కలెక్టరేట్,న్యూస్‌లైన్: జిల్లా ప్రజల సహకారా లు మరువలేనివని ఎస్పీ డాక్టర్ రవీందర్ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని డ్వామా సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పనిచేసిన కాలంలో కలెక్టర్లు, అధికారుల సంపూర్ణ సహకారంతో సమన్వయంతో సమస్యలు లేకుండా విధులు నిర్వహించామన్నారు. మారుమూల నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఐఏపీ నిధులతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ముకునూర్, నీలంపల్లి, దమ్మూర్‌కు బస్ సౌకర్యం మెరుగుపడితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ అరుణ్‌కుమార్, ఇతర జిల్లా అధికారులు ఎస్పీకి జ్ఞాపికను ఇచ్చి, వీడ్కోలు పలికారు. డీఆర్వో కృష్ణారెడ్డి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు శంకరయ్య, మనోహర్, హౌజింగ్ పీడీ న ర్సింగరావు, జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పని చేయడం సంతృప్తినిచ్చింది
కరీంనగర్ క్రైం : సమర్థవంతమైన సేవలందించడంలో జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని జిల్లా ఎస్పీ రవీందర్ అన్నారు. ఆయన ఇంటలిజెన్స్ ఎస్పీగా బదిలీ కావడంతో జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు బుధవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వీడ్కోలు పలుకుతూ కవాతు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తులు ఉన్న జిల్లాలో అందరినీ కలుపుకుపోతూ పని చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. సమాజ సేవ కోసం జిల్లా పోలీసులు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడబోరని పలుమార్లు నిరూపించారన్నారు.
సిబ్బంది దురవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో టర్నవుట్‌తో ఉన్న పోలీసులకు రివార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలన అడిషనల్ ఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఓఎస్డీ సుబ్బారాయిడు, డీఎస్పీలు రవీందర్, ఏఆర్ డీఎస్పీ సదానందరెడ్డి, ఎస్‌బీఐ శ్రీనివాసరావు,ఆర్‌ఐ యాకుబ్‌రెడ్డి, గంగాధర్, శశిధర్, సీఐలు నరేందర్, విజయకుమార్, విజయ్‌రాజ్, కమాలాకర్‌రెడ్డి, తిరుపతిరావు, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సురేందర్ పాల్గొన్నారు.
జిల్లా ప్రజల సహకారం మరువలేనిది
Published Thu, Oct 31 2013 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement