వెల్లివిరిసిన మత సామరస్యం
క్రీస్మస్ కేక్‌లు కట్‌చేసి, దుస్తులు
పంపిణీ చేసిన ముస్లిం సోదరులు
కాశిబుగ్గ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకోని గురువారం లోతుకుంట చర్చిలో స్థానిక మాజీ కార్పొరేటర్ యాకుబ్‌పాషా ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండా సురేఖ హాజరై క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి, స్థానికులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మత సామరస్యాన్ని చాటేలా క్రిస్మస్ నిర్వహించిన యాకూబ్‌పాషాను ఎమ్మెల్యే కొండా సురేఖ అభినందించారు.
నిజాంపురలో చీరల పంపిణీ..
వరంగల్ 16వ డివిజన్ నిజాంపురలోని సెంటినరీ ట్రినిటి బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అబ్దుల్ ఖహార్ స్థానికులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు సాబిర్, అప్సర్, సలీమ్, గోరెబాయి, దేవదాసు, బాబురావు, వినోద్‌కుమార్, ఆశిర్వాదం, జోసఫ్, అలెగ్జండర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
15వ డివిజన్‌లో..
వరంగల్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని 15వ డివిజన్‌లోని అంబేద్కర్‌భవన్‌లో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ కార్పొరేటర్ మునవరున్నిసా క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు సాదిఖ్, టీఆర్‌ఎస్ నాయకులు బరుపట్ల మొగిళి, జన్ను ప్రదీప్, కందుకూరి దినేష్, రాము,వేణు, సంజీవ, దయాకర్, స్వామి, సుధీర్ రమేష్, సంఘ పాస్టర్ నరేష్‌పాల్ తదితరులు పాల్గొన్నారు.
హమ్ సబ్ భాయీభాయీ
Published Sat, Dec 26 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM
Advertisement
Advertisement