మునిసిపల్ సిబ్బంది విధుల బహిష్కరణ
ఏఈపై దాడి చేసిన టీడీపీ నేతను అరెస్ట్ చేయాలని ర్యాలీ, రాస్తారోకో
కదిరి :
కదిరి మునిసిపల్ ఏఈ సుభాష్ చంద్రబోస్‌పై దాడి చేసిన కౌన్సిలర్ భర్త, టీడీపీ నేత శ్రీరాములును తక్షణమే అరెస్ట్ చేయాలని మునిసిపల్ సిబ్బంది, కార్మికులు దాదాపు 200 మంది సోమవారం మూకుమ్మడిగా విధులు బహిష్కరించా రు. కార్యాలయానికి తాళం వేసి ర్యాలీగా టవర్‌క్లాక్ కూడలికి చేరుకుని రాస్తారోకో చేశారు. సిబ్బంది మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలించుకోవడానికి అనుమతి ఇవ్వలేదన్న కోపంతో విధి నిర్వహణలో ఉన్న ఏఈపై టీడీపీ నాయకుడు దాడికి పాల్పడటం విచారకరమన్నారు. మహిళా ప్రతినిధుల భర్తలు, కుమారు లు, కుటుంబ సభ్యులు, బంధువుల పెత్తనం అధికమైందన్నారు. ఎవరి మాట వినాలో.. ఎంతమందికి నమస్కారాలు పెట్టాలో అర్థం కావడం లేదన్నారు. ఇదిలాగే కొనసాగితే తాము విధులు సక్రమంగా నిర్వర్తించలేమన్నారు. ఓ కౌన్సిల ర్ భర్త రూ.200 రుసుం కలిగిన కొళాయి కనెక్షన్‌కు రూ.2 వేలు చొప్పున వసూలు చేసి 60 వరకు కొళాయి కనెక్షన్లు ఇప్పించి నట్లు తెలిసిందని, ఇలాంటి చర్యల వల్ల అధికారులు, సిబ్బందికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం వారు పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాసరావును కలిసి సాయంత్రంలోగా నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షం లో మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మునిసిల్ సిబ్బంది ఆందోళనకు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.