పోలీసులను ఆశ్రయించిన తండ్రి
కుమార్తెను తీసుకెళ్లిన తల్లి
డబ్బుకోసం న్యాయవాది ద్వారా మంతనాలు
కురబలకోట: కన్న కూతుర్నే ఓ తల్లి కిడ్నాప్ చేసిన సంఘటన ఇది. ఒకటన్నర లక్ష డబ్బిస్తే బిడ్డను తండ్రివద్దకు పంపుతామని న్యాయవాది ద్వారా మంతనాలు సాగిస్తున్నట్లు వెల్లడవుతోంది. విధిలేని పరిస్థితిలో బిడ్డ తండ్రి సి.శ్రీధర్ బుధవారం ఈ ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం అంగళ్లు సబ్ స్టేషన్‌లో జూనియర్ లైన్‌మన్‌గా సి.శ్రీధర్ పనిచేస్తున్నారు. ఈయన గతంలో వైజాగ్‌లో ఉండగా పి.కనకమహాలక్ష్మితో పరిచయం ప్రేమకు దారితీసింది. 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2005లో కుమార్తె పుట్టింది. 2012 వరకు వీరి కాపురం సజావుగా సాగింది. ఆతర్వాత శ్రీధర్‌కు పక్షవాతం రావడంతో కుటుంబీకుల్లో మార్పు వచ్చింది. అత్త, మామ, భార్య ఒక్కటయ్యారు. లైన్‌మన్ శ్రీధర్ ఉద్యోగం, డబ్బు తమకు వచ్చేలా చెయ్యాలని భార్య త ల్లిదండ్రులతో కలసి పట్టుపట్టారు.
శ్రీధర్‌ను వేధింపులకు గురిచేశారు. ఆయన అంగీకరించకపోవడంతో భార్య వైజాగ్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్లో కుమార్తె హిమకిరణ్‌ను కూడా వారు వెంట తీసుకె ళ్లారు. రెండేళ్ల తర్వాత శ్రీధర్ ఆరోగ్యం కుదుటపడింది. అనంతరం ఆయన వైజాగ్ వెళ్లి కుమార్తె హిమకిరణ్‌ను తీసుకువచ్చాడు. మదనపల్లెలోని ఓ ప్రయివేటు స్కూల్‌లో చేర్పించాడు. హాస్టల్‌లో ఉంటూ ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా ఈనెల 18న వైజాగ్‌లోని శ్రీధర్ భార్య ఇక్కడికి వచ్చి కుమార్తె వివరాలు తెలుసుకుంది. ఇంటికి వెళుతున్నానని చెప్పి కుమార్తెను మంగళవారం వైజాగ్‌కు వెంట తీసుకెళ్లిపోయింది. వైజాగ్‌లోని ఓ న్యాయవాది ద్వారా మాట్లాడిస్తూ ఒకటిన్నర లక్ష ఇస్తే తామే కుమార్తెను తీసుకొచ్చి అప్పగిస్తామని చెబుతోందని శ్రీధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సెల్ రికార్డింగ్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నాడు. కేసు విచారిస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు.
నా బిడ్డను అప్పగించండి
Published Thu, Dec 24 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM
Advertisement
Advertisement