు తను కట్టుకున్న తొలి చీరను గుర్తుచేయొచ్చు. మనవరాలో.. మనవడో.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మరీ కొనుక్కున్న ఓ స్టీల్ గిన్నె.. నానమ్మకు తన కాపురాన్ని జ్ఞాపకంలోకి తేవచ్చు. స్పాటిఫైలో పాట.. నాన్నకు తన బాల్యంలోని సినిమా థియేటర్ని అతని కళ్లముందు ఉంచొచ్చు. పఫ్‌తో హెయిర్ స్టయిల్ అత్తను తన యవ్వనపు రోజుల్లోకి తీసుకెళ్లొచ్చు. ఓటీటీ సిరీస్‌లోని ఓ సన్నివేశంతో తన చిన్నప్పుడు దొంగతనంగా కాల్చిన సిగరెట్ దమ్ము.. తాతయ్య మది అట్టడుగు పొరల్లోంచి బయటకు రావచ్చు! ఇలా జ్ఞాపకల్లేని జీవితం ఉంటుందా? పైగా పాతవన్నీ మధురాలే! అందుకే కదా అన్నారు ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని! ఈ మాటనే వ్యాపార మంత్రంగా పట్టేసుకున్నాయి పలు వ్యాపార సంస్థలు. ఎలాగంటే.. ‘ఆరోజుల్లో... ’ అని మొదలుపెట్టే సంభాషణతో చుట్టూ ఉన్న వాళ్లు చిరాకు పడుతుండొచ్చు. విసుగు చెందుతుండొచ్చు. కానీ.. వ్యాపార సంస్థలు మాత్రం ఆ మాటల ప్రవాహాన్ని పట్టుకుని అందులో ఈది.. ఆ జ్ఞాపకాల్లో తమ బ్రాండ్స్‌ను దొరకబుచ్చుకుని పాత కొత్తల కలయికతో రీమేక్ చేసి యాడ్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ ‘యాది’ అనే టెక్నిక్‌ను బిజినెస్ ట్రిక్‌గా మలచుకుంటున్నాయి. ఈ స్క్రిప్ట్‌కి లీడ్ అందింది ఎప్పుడు? ఇంకెప్పుడూ.. కరోనా టైమ్‌లోనే! భలేవారే.. అన్నిటికీ కరోనాతో ముడిపెడితే ఎలా? అంటే పెట్టాల్సిందే మరి! కరోనాతో కరెంట్ ఎరా.. కరోనాకు ముందు.. తర్వాత అని చీలిపోతుందని లాక్డౌన్లో జోస్యం చెప్పుకున్నాం! నెమ్మదిగా అదిప్పుడు అనుభవంలోకి వస్తోంది. మార్కెట్లో లాభాలు సృష్టిస్తోంది. అంటే కాలం ఆ విభజనను స్పష్టం చేసిందన్నట్టే కదా! లాక్డౌన్లో చాలా మంది.. నాటి దూరదర్శన్ సీరియళ్లు, పాత సినిమాలు, పాటలతోనే కాలక్షేపం చేశారుట. ఆ కాలక్షేపంలో పల్లీ బఠాణీలు, పాప్‌కార్న్‌ని కాకుండా ఆ సీరియళ్లతో సమానంగా ఆస్వాదించిన నాటి ప్రకటనలను.. ప్రొడక్ట్స్‌ను.. వాటి తాలూకు తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారని పలు అధ్యయనాల సారాంశం. ఆ సారాన్ని పట్టుకునే వ్యాపార సంస్థలు నోస్టాల్జియాలో మార్కెట్‌ను వెదుక్కున్నాయి. మిలెనీయల్స్కీ.. జెన్జెడ్కీ.. ఆ తరపు మెమోరీస్‌ని కొత్త ర్యాపర్లో చుట్టి ప్రకటనల గిఫ్ట్స్‌ని అందిస్తున్నాయి. ఈ జాబితాలో క్రెడ్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి క్యాడ్బరీ దాకా పలు ప్రముఖ బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఇలా కొత్త ర్యాపర్లో పాత యాడ్స్‌ను చుట్టి స్క్రీన్ మీద పరుస్తున్నాయి. ఆ మధురాలు పాత తరపు వినియోగదారుల భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యి నాటి ఆనందానుభూతులను తాజా చేసి ఆ బ్రాండ్స్ పట్ల వాళ్ల లాయల్టీని పెంచుతున్నాయి. ఈ తరమేమో ఆ గిమ్మిక్కి పడిపోయి.. ఆ బ్రాండ్స్‌కి కొత్త కన్జూమర్స్గా రిజిస్టర్ అవుతోంది. ఇలా ఒకే ఇంట్లో ఆబాలగోపాలన్ని అలరించి.. మెప్పించి తమ ఖాతాను స్థిరపరచుకుంటున్నాయి. ఇదే కాక క్రెడ్ ఓజీ (OG) పేరుతో రాహుల్ ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్, జావగల్ శ్రీనాథ్, మనీందర్ సింగ్, సబా కరీమ్ లాంటి నాటి మేటి క్రికెటర్స్తోనూ యాడ్స్ రూపొందించింది. ఇలా రిలీజ్ అయిన వెంటనే అలా వైరల్ అయ్యాయి ఆ ప్రకటనలు. ఆ యాడ్స్‌లో కొన్ని.. క్యాడ్బరీ.. కుఛ్∙ఖాస్ హై 90ల్లో.. ఒక క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటాడు.. సెంచరీకి చివరి బంతి అన్నమాట. బంతి గాల్లో లేచి.. క్యాచ్ అవుతుందా అన్న ఉత్కంఠలో క్యాచ్ మిస్ అయ్యి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ చాక్లెట్ తింటూ టెన్షన్ పడ్డ అతని గర్ల్‌ఫ్రెండ్ ఆనందానికి అవధులుండవు. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేస్తూ స్టేడియంలోకి వస్తుంది.. సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! ఇప్పుడు క్రికెట్ స్టేడియం.. లేడీ క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటుంది. సెంచరీకి ఒక రన్ తక్కువగా ఉంటుంది ఆమె స్కోర్. ఓ షాట్ కొడుతుంది. అది గాల్లో లేచి.. బౌండరీ దగ్గరున్న ఫీల్డర్ దోసిట్లో పడబోయి.. మిస్ అయి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ తింటూ టెన్షన్ పడిన ఆ క్రికెటర్ బాయ్‌ఫ్రెండ్ సంతోషానికి ఆకాశమే హద్దవుతుంది. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేసుకుంటూ స్టేడియంలోకి వస్తాడు సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. ఫైవ్స్టార్తో కలసి అప్పుడు.. ఫైవ్‌స్టార్ ఇద్దరు యువకులు.. ఓ ప్యాంట్‌ను దర్జీకిస్తూ ‘నాన్నగారి ప్యాంట్.. ఒక అంగుళం పొడవు తగ్గించాలి’ అని చెప్పి వాళ్ల వాళ్ల షర్ట్ జేబుల్లోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసి ఓ బైట్ తిని .. ఆ ఇద్దరూ మొహాలు చూసుకుని అప్పుడే ఒకరినొకరు గుర్తుపట్టినట్టు.. ‘రమేశ్.. సురేశ్’ అని పిలుచుకుంటారు. ఇలా చాక్లెట్ తింటూ.. మైమరిచిపోయి.. దర్జీకి పదేపదే ఆ ప్యాంట్‌ను అంగుళం చిన్నది చేయమని పురమాయిస్తూంటారు. ఈలోపు ఆ ప్యాంట్ కాస్త నిక్కర్ అయిపోతుంది. ఇప్పుడు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇందులోనూ రమేశ్, సురేశ్ ఇద్దరూ ఓ ప్యాంట్ తీసుకుని దర్జీ దగ్గరకు వస్తారు. ఆ ప్యాంట్ పొడవు తగ్గించాలని పురమాయించి.. ఫైవ్‌స్టార్ కోసం జేబులు వెదుక్కుంటూంటారు.. ఖాళీ అయిపోయిన ర్యాపర్స్ తప్ప చాక్లెట్స్ దొరకవు. అప్పుడు వాయిస్ ఓవర్ వినిపిస్తుంటుంది.. ‘ఇప్పటికిప్పుడు చాక్లెట్స్ కావాలా? స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి.. నిమిషాల్లో చాక్లెట్స్ మీ ముందుంటాయి’ అంటూ! అప్పుడు రమేశ్.. సురేశ్ పక్కకు చూడగానే చాక్లెట్స్ పట్టుకుని నిలబడ్డ స్విగ్గీ ఇన్స్టామర్ట్ డెవలరీ పర్సన్ కనపడుతుంది. క్రెడ్.. (క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ యాప్) నాడు.. దీపికాజీ (నిర్మా వాషింగ్ బార్) దీపికా చిఖలియా (నాటి టీవీ రామాయణంలో సీత పాత్రధారి) కిరాణా షాప్‌లోకి వెళ్లి.. నిర్మా బట్టల సబ్బు ఇవ్వమని షాప్ అతన్ని అడుగుతుంది. ‘దీపికాజీ.. మీరెప్పుడూ సాధారణ సబ్బే కదా తీసుకునేది.. మరిప్పుడూ?’ అంటూ ఆగిపోతాడు. ‘సాధారణ సబ్బు ధరకే నిర్మా బార్ వస్తుంటే ఎందుకు కాదనుకుంటాను’ అంటుంది దీపికా. నేడు .. కరిష్మాజీ (క్రెడ్ పేమెంట్ యాప్ కోసం) షాప్‌లోకి వెళ్తుంది కరిష్మా కపూర్ సెల్‌ఫోన్ చార్జర్ కోసం. సాధారణమైన చార్జర్ కాక స్టాండర్డ్ చార్జర్ అడుగుతుంది. ‘కారిష్మాజీ.. మీరు సాధారణంగా మామూలు చార్జరే అడుగుతారు కదా.. మరిప్పుడు?’ అని ఆగుతాడు. సాధారణ చార్జర్ ధరకే క్రెడ్ బౌంటీ స్టాండర్డ్ చార్జర్ ఇస్తుండగా ఎందుకు కాదంటాను!’ అంటుంది. పార్లే జీ.. భారత్ కా అప్ నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్ ) నిరుటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లే జీ ‘ భారత్ కా అప్నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్)’ పేరుతో నోస్టాల్జియా క్యాంపెయిన్ యాడ్‌ను విడుదల చేసింది. ‘స్వాతంత్య్ర సమర ప్రయాణంలో మేమూ కలసి నడిచాం! చాయ్ తీపిని.. స్వాతంత్య్ర సాధన సంతోషాన్నీ రెట్టింపు చేశాం! దేశం సాధించిన ప్రతి విజయంలో భాగస్వాములమయ్యాం..’ అంటూ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు దేశం సాధించిన ప్రగతిని చూపిస్తూ.. అప్పటి నుంచీ ఉన్న తన ఉనికినీ ప్రస్తావిస్తూ .. నాటి జ్ఞాపకాల వరుసలో తనను ముందు నెలబెట్టుకుని.. ఇప్పటికీ అంతే తాజాగా ఉన్నానని చెబుతూ తన ప్రొడక్ట్ అయిన బిస్కట్స్‌ను మిలెనీయల్స్ చేతుల్లో ఉన్న చాయ్ కప్పుల్లో.. పాల గ్లాసుల్లోనూ డిప్ చేసింది. టాటా సాల్ట్ కూడా బాక్సర్ మేరీ కోమ్‌ను పెట్టి.. ‘దేశ్ కా నమక్’ పేరుతో నోస్టాల్జియా, సెంటిమెంట్‌ను కలిపి కొట్టి కమర్షియల్ యాడ్‌ను రూపొందించింది. అది వర్కవుట్ అయింది. మదర్స్ రెసిపీ కూడా తన పచ్చళ్ల వ్యాపార ప్రమోషన్‌కు జ్ఞాపకాల ఊటనే వాడుకుంది. దిన పత్రికలూ నోస్టాల్జియా ప్రకటనలనే నమ్ముకున్నాయి. అందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా ‘హ్యాకీ చాంపియన్’ యాడే ఉదాహరణ. ఇవేకాక పేపర్ బోట్, గూగుల్ వంటి న్యూజనరేషన్ కంపెనీలూ నోస్టాల్జియాను ప్లే చేశాయి. రీలాంచ్ కూడా నోస్టాల్జియాతో ప్రొడక్ట్ ప్రకటలనే కాదు ప్రొడక్షన్ ఆగిపోయిన వస్తువులనూ తిరిగి ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాటిల్లో పార్లే వాళ్ల రోలా కోలా ఒకటి. 80లు, 90ల్లో పిల్లలకు ఈ క్యాండీ సుపరిచితం. పదమూడేళ్లుగా ఇది ఆగిపోయింది. కానీ దీనితో ముడిపడున్న తీపి జ్ఞాపకాలు మాత్రం 80, 90ల్లోని పిల్లలతో పాటే పెరిగి స్థిరపడ్డాయి. అందుకే నాలుగేళ్ల కిందట.. కేరళకు చెందిన 29 ఏళ్ల సిద్ధార్థ్ సాయి గోపినాథ్ అనే యువకుడు రోలా కోలా ఫొటో పెట్టి.. దాన్ని పార్లేకి ట్యాగ్ చేస్తూ ఇది మళ్లీ మార్కెట్లోకి రావాలంటే ఎన్ని రీట్వీట్స్ కావాలంటూ ట్వీట్ చేశాడు. అతని ట్వీట్‌కి పార్లే స్పందించింది. కనీసం పదివేల రీట్వీట్స్ కావాలని బదులిచ్చింది. అయిదారు నెలలకు సిద్ధార్థ కోరిక నెరవేరింది. ‘మంచి ఫలితానికి నిరీక్షణ తప్పదు.. కానీ నిరీక్షణ ఫలితమెప్పుడూ తీయగానే ఉంటుంది.. రోలా కోలా ఈజ్ కమింగ్ బ్యాక్’ అంటూ పార్లే ప్రకటించింది. సిద్ధార్థ్ ఈ రోలా కోలా కోసం ట్యాగ్ చేయని సెలబ్రిటీల్లేరు.. మెగా బ్రాండ్స్ లేవు. ఆఖరకు నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏవియేషన్ కంపెనీలనూ వదల్లేదు. కాంపా కోలా.. 1970, 80ల్లో తన టేస్ట్‌తో మార్కెట్‌ను రిఫ్రెష్ చేసిన సాఫ్ట్‌డ్రింక్ ఇది. గ్లోబలైజేషన్‌తో మన అంగట్లోకి వచ్చిన పెప్సీ, రీ ఎంటర్ అయిన కోకా కోలా థండర్ వేవ్స్‌కి తట్టుకోలేక దేశీ సాఫ్ట్‌డ్రింక్ కాంపా కోలా కనుమరుగైపోయింది. దీన్నిప్పుడు రిలయెన్స్ కొనుగోలు చేసింది.. దేశీ డ్రింక్‌గా నాటి జ్ఞాపకాల చల్లదనంతో వినియోగదారులను సేదతీర్చడానికి సిద్ధమైంది. మ్యాగీ ఏమైనా తక్కువ తిందా? నిర్ధారిత పరిమాణం కన్నా సీసం పాళ్లు ఎక్కువున్నాయన్న కంప్లయింట్‌తో నెస్లే ప్రొడక్ట్ మ్యాగీ మన వంటింటి కప్‌బోర్డులను ఖాళీ చేసి వెళ్లిపోయింది. వెళ్లింది వెళ్లినట్టు ఊరుకుందా? లేదు! పిల్లల ఆకలి తీర్చిన ఇన్స్టంట్ ఫుడ్ జ్ఞాపకాలను రెచ్చగొట్టింది.. మిస్ యూ.. కబ్ వాపస్ ఆయేగా యార్ (తిరిగి ఎప్పుడొస్తున్నావ్) అంటూ! ప్రకటనలు, నలుమూలలా హోర్డింగ్‌లతో హోరెత్తించింది. ఈ ఉత్సాహం, స్ఫూర్తితో చాలా కంపెనీలు.. షటర్ మూసుకున్న తమ ప్రొడక్ట్స్‌ని కొత్తగా ముస్తాబు చేసి తిరిగి మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయట. కొత్తేం కాదు.. నోస్టాల్జియాతో మార్కెట్‌ను ఏలడం కొత్త అనుకుంటున్నాం కానీ.. కాదు. ఫ్యాషన్ ప్రపంచం ఫాలో అయ్యేది ఈ సూత్రాన్నే! బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్‌మన్ కలర్ కాలం నాటి ట్రెండ్స్‌ని రెట్రో స్టయిల్ పేరుతో ఎప్పటికప్పుడు మార్కెట్ చేయట్లేదూ..! అలా బెల్‌బాటమ్, త్రీ ఫోర్ హ్యాండ్స్ బ్లౌజెస్, పోల్కా డాట్స్ డిజైన్స్, ఫ్రెంచ్ కట్ బియర్డ్స్, పఫ్ కొప్పులు ఎట్సెట్రా లేటెస్ట్ ఫ్యాషన్‌గా ఎన్ని యూత్‌ని ఆకట్టుకోవడం లేదు! ఆధునిక సాంకేతికతకు కవల జంటలైన ‘ఈ’ జెనరేషన్కూ త్రోబ్యాక్ సుపరిచితమే సోషల్ మీడియా సాక్షిగా. నిజానికి ప్రస్తుతం పలు బ్రాండ్స్ చేస్తున్న ఈ నోస్టాల్జియా మార్కెట్‌కి ప్రేరణ సోషల్ మీడియా త్రోబ్యాక్ థర్స్డేతోపాటు అది పోస్ట్ అయిన పాస్ట్ ఈవెంట్స్.. ఇన్సిడెంట్స్లను తడవ తడవకు గుర్తుచేసే తీరే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్ట్రాటెజీ వల్ల పలు బ్రాండ్ల అమ్మకాలూ పెరిగాయనీ చెప్తున్నారు. ‘జ్ఞాపకాలనేవి భలే గిరాకీ బేరం. నాటి సంగతులను మంచి ఫీల్‌తో జత చేసుకుని వస్తాయి. ఎన్నటికీ ఇంకిపోని భావోద్వేగాల తడిని కలిగుంటాయి. కాబట్టే అవి మార్కెట్లో సేల్ అవుతున్నాయి’ అంటున్నారు ‘22ఫీట్ ట్రైబల్ వరల్డ్‌వైడ్’ నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ దేబాశీష్ ఘోష్. ‘టీబీడబ్ల్యూఏ ఇండియా’ సీసీఓ పరీక్షిత్ భట్టాచార్యేమో ‘నోస్టాల్జియా అనేది టైమ్ మెషిన్ లాంటిది. నడుస్తున్న కాలానికి అందులో యాక్సెస్ ఉండదు. మళ్లీ మళ్లీ అనుభూతి చెందాలనుకున్న క్షణాల్లోకి అది మనల్ని తీసుకెళ్తుంది.. మళ్లీ జీవించేలా చేస్తుంది. ఆ బలహీనతనే కంపెనీలు ఎన్‌క్యాష్ చేసుకుంటున్నాయి’ అంటున్నారు. అయితే ఈ ప్రహసనంలో కొన్ని బ్రాండ్స్.. పాత ప్రకటన లేదా జ్ఞాపకానికి సమకాలీనతను జోడించే ప్రయత్నంలో వాటికున్న ఎసెన్స్‌ను కాపాడుతూ ఆధునికతను అద్దడంలో విఫలమవు తున్నాయి. పాత యాడ్స్.. ఆ కాలంలో అద్భుతంగా ఉండి ఉండొచ్చు. అంతే అద్భుతమైన ఫలితాలనూ రాబట్టి ఉండొచ్చు. కాని వాటి విలువ సామాజికంగా కానీ.. కల్చర్ పరంగా కానీ ప్రాసంగికతను కలిగి ఉందా? దాన్ని నేటి తరం గ్రహించగలుగుతున్నదా? ఆ ప్రకటనల సారం నేటికీ సరిపోలనున్నదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి కొన్ని యాడ్స్‌ను ఇప్పుడు చూస్తే అంటే పరిణతి చెందిన ఆలోచనాతీరుతో.. ఇప్పుడు నెలకొని ఉన్న సున్నిత వాతావరణంలో పరికిస్తే అవి వివాదాస్పదంగా కనిపించవచ్చు. పురుషాధిపత్య ధోరణినీ చూపిస్తూండవచ్చు. కాబట్టి.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని పాత ప్రకటనలకు ఆ సెన్స్‌ను జోడించాకే నోస్టాల్జియా స్ట్రాటెజీని మార్కెట్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆర్మీలో చేరాలనుకున్నా.. కానీ!: రాజ్‌నాథ్ సింగ్ భావోద్వేగం
ఇంఫాల్: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం మణిపూర్‌లో ఉన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా ఆయనతోపాటు ఉన్నారు. ఆర్మీ అధికారులు, సైనికులను శుక్రవారం రాజ్‌నాథ్ సింగ్ కలిశారు. వారితో కలిసి అల్ఫాహారం చేశారు. ఇంఫాల్‌లో అస్సాం రైఫిల్స్ ఇండియన్ ఆర్మీలోని 57వ మౌంటైన్ డివిజన్ సైనికులను ఉద్ధేశించి మాట్లాడారు. ఈ మేరకు జవాన్ల ధైర్యసాహసాలను రాజ్‌నాథ్ కొనియాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి తన జీవితంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఇండియన్ ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని కలలు కన్నట్లు తెలిపారు. పరీక్ష కూడా రాసినట్లు పేర్కొన్నారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా చేరలేకపోయానని వెల్లడించారు. చదవండి: Video: ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం ‘నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు నేను కూడా భారత సైన్యంలో చేరాలని అనుకున్నాను. అందుకు తగిన విధంగా ప్రిపేర్ అయ్యాను. ఒకసారి షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్ష కూడా రాశాను. కానీ కుటుంబంలో ఎదురైన అనుకోని పరిస్థితులు, మా తండ్రి మరణంతో సైన్యంలో చేరలేకపోయాను.’ అంటూ ఎమోషనల్ అయ్యారు. సైనిక దుస్తులను చిన్నపిల్లవాడికి ఇచ్చినా అతడి వ్యక్తిత్వంలో దేశభక్తితో కూడిన మార్పు కనిపిస్తుందన్నారు. అలా ఆర్మీ యూనిఫామ్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది’ అని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి సైనికులను కలుస్తానని తెలిపారు. ఆర్మీ అధికారులను కలవడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. ‘మణిపూర్ పర్యటనను ప్లాన్ చేసినప్పుడు కూడా అస్సాం రైఫిల్స్, 57వ మౌంటైన్ డివిజన్ అధికారులను కలవాలనుకుంటున్నానని (ఆర్మీ చీఫ్) పాండేకు చెప్పాను. డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఓ విధంగా దేశానికి సేవ చేస్తున్నారు. కానీ మీరు నిర్వర్తించే బాధ్యతలు ఓ వృత్తి, సేవ కంటే గొప్పదని నేను నమ్ముతున్నాను. చాలా మందిని ఆర్మీలోకి తీసుకురావడంలో అస్సాం రైఫిల్స్ ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చదవండి: నిజంగా విడ్డూరమే! మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు, వైరల్ వీడియో -
చిన్నపాటి జ్ఞాపకం గుర్తు చేసుకున్న కేసీఆర్
-
ఇటుకలు దొంగతనం చేసి వికెట్స్ తయారు చేసేవాళ్లం
Rishab Pant And Shryeas Iyer Shares Childhood Memories.. అంతర్జాతీయ, దేశవాలీ క్రికెట్లో అంటే వికెట్లు ఉంటాయి.. అదే గల్లీ క్రికెట్ అంటే రాళ్లు, ఇటుకలు లేదంటే గోడలే వికెట్లుగా పెట్టుకొని ఆడడం చూస్తుంటాం. కాస్త ఖాళీ ప్రదేశం దొరికితే చాలు.. వెంటనే రాళ్లు పెట్టి క్రికెట్ ఆడడం మనకు బాగా అలవాటైపోయింది. తరాలు మారినా గల్లీ క్రికెట్లో మాత్రం ఎప్పటికీ మార్పు రాలేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ తమ చిన్ననాటి క్రికెట్ స్మృతులను గుర్తుచేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: IPL 2021: వారెవ్వా రియాన్ పరాగ్.. బులెట్ కంటే వేగంగా Courtesy: IPL Twitter ''మా ఇంటికి కొద్ది దూరంలోనే విశాలమైన మైదానం ఉంది. ఆ పక్కనే ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉండేది. నా స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి దొంగతనంగా ఇటుకలు ఎత్తుకొచ్చేవాళ్లం. వాటిని మైదానంలో అడ్డంగా పెట్టి వికెట్లుగా తయారుచేసి క్రికెట్ ఆడుకునేవాళ్లం. అంతేకాదు చిన్నప్పుడు నా వద్దనే బ్యాట్ ఉండేది. పొరపాటున నేను ఔటయ్యానో నా బ్యాట్ పట్టుకొని ఇంటికి పారిపోయేవాడిని. నన్ను వెతుక్కుంటూ నా స్నేహితులు ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నవ్వొస్తోంది.'' అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. Courtesy: IPL Twitter ఇక అయ్యర్ మాట్లాడుతూ.. '' నా చిన్నప్పుడు క్రికెట్ కంటే ఆటలో జరిగే గొడవలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడిని. తెలిసి తెలియని వయసులో క్రికెట్ ఆడుతున్న సమయంలో ఎవరో ఒకరు చీటింగ్ చేసి ఆడేవారు. అది జీర్ణించుకోలేని మిగతావారు అతన్ని టార్గెట్ చేస్తూ ఫైట్ చేసుకునేవారు. ఎంతైనా చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికి మధురంగానే ఉంటాయి.'' అని పేర్కొన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లోనూ అదరగొడుతుంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు.. 3 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలవాలనే సంకల్పంతో ఉంది. చదవండి: RR Vs RCB: ముస్తాఫిజుర్ రెహ్మాన్ సూపర్ ఫీల్డింగ్.. వావ్ అంటున్న ఫ్యాన్స్ #TeamHaiTohMazaaHai aur saath main bahut saari memories bhi banti hain 🤗 Let @ShreyasIyer15, @RishabhPant17, and @avesh_6 take you back to some fun cricketing times they've experienced growing up 💙#YehHaiNayiDilli #IPL2021 @Dream11 pic.twitter.com/03PgfwOYAc — Delhi Capitals (@DelhiCapitals) September 30, 2021 -
ఈ ఆట పేరేంటో మీకు గుర్తుందా?
గడిచిన కాలం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఒకప్పటి రోజులే బాగుండేవి అని అనుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలు మనకు బాల్యాన్ని గుర్తు చేస్తాయి. వాటిని చూసి చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసేవాళ్లం. అచ్చం ఇలాగే ఆడుకునేవాళ్లం అంటూ పాతరోజులను నెమరేసుకుంటాం. ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓ బామ్మ తన మనవరాలితో కలిసి ‘కచ్చకాయలు’ ఆడుకుంటున్న వీడియో నెటిజన్లకు తమ చిన్ననాటి జ్ఙాపకాలను గుర్తు చేస్తోంది. (వైరల్: పాము నీళ్లు తాగడం చూశారా?) పిల్లలు తమ అమ్మమ్మ, తాతయ్యలతో ఎందుకు సమయం గడపాలి అంటే’ అంటూ ఓ వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియోలో 60 ఏళ్ల వయసున్న బామ్మ తన మనవరాలతో కూర్చొని సరాదాగా కచ్చకాయలు/అచ్చన్న గిల్లలు ఆడుతోంది. ఆటను ఏకదాటిగా బామ్మ ఆడటాన్ని చూస్తున్న తన చిన్నారి మనవరాలు ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను శుక్రవారం ట్విటర్లో పోస్ట్ చేయగా ఇప్పటికే 15 వేలమంది లైక్ చేశారు. అనేక మంది వారి అనుభవాలు, బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. (జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది!) ‘హేయ్ నాకు ఈ ఆట తెలుసు. మా అమ్మ నాకు నేర్పించింది. ఒడిశాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఈ ఆట ఆడతారని తెలుసు’. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘నేటితరం పిల్లలు ఇలాంటి ఆటలను కోల్పోతున్నారు. దీనిని హర్యానాలో ‘ఘెట్’ అని పిలుస్తారు’. అని మరో నెటిజన్ పేర్కొన్నారు. కాగా దీనిని వివిధ ప్రాంతాల్లో అనేక ఇతర పేర్లతో పిలుచుకుంటారు. మరి మీరు ఈ ఆటను ఎప్పుడైనా ఆడారా.. అయితే ఈ వీడియోను చూసి ఆ మధురానుజ్ఙాపకాలను మరోసారి గుర్తుతెచ్చుకోండి. (చిన్నారి ఏడుపు.. పాలు అందించిన పోలీస్) -
‘కరెంటు పోయినప్పుడు అలాంటి ఆటలు ఆడేదాన్ని’
తానూ దొంగతనానికి పాల్పడినట్లు నివేదాపేతురాజ్ చెబుతోంది. పుట్టింది చెన్నైలోనేనైనా, బాల్యం అంతా దుబాయ్‌లో గడిపిన ఈ భామ మొదట మోడలింగ్ రంగాన్ని ఎంచుకుని ఆ తరువాత సినీ నటిగా రంగప్రవేశం చేసింది. అలా ఒరునాళ్ కూత్తు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం అయిన నివేదా పేతురాజ్ ఈ తరువాత పొదువాగ ఎన్ మనసు తంగం, టిక్ టిక్ టిక్, తిమిరు పిడిచ్చవన్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. ఇటీవల విజయ్‌సేతుపతితో నటించిన సంఘ తిమిళన్ చిత్రంలో కనిపించింది తక్కువే అయినా నటనతో తనదైన ముద్ర వేసుకుంది. కాగా ఈ చిన్నది వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ, ప్రభుదేవాకు జంటగా నటించిన పొన్ మాణిక్యం చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. జగజాల కిల్లాడీ చిత్రంలో నటిస్తున్న నివేదాపేతురాజ్ టాలీవుడ్‌లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. కాగా ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ అభిమానులతో ముచ్చటిస్తుంది. తాజాగా జరిగిన సంభాషణల్లో తన భావాలు వెల్లడించారు. అభిమానులు తమ బాల్యంలో జరిగిన సంఘటనలను ఆమెతో పంచుకుని సంతోష పడ్డారు. వారిలో కొందరి ముచ్చట్లను నివేదా పేతురాజ్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఒక అభిమాని పాఠశాలలో చదువుకునేటప్పుడు చాక్‌పీస్‌లను దొంగిలించేవాడినని చెప్పాడు. అందుకు స్పందించిన నివేదా చిన్నతనంలో తనకూ అలాంటి అలవాటు ఉండేదనిచెప్పింది. చాక్‌పీస్‌లను దొంగిలించి అమ్మకు ఇచ్చి ముగ్గులు వేయమనేదాన్ని అని అంది. మరో అభిమాని చిన్నతనంలో రాత్రి వేళ కరెంట్ పోయినప్పుడు చుట్టు పక్కన ఉండే పిల్లలతో కలిసి కథలు చెప్పుకోవడం, ఆటలాడుకోవడం వంటివి చేసే వాడినని చెప్పాడు. అందుకు నివేదాపేతురాజ్ కూడా తానూ అలాంటి ఆటలు ఆడేదాన్నని వెల్లడించింది. కరెంట్ పోయినప్పుడు ఇతర పిల్లల ముఖాలపై టార్చిలైట్ వేసి భయపెట్టేదాన్ని అని చెప్పింది. అలా చిన్న నాటి ముచ్చటలను తన అభిమానులతో పంచుకుని వారిని ఆనందంలో ముంచెత్తిన నివేదాపేతురాజ్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులతో చక్కగా ముచ్చటించే నివేదా పేతురాజ్ శభాష్ అంటూ పొగిడేస్తున్నారు. -
'చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాళ్లం'
సాక్షి, మెదక్ : చెరువు కట్టలపై పాటలు.. ఈత సరదాలు.. వర్షం కోసం ఎదురుచూపులు.. సినిమాలకు వెళ్లడం.. తరగతి గదిలో అల్లరి.. కోతికొమ్మచ్చి ఆటలు మరిచిపోలేనివని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్ తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బాల్యం ఓ మధురానుభూతి అని.. సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లడంతోపాటు ఆ రోజులే వేరుగా ఉండేవని.. తన చిన్ననాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వరుస ఎన్నికలు.. ఎన్నికల కోడ్ ముగిసి ప్రభుత్వ పథకాల అమలులో బిజీగా ఉన్న పరశురాం ‘పర్సనల్ టైం’ ఆయన మాటల్లోనే..మొత్తం హాస్టళ్లలోనే గడిచింది. పరకాల ఎస్టీ హాస్టల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు, అనంతరం వరంగల్ జిల్లా జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివాను. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఖమ్మం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ విద్యాభ్యాసం పూర్తి చేశాను. వివాహ నేపథ్యం.. 2002 మేలో నాకు వివాహమైంది. భార్య రేఖతోపాటు కూతురు రిషిక, రిషబ్ ఉన్నారు. పాఠశాలలో చదువుకునే సమయంలో వేసవి సెలవులు ఇవ్వగానే ఎక్కువగా మా అమ్మమ్మ ఇల్లు కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం, తెగెడపల్లి గ్రామానికి వెళ్తుండేవాడిని. చిన్నతనంలో చేసిన అల్లరి గుర్తుకొస్తే నవ్వు ఆపుకోలేకపోతాను. సొంతంగా గుల్లేర్ తయార్.. గ్రామంలో ఎవరి పెళ్లిళ్లలో అయినా బ్యాండ్ బజాయించారంటే చాలు.. స్టెప్పులేసే వాడిని. చిన్నప్పుడు ఆడిన కోతికొమ్మచ్చి, గోలీలు, పరుగు పందేలు వంటివి మరిచిపోలేని అనుభూతులు. నా బాల్యం నాటకాలు, ఆటలు, పాటల మధ్య ఎంతో ఉల్లాసంగా గడిచింది. వర్షం ఎప్పుడు పడుతదా.. స్కూల్‌కు సెలవు ఎప్పుడు ఇస్తరా అని ఎదురుచూసే వాడిని. సినిమాలంటే ఇష్టం.. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు సెలవులు వచ్చాయి. 35 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి యముడికి మొగుడు అనే సినిమాను చూశాను. పాఠశాలలో చదివే సమయంలో చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమాను 15 సార్లు చూశాను. మా స్కూళ్లో నేనే సినిమాలకు ప్లాన్ చేసే వాడిని. అప్పడే నెలకు రూ.500 సంపాదించేవాడిని.. చదువుకునే వయసులోనే సెలవులు వచ్చినప్పుడు పనికి వెళ్లేవాడిని. జామాయిల్ తోటలో పనిచేయడంతోపాటు తునికాకు ఏరేవాడిని. నెలకు రూ.500 వరకు సంపాదించా. నా బాల్యం నుంచి సదానందం, ఆరోగ్యం, సమ్మయ్య మంచి స్నేహితులుగా ఉన్నారు. వారితో కలిసి పనికి వెళ్లే వాడిని. తరగతి గదిలో మాథ్స్ టీచర్ సుదర్శన్‌రెడ్డి, లక్ష్మయ్య సార్లతో చేసిన అల్లరి ఎప్పటికీ మరిచిపోలేను. ఎంతో ప్రోత్సహించారు..నేను మా గ్రామంలో అగ్రికల్చర్ చదివిన ఓ వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో ఎదిగాను. అగ్రికల్చర్ బీఎస్సీలో శంకర్రావు, రామకృష్ణారావు టీచర్లు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మరిచిపోలేని అనుభూతులు.. సెలవుల్లో మా గ్రామ శివారులోని చెరువులో ఈత కొడుతున్నా. నా మిత్రుడు సమ్మయ్య లోతు ఎక్కువగా ఉన్న చోటకు వెళ్లి ప్రమాదంలో ఇరుక్కున్నాడు. ప్రాణాలు పోయే పరిస్థితి. ధైర్యం చేసి అతడి ప్రాణాలు కాపాడగలిగా. ఆ రోజు నుంచి సమ్మయ్య ప్రాణ స్నేహితుడిగా మిగిలిపోయాడు. నా చిన్ననాటి స్నేహితుడు రవీందర్. వేసవి సెలవులు రాగా.. ఆడుకోవడానికి అతడిని వాళ్ల అమ్మ పంపించలేదు. నాకు కోపం వచ్చి.. రాత్రి వాళ్ల ఇంటి నుంచి గోలెంను ఎతుకొచ్చా. దాన్ని మా ఇంట్లో దాచిపెట్టాను. ఈ విషయం రెండు వారాలకు బయటపడింది. దీన్ని నాతో పాటు మా ఇంట్లో వాళ్లు ఇప్పటికీ మరిచిపోలేరు. సెలవులుగా కదా అని సరదాగా మా పెద్ద నాన్న వాళ్ల పొలంలో మామిడి చెట్టు ఎక్కాను. మామిడి కాయలు తెంపుతుండగా.. మా పెద్ద నాన్న నామీద కోపంతో కుక్కను వదిలాడు. దాని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఓ చెట్టు ఎక్కాను. చీకటిపడే వరకు రెండు గంటలకు పైనే చెట్టు పై ఉన్నా. ఈ సంఘటన ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. -
దాగుడుమూత దండాకోర్
సంస్కృతీ సంప్రదాయాలపరంగా మన దేశం ఎప్పుడూ గొప్పగా ఉండటానికి ప్రాచీన ఆటలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. శివ-పార్వతులు సరదాగా పాచికలు ఆడటం, పాండవులు పాచికలాటలో ఓడిన విధం, మొఘలులు పగటి వేళ చదరంగం ఆడటం.. ఇలా మన పురాణేతిహాసాలను తెలుసుకోవాలంటే నీడపట్టున ఆడే మన సంప్రదాయక ఆటలు ఓ ముఖ్యమైన సాధనంగా పనిచేసేవి.అలాగే ఆరుబయట ఆడే ఆటలు పిల్లలలో ఉల్లాసాన్ని, శారీరక సౌష్టవాన్ని, స్నేహాలను పెంచుకోవడానికి వారధిగా పనిచేసేవి. కానీ, నేడు... గేమ్స్ అంటే వీడియోగేమ్స్, ప్లే స్టేషన్.. అనే అనుకుంటున్నారు పిల్లలు. వీటితోనే కూర్చున్న చోట నుంచి లేవకుండా రకరకాల గ్యాడ్జెట్స్‌తో కుస్తీపడుతున్నారు. స్నేహాలను పెంచి, మరిచిపోలేని బాల్యపు జ్ఞాపకాలను అందించే మన సంప్రదాయ ఆటలను ఈ వేసవిలో పిల్లలకు పరిచయం చేద్దాం రండి. ప్రాంతాలు, వారి వారి భాషలను బట్టి ఆటల పేర్లలో మార్పే తప్ప ఆడే తీరులో తెలుగురాష్ట్రాలలో ఒకే విధంగా ఉంటాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి.. వామనగుంటలు, అష్టాచమ్మా, పచ్చీసు, గచ్చకాయలు, .. వంటివి ఇంటి లోపల ఆడితే... ఖోఖో, కబడ్డీలతో పాటు బిళ్లంగోడు, తాడాట, బొమ్మా బొరుసు, వీరి వీరి గుమ్మడిపండు, కప్ప కంతులు, నాలుగు స్తంభాలాట, దొంగాపోలీసు, తొక్కుడుబిళ్ల... ఇలా ఎన్నో ఆరుబయట ఆటలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆటల గురించి... ఇంటిలోపలి ఆటలు వామనగుంటలు: దీర్ఘచతురస్త్రాకారంలో రెండు వరసలుగా చెక్కతో చేసిన బోర్డు గేమ్ ఇది. దీనిని ‘వామన గుంటల పీట’ అంటారు. దీనికి ఒక వైపు 7 గుంటలు, మరో వైపు 7 గుంటలు చొప్పున ఉంటాయి. దీంట్లో ఆడటానికి చింతపిక్కలు లేదా సీతాఫలం గింజలను వాడుతారు. ఇద్దరు ఆడే ఈ ఆటలో ఒక్కో గుంటలో 5 గింజల చొప్పున వేస్తూ ప్రారంభిస్తారు. ఒక గుంటలో గింజలు తీసి.. అన్ని గుంటలకు పంచుతూ.. గింజలన్నీ అయిపోయాక ఆ తరువాతి గుంటలో నుంచి గింజలు తీసి మిగతా గంటలలో వేయాలి. మధ్య ఖాళీ గుంట తటస్థ పడితే ఆ తరువాత గుంటలో ఉన్న గింజలన్నీ పంచిన వ్యక్తి గెలుచుకున్నట్టు. ఒకరు గింజలు పంచుతుంటే ప్రత్యర్థి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఎవరి దగ్గర ఎక్కువ గింజలు పోగయితే వాళ్లు గెలిచినట్టు. ఈ పీట అందుబాటులో లేకపోతే నేల మీద వృత్తాలు గీసి, వాటితో ఆడవచ్చు. అష్టా చెమ్మా: చతురస్రాకారంలో సుద్దముక్క లేదా బొగ్గు ముక్కతో గీసి ఆడుతుంటారు. ఇద్దరు/ ముగ్గురు/ నలుగురు ఆడే ఆట. ఆడటానికి నాలుగు గవ్వలను, లేదంటే అరగదీసిన చింతపిక్కలను వాడుతారు. ఆడేటప్పుడు నాలుగు గవ్వలను ఒకేసారి నేలకు విసురుతారు. దాంట్లో కొన్ని వెల్లికిలా, మరికొన్ని బోర్లా పడతాయి. నాలుగు గవ్వలూ బోర్లా పడితే దానిని ‘అష్టా’(8) అంటారు. నాలుగు గవ్వలు వెల్లికల్లా పడతే దానిని ‘చెమ్మా’(4) అంటారు. ఒక్కొక్కరి దగ్గర నాలుగు పావులు లేదా చింతపిక్కలు ఉంటాయి. ఈ పావులు ఎవరెవ వి ఏ రంగో తెలియడానికి నాలుగు విభిన్నమైన రంగులను ఎంచుకుంటారు. దక్షిణం, తూర్పు, ఉత్తరం, పడమర.. వైపుగా ఆట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పచ్చీసు: బట్టను నాలుగువైపులా పట్టీలతో కుట్టాలి. లేదా తాత్కాలికంగా సుద్దముక్కతో కూడా గీసి ఆడుకోవచ్చు. పందెం వేయటానికి ఏడుగవ్వలు వాడుతారు. అదేవిధంగా పదహారు కాయలుంటాయి. ఆటలో నలుగురు నాలుగు కాయల చొప్పున పంచుకుంటారు. వీటి రంగులు ఎరుపు, పసుపు, పచ్చ, నలుపు ఉంటాయి. వీటిని పావులు అంటారు. పచ్చీసు నేల మీద పరిచి నలుగురు నాలుగువైపులా కూచొని గవ్వలతో పందెం వేస్తారు. గవ్వలతో దస్, తీస్, పచ్చీస్ వేసినప్పుడు పావులు వస్తాయి. పందెం గడివైపు సాగుతుంది. ముందున్నవారు తల్లి(మధ్య)గడివైపు వెళ్లేలోపు వట్టి చోట్ల ఉంటే వారి తరువాత వారు ముందు పావును చంపవచ్చు. గడిలో చేరిన పావుల్ని చంపరాదు. ఈ పందాల విలువ పచ్చీస్ అంటే ఇరవై అయిదు, తీస్ అంటే ముప్పయ్, దస్ అంటే పది. ఎవరు ముందు మధ్యలో ఉన్న ఇల్లు చేరితే, చుట్టూ నాలుగు వైపులా పూర్తి చేయగల్గితే వాళ్లు ఆటలో గెలిచినట్టు. చదరంగం: భారతదేశపు ప్రాచీన ఆట. మన దేశం నుంచి దక్షిణ ఐరోపా ఖండంలో 15 వ శతాబ్దిలో కాలు మోపి ప్రస్తుతం ఎన్నో మార్పులు చోటుచేసుకొని చెస్‌గా రూపాంతరం చెందింది. 16 తెల్లపావులు 16 నల్లపావులు గల బోర్డు గేమ్ ఇది. చదరపు గళ్లు ఉండే ఈ ఆటలో తెల్లపావులను ఒక ఆటగాడు, నల్ల పావులను మరొక ఆటగాడు నియంత్రిస్తుంటారు. రాజు, మంత్రి, ఏనుగులు, గుర్రాలు, శకటాలు లేదా సైనికులు .. అంటూ సాగే ఈ ఆట ఎత్తుగడలూ, యుక్తులతో ప్రత్యర్థిని ఏ విధంగా చిత్తు చేయాలో.. తెలియజేస్తుంది. అచ్చంగిల్లాలు/ గచ్చకాయలు: ఐదు నున్నటి రాళ్లు లేదా ఐదు గచ్చకాయలతో ఆడే ఆట ఇది. నాలుగు రాళ్లను కింద వదిలేసి, ఒకరాయిని పైకి విసురుతూ కింద రాళ్లని, పైనుంచి కింద పడేరాయిని నేర్పుగా పట్టుకోవడం ఈ ఆటలోని గమ్మత్తు. దశలవారీగా సాగే ఈ ఆటను పిల్లలు అత్యంత ఉత్సాహంగా ఆడుతుంటారు. ఆరుబయట ఆటలు దొంగా పోలీసు/దాగుడుమూతలు: ఇది ఏ వేళైనా ఇంటా, బయటా ఆడచ్చు. పెద్దవాళ్లు తమ పిల్లలతోనూ ఈ ఆట ఆడవచ్చు. మానసిక అనుబంధాలు బలపడే ఈ ఆట పిల్లలు చాలా చిన్న వయసు నుంచే ఆడుతుంటారు. దీంట్లో అటాచ్మెంట్- డిటాచ్మెంట్ ఎలా సమం చేయాలో నేర్చుకుంటారు. గోటీ కంచా: ఇది గల్లీలలో సాధారంగా పిల్లలు ఆడే ఆట. మగపిల్లల ఆటగా ప్రసిద్ధి పొందిన ఈ ఆటలో ఒక గోటీతో మిగతా గోటీలను గురిచూసి కొడతారు. గోటీలు పోగవడం కోసం పిల్లలు ఉత్సాహంతో పోటీపడతారు. ఏడుపెంకులాట: ఒకటి పెద్దగా, రెండవది చిన్నగా...ఇలా ఏడు పెంకులు లేదా రాళ్లు ఒక్కోదాని మీద ఒకటి ఉంచాలి. ఎంచుకున్న దూరం నుంచి హ్యాండ్ బాల్ని బలంగా విసిరి ఈ రాళ్లను కొడతారు. బొంగరం ఆట: దీనినే గేమింగ్ టాప్ అని కూడా అంటారు. ఈ ఆటలో నైపుణ్యం, ఆసక్తి రెండూ అవసరం. జూటీని చుట్టేందుకు బొంగరం కిందివైపున మేకు ఉండి ‘వి’ ఆకారంలో పైకి మెట్లు మెట్లుగా ఉంటుంది. పై భాగాన డోమ్ లాగా ఉండి చేతితో పట్టుకొని విసరడానికి అనువుగా ఉంటుంది. మేకు కింది వైపున ఉండటం వల్ల బొంగరం వేగంగా, ఎక్కువసేపు తిరగడానికి అనువుగా ఉంటుంది. తొక్కుడు బిళ్ల: ఈ ఆటను ఒంటరిగా లేదా జట్టుగా ఆడవచ్చు. ఈ ఆట క్రమంగా అంతరించిపోయేలా ఉంది. పక్కపక్కనే ఉండే నాలుగు నిలువుగళ్లు, రెండు అడ్డగళ్లు గల దీర్ఘచతురస్త్రాకార గడులను గీయాలి. తరువాత గడుల బయట ఆడేవారు నిలుచోవాలి. ముందు ఒకరు చేతిలో బిళ్ళను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత గడులను దాటించాలి. ఏ సమయంలోనూ కాలు గానీ, బిళ్లగాని గడుల గీతలను తాకరాదు. గడులన్నీ అయిపోయాక కాలివేళ్ల మధ్య బిళ్లను బిగించి పట్టుకుని దాన్ని కుంటికాలితో ఎనిమిది గడులను గెంతిరావాలి. తరువాత కాలి మడమ మీద, తలపైన, అరచేతిలో, మోచేతిపైన, భుజం పైన పెట్టుకొని అన్ని గడులను దాటాలి. ఇవన్నీ దాటితో వారే గెలిచ్చినట్టు. బిళ్ళంగోడు/ గిల్లీ డండా: మూరెడు పొడుగున్న (గోడు) జానెడు పొడుగున్న (బిళ్ల) రెండూ కట్టెల్ని నున్నగా చెక్కి తయారుచేసుకుంటారు. చిన్నదైన బిళ్ళను సన్నని గుంట తీసి దాని మీద అడ్డంగా ఉంచి, పెద్ద కర్రతో లేపి కొడతారు. అది వెళ్లి పడిన చోటు నుంచి కర్రతో కొలుస్తారు. ఎవరిది ఎక్కువ దూరం పడితే వాళ్లు గెలిచినట్టు. నేల - బండ: ఈ ఆటను ఎంతమందైనా ఆడుకోవచ్చు. ముందు ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. దొంగని నేలకావాలో బండ కావాలో కోరుకోమంటారు. దొంగ నేల కోరుకుంటే మిగిలినవారంతా బండ మీద ఉండాలి. బండపై ఉన్నవారు నేల మీదకు వచ్చి దొంగను ఆటపట్టించాలి. దొంగ బండ పైకి వెళ్లకుండా నేల మీదకు వచ్చిన వాళ్లని పట్టుకోవాలి. దొంగకు చిక్కన వారు దొంగస్థానాన్ని భర్తీ చేస్తారు. కబడ్డీ: ఒక్కో జట్టులో 7 గురు ఆటగాళ్లు ఉంటారు. ఒక ఆటగాడు రెండవైపు కబడ్డి, కబడ్డీ.. అని గుక్కతిప్పుకోకుండా వెళ్లి అవతలి జట్టువారిని టచ్‌చేసి తిరిగి మధ్య గీతను ముట్టుకోవాలి. ఎంతమందిని ముట్టుకుంటే అంతమంది ఔట్ అయిపోయినట్టే. అన్ని మార్కులు రెండవ జట్టుకు వస్తాయి. కూత ఆపినా ఔట్ అయినట్టే. రెండవజట్టూ ఇలాగే చేయాలి. ఆటపూర్తయిన తర్వాత ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ జట్టు గెలిచినట్టు నిర్ణయిస్తారు. -
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి...
గుంటూరు స్పోర్ట్స్: కళాశాల వాతావరణం చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. తాడికొండ మండలం మోతడక గ్రామంలో చలపతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురువారం జరిగిన స్పోర్ట్స్ కార్నివాల్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. తొలుత స్పీకర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చలపతి విద్యాసంస్థల చైర్మన్ వై.వి.ఆంజనేయులుకు స్పీకర్ కోడెల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ సంగీతవిభావరి ఆహూతులను అలరించాయి. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ నన్నపనేని రాజకుమారి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఆర్డీవో భాస్కర్‌నాయుడు, జిల్లాపరిషత్ ఉపాధ్యక్షుడు పూర్ణచంద్రరావు, కళాశాల ప్రిన్సిపాల్ సి.రవికాంత్, డెరైక్టర్ వినయ్‌కుమార్, ఫిజికల్ డెరైక్టర్లు, శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గేదెలు కాసేవాడిని : సీఎం బాల్య స్మృతులు
బెంగళూరు: తన బాల్యంలో శని, ఆదివారాలలో గేదెలు కాసేవాడినని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా చెప్పారు. విధానసౌధలో ఈరోజు నిర్వహించిన 'బాలల హక్కుల పార్లమెంట్' అనే కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపికగా, ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. చిన్నప్పుడు తన చేత బీడీలు తెప్పించేవారని, వాటిని తానోసారి కాల్చి ఆ తర్వాత తెచ్చి ఇచ్చేవాడినని చెప్పారు. ఇలా తన చిన్ననాటి అనుభవాలను అనేకం వారితో పంచుకున్నారు. తాను ఫ్యాంటు ఎప్పుడు వేసుకున్నది, చెప్పులు ఎప్పుడు వేసుకున్నది... ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అనేకం ఆయన తెలిపారు. ''నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు అసలు పాఠశాలకే వెళ్లలేదు. అప్పట్లో మా ఊరిలో ఎక్కువగా జానపద కళలకు ప్రాధాన్యం ఉండేది. దాంతో మా నాన్న నన్ను ఆయా కళలు నేర్చుకునేందుకు పంపేవారు. నాకు జానపద కళలు నేర్పించే మాస్టారే నాకు అక్షరాలు నేర్పించారు. ఆయన ప్రోత్సాహంతోనే నేరుగా ఐదో తరగతిలో చేరాను. అప్పుడు పాఠశాలకు వెళ్తూనే నా తల్లిదండ్రులకు వ్యవసాయంలో సహాయం చేసే వాడిని. శని, ఆదివారాల్లో గేదెలు కాసేవాడిని. ఇప్పట్లోలా అప్పుడు మాకు సరైన దుస్తులు కూడా లేవు. నేను ఫ్యాంట్ వేసుకుంది ఎనిమిదో తరగతికి వచ్చాక. అప్పటి వరకు నిక్కర్లే వేసుకున్నాను. మొదటి సారిగా చెప్పులు వేసుకుంది కూడా ఎనిమిదో తరగతికి వచ్చాకే. అప్పటి వరకు రోజూ పాఠశాలకు రెండు కిలోమీటర్లు చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వెళ్లేవాడిని''అని గత స్మృతులను నెమరువేసుకున్నారు. **