The kidnappers
-
కరీంనగర్లో కిడ్నాప్ కలకలం
-
వీరేషా... అతనెవరు?
ప్రశ్నిస్తున్న హరినగర్ వాసులు సోదాలు చేసిన నగర పోలీసులు సిటీబ్యూరో: షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధి నుంచి పదో తరగతి విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన కేసులో ముషీరాబాద్ పరిధిలోని హరినగర్ తెరపైకి వచ్చింది. ఈ ఉదంతంలో కిడ్నాపర్లు అభయ్ తండ్రి రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడానికి ‘7842276480’ ఫోన్ నెంబర్ వాడారు. టాటా డొకోమోకు చెందిన ఈ నెంబర్ ‘బి.వీరేష్, 1-7-1022/8/9/బీ, హరినగర్, నియర్ పోచమ్మ టెంపుల్, రామ్‌నగర్, ముషీరాబాద్’ చిరునామాతో రిజిస్టర్ అయి ఉంది. దీంతో ‘సాక్షి’ ఆ ఇంటికి వెళ్లి వీరేష్ కోసం ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వాళ్లు సైతం అలాంటి పేరు గల వ్యక్తులు ఎవరూ ఇక్కడ లేరని, గతంలోనూ నివసించలేదని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి నగర పోలీసులు సైతం వచ్చి సోదాలు చేసి వెళ్లారని వివరించారు. దీంతో కిడ్నాపరుల తప్పుడు వివరాలతో సిమ్‌కార్డు తీసుకుని ఉంటారని పోలీసులు చెప్తున్నారు. సిమ్‌కార్డ్ ఔట్‌లెట్స్‌పై దాడులు... అభయ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు ఈ కుట్రను అమలు చేయడానికి బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వినియోగించినట్లు తేలింది. ఇలాంటి సిమ్‌కార్డుల్ని ఎక్కువ ధరకు విక్రయిస్తున్న దుకాణాలతో పాటు నిందితులు సిమ్స్ ఖరీదు చేసిన దుకాణాన్నీ పోలీసుల గుర్తించారు. దీంతో నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌లోని కొన్ని దుకాణాలపై దాడులు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిలో దుండగులకు సిమ్‌కార్డులు అమ్మిన వారు ఎవరనేది ఆరా తీస్తున్నారు. -
కిడ్నాప్ మిస్టరీని చేధించిన పోలీసులు
= నలుగురి అరెస్ట్ = రూ.5 లక్షల నగదు, మారుతి కారు, పల్సర్‌వాహనం స్వాధీనం బెంగళూరు(బనశంకరి) : బోల్ట్‌నట్ తయారీ కంపెనీ యజమాని కిడ్నాప్ ఉదంతాన్ని చేధించిన చెన్నమ్మకెర అచ్చుకట్టె పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.5లక్షల నగదు, రెండు ఉంగరాలు, మారుతీ కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.డీసీపీ లోకేశ్‌కుమార్ తెలిపిన మేరకు వివరాలు.. నాగేగౌడనపాళ్యకు చెందిన ముత్తురాజ్, యలచేనహళ్లి నివాసి నారాయణ, అభిషేక్, రాకేశ్‌లు సుబ్రహ్మణ్య పుర పరిధిలోని ఏజీఎస్లేఔట్ కు చెందిన బోల్ట్‌నట్ కంపెనీ యజమాని గోపినాథ్‌ను గత నెల 26 తేదీన కిడ్నాప్ చేశారు. గోపీనాథ్‌ను అతని కారులోనే రాచనమడు అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. అతనినుంచి రూ.35 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు అతని వద్ద రెండు బంగారు ఉంగరాలు, రూ. 5 లక్షల నగదును స్వాధీనం చేసుకొని వదలివేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు దక్షిణ విభాగం డిప్యూటీ పోలీస్‌కమిషనర్ బీఎన్.లోకేశ్‌కుమార్ మార్గదర్శనంలో బనశంకరి ఉప విభాగం సహాయక పోలీస్ కమిషనర్ ఆర్సీ.లోకేకుమార్ నేతృత్వంలో చెన్నమ్మకెరె అచ్చుకటె సీఐ టీటీ.కృష్ణ, ఎస్ఐ. ఎస్పీ.కమారస్వామి కేసు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి నగదు, బంగారు ఉంగరాలు, మారుతీకారు, బైక్, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. -
నయా కిడ్నాపింగ్ గ్యాంగ్
బిజినెస్ డీల్స్ పేరుతో వ్యాపారులకు ఎర బెంగళూరుకు పిలిచి కిడ్నాప్ నగరానికి చెందిన ముగ్గురిని రక్షించిన పోలీసులు అక్కడి మాజీ కార్పొరేటర్ కుమారుడు సూత్రధారి సిటీబ్యూరో: వ్యాపార లావాదేవీల పేరుతో పొరుగు రాష్ట్రాల వ్యాపారులకు ఎర వేయడం... తమ వద్దకు రప్పించి వారిని కిడ్నాప్ చేయడం... కుటుంబీకుల నుంచి అందినకాడికి దండుకుని వదిలిపెట్టడం...కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా యథేచ్ఛగా రెచ్చిపోతున్న కిడ్నాపింగ్ గ్యాంగ్ వ్యవహారమిది. వీరి చెరలో చిక్కిన ముగ్గురు నగరవాసుల్ని రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) జోక్యంతో అక్కడి విల్సన్ గార్డెన్ పోలీసులు రెస్క్యూ చేశారు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఠా ఏజెంట్లుగా స్థానికులు... బెంగళూరుకు చెందిన ఓ మాజీ మహిళా కార్పొరేటర్ కుమారుడు సందీప్ ఈ గ్యాంగ్‌కు సూత్రధారి. అక్కడి కోరమంగళ, మదికెరి తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది చిల్లర దొంగల్ని చేరదీసి ముఠాలో చేర్చుకున్నాడు. వీరంతా బెంగళూరులోని లాల్బాగ్ గార్డెన్ వెస్ట్గేట్ ప్రాంతంలో ఉన్న ఓ పాత గోడౌన్‌ను డెన్‌గా చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలకు చెందిన వారితో ఒప్పందాలు కుదుర్చుకున్న సందీప్ ఆయా ప్రాంతాలకు ఏజెంట్లుగా పెట్టకున్నాడు. ఆయా నగరాల్లో ఉన్న వ్యాపారస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, వారి లావాదేవీలు తెలుసుకుని సందీప్‌కు సమాచారం ఇవ్వడం వీరి పని. ఇలా చేసినందుకు ప్రతి కిడ్నాప్‌కు వీరికి కొంత కమిషన్ చెల్లిస్తున్నాడు. ‘తక్కువ’ అంటూ రప్పించి... వ్యాపారస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే ‘లోకల్ ఏజెంట్లు’ వారి లావాదేవీల పూర్తి వివరాలు సందీప్‌కు అందిస్తారు. వీటి ఆధారంగా వారు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన సరుకు తక్కువ ధరకు ఇస్తామంటూ ఏజెంట్ల ద్వారానే సందీప్ వర్తమానం పంపుతాడు. బెంగళూరు శివార్లలో ఓ కంపెనీ మూతపడుతోందని, అందుకే అతి తక్కువ ధరకు భారీగా సరుకును విక్రయిస్తున్నామంటూ నమ్మబలుకుతాడు. ఇలా తమ వల్లో పడిన వారితో ముందు గా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని, బెంగళూరు వచ్చి సరుకు చూసుకున్న తర్వాత నచ్చితేనే లావాదేవీలు కొనసాగిస్తామంటూ వలవేస్తారు. దీనికి ఆశపడిన వ్యాపారస్తులు బెంగళూరు చేరుకున్న వెంటనే తమ ఆధీనంలోకి తీసుకుని అసలు ‘పని’ ప్రారంభిస్తుందీ గ్యాంగ్. ముగ్గురు ‘సిటీ’జన్ల కిడ్నాప్... నగరానికి చెందిన ముగ్గురు వ్యాపారులకు గత నెల్లో ఈ ముఠా ఎరవేసింది. శ్రీకాంత్ అనే ఏజెంట్ ద్వారా వ్యవహారాలు నడిపింది. ఈ ముగ్గురినీ 15 రోజుల క్రితం బెంగళూరుకు రప్పించింది. అక్కడికి చేరుకున్న ముగ్గురినీ ఓ కారులో కిడ్నాప్ చేసిన గ్యాంగ్ తమ డె న్లో బంధించింది. మారణాయుధాలతో బెదిరించడంతో పాటు తీవ్రంగా గాయపరిచింది. నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబీకులకు ఫోన్లు చేసి రూ.20 లక్షల చొప్పున డిమాండ్ చేసింది. దీంతో నగరానికి చెందిన బాధితుల సంబంధీకులు సీఐడీలోని సైబర్ క్రైమ్ ఎస్పీ యు.రామ్మోహన్‌ను సంప్రదించారు. వెంటనే ఆయన బెంగళూరులోని విల్సన్ గార్డెన్ పోలీసులను అప్రమత్తం చేశారు. పూర్తిస్థాయిలో సాంకేతిక సహకారం అందిస్తూ కిడ్నాప్ ముఠాకు చెందిన నలుగురు అరెస్టు అయ్యేలా చేయడంతో పాటు వారి ఆధీనంలో ఉన్న నగరవాసులు ముగ్గుర్నీ రక్షించారు. పరారీలో ఉన్న 12 మంది ముఠా సభ్యుల కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నారు. -
నా బిడ్డను అప్పగించండి
పోలీసులను ఆశ్రయించిన తండ్రి కుమార్తెను తీసుకెళ్లిన తల్లి డబ్బుకోసం న్యాయవాది ద్వారా మంతనాలు కురబలకోట: కన్న కూతుర్నే ఓ తల్లి కిడ్నాప్ చేసిన సంఘటన ఇది. ఒకటన్నర లక్ష డబ్బిస్తే బిడ్డను తండ్రివద్దకు పంపుతామని న్యాయవాది ద్వారా మంతనాలు సాగిస్తున్నట్లు వెల్లడవుతోంది. విధిలేని పరిస్థితిలో బిడ్డ తండ్రి సి.శ్రీధర్ బుధవారం ఈ ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం అంగళ్లు సబ్ స్టేషన్లో జూనియర్ లైన్‌మన్‌గా సి.శ్రీధర్ పనిచేస్తున్నారు. ఈయన గతంలో వైజాగ్‌లో ఉండగా పి.కనకమహాలక్ష్మితో పరిచయం ప్రేమకు దారితీసింది. 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2005లో కుమార్తె పుట్టింది. 2012 వరకు వీరి కాపురం సజావుగా సాగింది. ఆతర్వాత శ్రీధర్‌కు పక్షవాతం రావడంతో కుటుంబీకుల్లో మార్పు వచ్చింది. అత్త, మామ, భార్య ఒక్కటయ్యారు. లైన్‌మన్ శ్రీధర్ ఉద్యోగం, డబ్బు తమకు వచ్చేలా చెయ్యాలని భార్య త ల్లిదండ్రులతో కలసి పట్టుపట్టారు. శ్రీధర్‌ను వేధింపులకు గురిచేశారు. ఆయన అంగీకరించకపోవడంతో భార్య వైజాగ్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్లో కుమార్తె హిమకిరణ్‌ను కూడా వారు వెంట తీసుకె ళ్లారు. రెండేళ్ల తర్వాత శ్రీధర్ ఆరోగ్యం కుదుటపడింది. అనంతరం ఆయన వైజాగ్ వెళ్లి కుమార్తె హిమకిరణ్‌ను తీసుకువచ్చాడు. మదనపల్లెలోని ఓ ప్రయివేటు స్కూల్లో చేర్పించాడు. హాస్టల్లో ఉంటూ ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా ఈనెల 18న వైజాగ్‌లోని శ్రీధర్ భార్య ఇక్కడికి వచ్చి కుమార్తె వివరాలు తెలుసుకుంది. ఇంటికి వెళుతున్నానని చెప్పి కుమార్తెను మంగళవారం వైజాగ్‌కు వెంట తీసుకెళ్లిపోయింది. వైజాగ్‌లోని ఓ న్యాయవాది ద్వారా మాట్లాడిస్తూ ఒకటిన్నర లక్ష ఇస్తే తామే కుమార్తెను తీసుకొచ్చి అప్పగిస్తామని చెబుతోందని శ్రీధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సెల్ రికార్డింగ్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నాడు. కేసు విచారిస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. -
సీతపై శీతకన్ను
శీతాకాలం చలిమంచు కరుస్తుంది. ఆ మంచు కంటే కటువైనది పేదరికం. ఆ పేదరికం కంటే కర్కశమైనది పేద మహిళ జీవితం. బహుశా సీత చూసిన కష్టం ఏ పేద మహిళ కూడా చూసి ఉండకపోవచ్చు. గ్యాంగ్‌రేప్ చేశారు. రైలు పట్టాల మీద పారేశారు. రైలు కూడా ఆగలేదు... కనికరం చూపలేదు. నిలబడడానికి కాళ్లు లేవు. ఆసరాగా అమ్మ కూడా నిలబడలేదు. ప్రపంచమంతా శీతకన్ను వేసినా... ఈ సీత కన్ను అదరలేదు... ఈ సీత మనసు బెదరలేదు ఈమె గురి చెదరలేదు. కష్టాన్ని కాలదన్నింది... నిష్ఠూరాన్ని నిగ్గదీసింది. ఊతం ఇస్తోంది. ఉదాహరణగా నిలిచింది. పేదరికం.. గ్యాంగ్‌రేప్.. అవిటితనం.. సొంత తల్లి నుంచే నిరాదరణ... ఇవి సినిమా కష్టాలు కావు. ఓ సీతకు కాలం విసిరిన సవాళ్లు! స్వీకరించింది.. గెలిచింది.. కాలాన్ని కాళ్ల దగ్గర కట్టిపడేసింది! ఆ సీత కథ ఎలా మొదలైందంటే... రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ జిల్లా, ఫతేపుర గ్రామం సీత స్వస్థలం. తల్లి తప్ప నా అనేవారెవ్వరూ లేరు ఆమెకు. 20 ఏళ్ల పిల్ల. చదువు లేదు. కూలికెళ్తేనే కూడు. లేకుంటే పస్తే. ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఓ కన్స్ట్రక్షన్ వర్క్‌లో కూలీగా పనిచేసేది. ఒకరోజు.. ఎప్పటిలాగే కూలీకి వెళ్లింది. సరిగ్గా పనిచేస్తున్నా.. నోటి దురుసుతనం చూపాడు మేస్త్రీ. ఆమెకు పట్టలేనంత కోపం వచ్చింది. మౌనంగా ఉండలేకపోయింది. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదని హెచ్చరించింది. అంతమందిలో సీత తనకు ఎదురుతిరగడంతో మేస్త్రీ అహం దెబ్బతింది. సీతకు తగిన గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. రెండు రోజులు పనిచోట సీతపట్ల బాగానే ఉన్నాడు. మర్యాద నటించాడు. ఇంకోవైపు తన స్నేహితులు, ఫతేపురా సర్పంచ్‌తో కలిసి సీత కిడ్నాప్‌కి పథకం పన్నాడు. మూడోరోజు సీత పని నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం స్నేహితులు, సర్పంచ్‌తో కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు మేస్త్రీ. ఎవరికీ అనుమానం రాకుండా ఆ వ్యాన్ని చుట్టుపక్కల ఊళ్లన్నీ తిప్పుతూ వారంతా ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేశారు. స్పృహ తప్పిన సీతను మధ్యరాత్రి ఫతేపురా రైలు పట్టాల దగ్గర పడేసి వెళ్లిపోయారు. అప్పుడే అటుగా వచ్చిన ఓ రైలు చక్రాల కింద ఆమె కాళ్లు నలిగిపోయి ప్రాణం మిగిలిపోయింది. మూడోగాయం.. ఆ సంఘటన జరిగిన నాలుగు రోజులకి గానీ సీతకు మెలకువ రాలేదు. స్పృహ వచ్చాక... నడుం కింది భాగమంతా మొద్దు బారిపోయినట్టుగా ఉంది. కాళ్లు కదిపి రిలాక్స్ అవుదామని ప్రయత్నిస్తే మోకాళ్లు మాత్రమే కదిలాయి. మోకాళ్ల కిందిభాగంలో చర్మాన్ని లాగి కుట్టేసిన ఫీలింగ్. దిగ్గున లేచి చూసుకుందామనుకుంటే ఒళ్లంతా బరువుగా అనిపించింది. నిస్సహాయంగా పక్కనే ఉన్న తల్లివంక చూసింది. ‘రైలు కింద కాళ్లు చితికాయి. ఆపరేషన్ చేసి తీసేసారు’ అని చెప్పింది తల్లి. మనసుకు తగిలిన దెబ్బ, శరీరానికి అయిన గాయం.. రెండూ కలిసి ఒక్కసారిగా సీతను దుఃఖంలో ముంచెత్తాయి. కుమిలి కుమిలి ఏడ్చింది. దగ్గరకొచ్చి తల్లి ఊరడిస్తుందేమో అనుకుంది. రాలేదు సరికదా.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ రెండు గాయాల కన్నా ఈ చర్య ఆమెను ఎక్కువగా బాధించింది. కోలుకున్న సీత పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. మేస్త్రీతో పాటు ఆయనకు సహకరించిన వాళ్లందరినీ సర్పంచ్ సహా అరెస్ట్ చేశారు పోలీసులు. రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్నీ ఇప్పించారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. నిజానికి ఇక్కడే మొదలయ్యింది. ఎలా? రెండు లక్షల పరిహారంతో పాటు అవిటితనాన్ని మోసుకొచ్చిన సీత ఆ తల్లికి గుదిబండలా కనిపించడం మొదలుపెట్టింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న బిడ్డను పొట్టలో పెట్టుకోవాల్సిన తల్లి.. బిడ్డను అవమానించసాగింది. కూర్చోని తింటే రెండు లక్షలు ఎన్నాళ్లకు సరిపోతాయి? పనీపాటా చేయలేని నిన్ను ఈ రెండు లక్షలతో ఎంతకాలం సాకాలని ముద్ద పెట్టినప్పుడల్లా దెప్పిపొడిచేది. తల్లి పెట్టే తిండి కన్నా ఆమె తెప్పించే కన్నీళ్లతోనే కడుపు నిండిపోయేది సీతకు. అలా రోజులు గడుస్తుండగా.. ఓసారి సీత విషయంలో అరెస్టయిన దోషుల తాలూకు కుటుంబీకులు సీత వాళ్లమ్మను కలిశారు. అప్పటి నుంచి కూతురి విషయంలో ఆమె మరింత కఠినమైంది. న్యూ బిగినింగ్ ‘కంప్లయింట్ వెనక్కి తీసుకోమంటున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. వాళ్లు జైల్లో ఉంటే నీకేమొస్తుంది..? వాళ్లు చెప్పినట్టుగా కంప్లయింట్ వెనక్కి తీసుకుంటే ఇంకో రెండులక్షల రూపాయలొస్తాయి’ అంటూ నస మొదలుపెట్టింది సీత తల్లి. ‘నాకు డబ్బులు ముఖ్యం కాదు. నాకు జరిగిన అన్యాయం ఇంకే ఆడపిల్లకూ జరక్కూడదు. వాళ్లు జైల్లో మగ్గితేనే ఆడవాళ్ల పట్ల ఎలా ఉండాలో తెలుస్తుంది. గౌరవించడం నేర్చుకుంటారు’ అని సమాధానం చెప్పింది సీత. ఈ మాటకు ఆమె తల్లికి కోపమొచ్చింది. వాళ్లు జైల్లో ఉంటే జీవితాంతం నిన్ను పోషించడానికి నా దగ్గర లక్షల కుప్పల్లేవ్’ అంది విసురుగా. తల్లి ప్రవర్తనకు విస్తుపోయింది సీత. దోషుల బంధువుల దగ్గర్నుంచి ఒత్తిడి ఎక్కువైంది. కూతురేమో వినట్లేదు. పైగా తనను పోషించడం రోజురోజుకీ భారంగా మారింది ఆమెకు. కూతురుని ఇంట్లోంచి గెంటేసింది. పేదరికం కన్నపేగును కూడా తెంచేసుకుంటుందన్న సత్యం బోధపడిన సీత.. గత్యంతరం లేక.. ఏ ఆదరణా దొరక్కా పోలీసుల సహాయం కోరింది. వాళ్లు ఆమెను ‘ప్రవాస్’ అనే ఆశ్రమంలో చేర్చారు. అక్కడే ఓనమాలు దిద్దుకుంది. బ్రిడ్జ్కోర్స్లో టెన్త్ పూర్తి చేసింది. సొంత కాళ్లమీద నిలబడ్డానికి బట్టలు కుట్టడం నేర్చుకుంది(హ్యాండ్ మిషిన్‌తో). ఇంకోవైపు కంప్యూటర్స్‌లో బేసిక్ కోర్సూ పూర్తి చేసింది. ఓపెన్ డిగ్రీ తరగతులకూ హాజరవుతోంది. ఇదంతా తన జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం. ఇంకోవైపు తనలాంటి వాళ్లకు సహాయం అందించడానికీ అడుగులేస్తోంది. బట్టలు కుట్టి సంపాదించిన దాంట్లోంచి కొంత డబ్బును ప్రవాస్ ఆశ్రమానికిస్తోంది. విధి వీథిలో పడేసినా ధైర్యం ఉంటే చాలు ఆకాశాన్నే చూరు చేసుకొని ఎలా బతకొచ్చో చెప్తోంది. తననే ఓ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తోంది. దీంతో ఆగలేదు. ఇక్కడే ఓ కొత్త బిగినింగ్ అడుగులేయించింది ఆమెను జర్మన్ఫూట్తో. సీత కథను ఇంటర్నేషన్లో జర్నల్స్‌లో చదివిన ఓ జర్మన్ జర్నలిస్ట్ ఆమె ధైర్యానికి అబ్బురపడ్డాడు. ఇండియా వచ్చి ఆమెను కలుసుకున్నాడు. జర్మన్ఫీట్ను కానుకగా ఇచ్చాడు.. ఆమె మనోబలం గడపదాటి బయటకు రావాలని! సీత గడపదాటింది.. తాను నడవడమే కాదు నడవలేని వాళ్లకు నడకా నేర్పుతోంది! ‘మా అమ్మ మీద జాలి తప్ప కోపం లేదు. మేస్త్రీ మీద కనికరం లేదు. నా పరిస్థితి పట్ల భయమూ లేదు. అసలీ ప్రతికూలతలు లేకుంటే నా శక్తి నాకు తెలిసేదే కాదు. కాబట్టి ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడ్డమే కానీ భయపడి పారిపోవద్దు. నా జీవితం నాకు నేర్పిన పాఠం ఇదే’ అంటుంది సీత. -
సినీ ఫక్కీలో కిడ్నాప్!
పార్వతీపురం: ప్రశాంతతకు మారుపేరైన బొబ్బిలిలో సినీ ఫక్కీలో కిడ్నాప్, దాడి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం పార్వతీపురంలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పార్వతీపురం టౌన్ ఎస్ఐ వి.అశోక్ కుమార్, బాధితుడు కనకల గణేశ్వరరావు అందించిర వివరాలు... బొబ్బిలికి చెందిన సెవెన్ సోల్స్ అనే స్వచ్ఛంద సంస్థ పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ఏపీటీడబ్ల్యు రెసిడెన్షియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 23 నుంచి జూలై 15 వ రకు మెడికల్ క్యాంపు నిర్వహించింది. ఈ నెల 5న ఆ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కనకల గణేశ్వరరావుకు ఆ మెడికల్ క్యాంపు నిర్వాహకులు ఫోన్ చేసి ఏవో కబర్లు చెప్పి తమ వద్దకు రమ్మని కారు పంపించారు. దీంతో వారు పంపించిన కారులో ప్రిన్సిపాల్ గణేశ్వరరావు ఈ నెల 5న బొబ్బిలి వెళ్లారు. అయితే అక్కడ వాళ్లు ప్రిన్సిపాల్‌ను కిడ్నాప్ చేసి, ఫ్లై-ఓవర్‌కు దగ్గరలోని ఓ పాడుబడిన ఇంట్లో బంధించారు. మరుసటి రోజు ఆరువ తేదీన వెంకటేశ్వరరావు, ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనను చావ బాదారు. తమను సలోమీ అనే ఆమె పంపిందని, తాము కొట్టినట్టు ఎవరికైనా చెబితే కుటుంబాన్నీ చంపేస్తామని బెదిరించి ఆయన వద్ద ఉన్న ఏటీఎం కార్డు, *22వేల నగదు తీసుకున్నారు. అనంతరం మరో ఏపీ 31 టీవీ 4626 కారులో ఆగస్టు ఆరున సాయంత్రం భద్రగిరిలో విడిచిపెట్టారు. కారు ఇచ్చి ఇంటికి పంపిం చారు. దెబ్బలతో ఇంటికి వెళ్లిన ప్రిన్సిపాల్ రాజాం ఆస్పత్రిలో చికిత్స కోసం 7న జాయిన్ అయ్యారు. అక్కడ తనకు యాక్సిడెంట్ జరిగినట్లు చెప్పారు. పోలీసులు కూడా అలాగే కేసు నమోదు చేశారు. అయితే గాయాలు నయమయ్యాక కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పడంతో అసలు విషయం బయటికొచ్చింది. దీంతో ఈ నెల 16న బొబ్బిలి పోలీస్ స్టేష న్లో ఫిర్యాదు చేశారు. అయితే ముందు పార్వతీపు రం పోలీసులకు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును వాపసు తీసుకునేందుకు ప్రిన్సిపాల్ కనకల గణేశ్వరరావు కుటుంబ సభ్యులతో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి మళ్లీ జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఎసై వి.అశోక్ కుమార్ మాట్లాడుతూ ముందు ఇచ్చిన ఫిర్యాదు ఫాల్స్, కావడంతో మళ్లీ ఫిర్యాదు తీసుకున్నామన్నారు. ఈ విషయమై బొబ్బిలి ఎస్సై ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా, దాడి చేసినట్లు ఫిర్యాదుచేశారు.కేసురిజిష్టర్ చేశామని చెప్పారు. -
ఎంత కష్టం... ఎంతకష్టం...
లిబియాలో టెక్కలి వాసి కిడ్నాప్ ఇద్దరిని వదిలినా... ఈయనకు దక్కని విముక్తి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఫోన్లో వివరాలు తెలుసుకున్న ఎంపీ, కలెక్టర్ బతుకు తెరువుకు... పొట్టపోషణకు... పరాయి దేశానికి వెళ్లిన ఆ యువకునికి ఎంతకష్టం ఎంతకష్టం... కన్నకొడుకు కసాయిచేతిలో చిక్కుకున్నాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల్లో ఎంత కలవరం. టెక్కలికి చెందిన గోపీకృష్ణ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇప్పుడు ముష్కరుల చేతుల్లో బందీ అయ్యారు. ఆయన్ను విడిపించాలని వారి కుటుంబ సభ్యులు సర్కారును వేడుకుంటున్నారు. టెక్కలి : లిబియా దేశంలో టెక్కలికి చెందిన యువకుడ్ని ముష్కరులు కిడ్నాప్ చేశారని తెలుసుకున్న పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండు రోజుల క్రితం లిబియా దేశంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తుల్లో టెక్కలి గొల్లవీధికిచెందిన తిరువీధుల గోపీకృష్ణ అనే వ్యక్తి ఉన్నట్టు శుక్రవారం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆయన తల్లిదండ్రులు, స్నేహితులతోపాటు, పట్టణవాసులు సైతం కలవరపడ్డారు. ప్రభుత్వం తక్షణమే చొరవ చూపించి గోపీకృష్ణతో పాటు మిగిలిన వారిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని బాధిత తల్లిదండ్రులతో పాటు స్థానికులు కోరుతున్నారు. ఏడేళ్లుగా లిబియాలో ఉద్యోగం గొల్లవీధికి చెందిన విశ్రాంత కో-ఆపరేటివ్ ఉద్యోగి తిరువీధుల వల్లభనారాయణరావు, సరస్వతిల రెండో కుమారుడు గోపీకృష్ణ సుమారు 7 సంవత్సరాలుగా లిబియాలోని స్రిట్ యూనివర్శిటీలో కంప్యూటర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన భార్య కల్యాణితో పాటు ఇద్దరు పిల్లలు జాహ్నవి, సాయిశ్వర్ , సోదరుడు మురళీకృష్ణ ఆయన కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ నాచారం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు, అమ్మమ్మ టెక్కలిలో ఉంటున్నారు. ప్రతీ ఏడాది జూలై చివరి వారంలో లిబియాలో సెలవులు ప్రకటిస్తారు. ఆ సమయంలో గోపీకృష్ణ హైదరాబాదు వస్తూంటారు. ఈ ఏడాదికూడా వచ్చాక తల్లిదండ్రులను కలిసేందుకు టెక్కలివస్తానంటూ సమాచారం అందించారు. రంజాన్ పురస్కరించుకుని లిబియాలో సెలవులు ప్రకటించడంతో బుధవారం లిబియా నుంచి హైదరాబాద్ రావడానికి ఎయిర్‌పోర్ట్‌కు కారులో వెళ్తుండగా ఉగ్రవాదులు కారును అడ్డగించి డ్రైవర్‌ను పక్కకు నెట్టేసి గోపీకృష్ణతో పాటు కర్ణాటకకు చెందిన ఇద్దరిని, హైదరాబాదుకు చెందిన ఒకరిని కిడ్నాప్ చేసినట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. కిడ్నాప్ సమాచారం తమ పెద్దకుమారుడు మురళీకృష్ణకు తెలియడంతో ఆయన తమకు ఫోన్ చేసి విషయం చెప్పాడని పేర్కొన్నారు. దేశం కాని దేశంలో తమ కుమారుడు కిడ్నాప్‌కు గురైన సంగతి తెలియగానే ఆయన తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనతో ఆందోళన చెందారు. సాయంత్రానికి కిడ్నాప్ అయినవారిలో ఇద్దరిని విడిచిపెట్టినా.. తమ కుమారుడిని విడుదల చేయకపోవడంతో వారు మరింత ఖిన్నులవుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ ఎమ్.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ ఆర్.అప్పలరాజు టెక్కలిలోని వల్లభనారాయణరావు నివాసానికి వెళ్లి వారిని ఓదార్చి గోపీకృష్ణకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. కిడ్నాప్ విషయంలో కేంద్రప్రభుత్వం స్పందించినట్లు తమకు సమాచారం అందిందని ఎటువంటి ఆందోళన చెందవద్దని వారు తెలియజేసారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గోపికృష్ణ విడుదలకు చర్యలు చేపట్టాలని ఆయన స్నేహితులు విన్నవిస్తున్నారు. ఫోన్లో వివరాలు తెలుసుకున్న ఎంపీ, కలెక్టర్ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు బాధిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న గోపీకృష్ణ విడుదలయ్యేలా చర్యలు చేపడతానంటూ ఆయన వారికి హామీ ఇచ్చారు. అలాగే జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం బాధిత తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడారు. ఎస్పీ ఏఎస్.ఖాన్ కూడా ఫోన్లో వివరాలు తెలుసుకున్నారు. రోజూ భయాందోళనే: లిబియా దేశంలో గఢాఫీ సంఘటనతో రోజూ భయాందోళనతో జీవించాల్సి వచ్చేదని లిబియాలో కొంతకాలంపాటు నివసించి తిరిగి టెక్కలి వచ్చేసిన లండ మోహనరావు తెలిపారు. లిబియాలోని పుంజులేటి కంపెనీలో పైప్ లైనింగ్ పనుల కోసం 2011 సంవత్సరంలో ఆ దేశానికి వెళ్లాననీ, అక్కడ గోపీకృష్ణ పరిచయం అయ్యారని తెలిపారు. గోపికృష్ణ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలపెట్టని మంచి వ్యక్తని చెప్పారు. లిబియాలో దాడులు జరుగుతున్న నేపధ్యంలో 2012 సంవత్సరంలో అక్కడి తాను నుంచి వచ్చేశానన్నారు. గోపీకృష్ణను కూడా వచ్చేయమని పలుమార్లు సూచించాననీ తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఉగ్రవాదుల చెరలో ఉన్న వ్యక్తుల్ని విడుదల చేయించాలని కోరారు. -
నవ వధువు కిడ్నాప్
అమ్మాయి తల్లిదండ్రులేనంటున్న భర్త ప్రేమపెళ్లి ఇష్టం లేకపోవడమే కారణమని ఫిర్యాదు ఏసీపీ జోక్యంతో కేసు నమోదు హయత్‌నగర్: పెళ్లయిన వారం రోజులకే.. ఓ నవ వధువు కిడ్నాప్‌నకు గురైంది. ప్రేమ పెళ్లి ఇష్టం లేని వధువు తల్లిదండ్రులే తన భార్యను అపహరించారని భర్త ఆరోపిస్తున్నాడు. శుక్రవారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినిపల్లికి చెందిన మేడిడి బాలకోటయ్య కుమారుడు శివకృష్ణ (24), ఇదే ప్రాంతంలోని వెల్లపాలేనికి చెందిన నూతలపాటి వెంకటేశ్వరరావు కూతురు గౌతమీకీర్తి (25) వరుసకు బావా మరదళ్లు. వీరిరువురూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లికి పెద్దలు అంగీకరించరనే కారణంతో ఈ నెల 18న జీడిమెట్లలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి హయత్‌నగర్ డివిజన్లోని విజయపురి కాలనీలో కాపురం పెట్టారు. శివకృష్ణ పెద్దఅంబర్‌పేట సమీపంలోని ఓ ఆలయంలో పని చేస్తుండగా.. గౌతమి బేగంపేటలో కన్సల్టెన్సీ కార్యాలయంలో జాబ్ చేస్తోంది. ఎప్పటిలాగే విధులకు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో గౌతమి హయత్‌నగర్ బస్టాప్ వద్దకు చేరుకుంది. అనంతరం కొద్ది సేపటికే ఆమె ఫోన్ నుంచి శివకృష్ణకు కాల్ వచ్చింది. ఫోన్లో అరుపులు, కేకలు వినిపించాయి. కొద్దిసేపటికి గౌతమి ఫోన్ ఆఫ్ అయింది. దీంతో కంగారు పడ్డ అతను హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు పరుగు తీశాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగినట్లు చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లాలని సూచించారు. చివరకు ఏసీపీ జోక్యంతో హయత్‌నగర్ కిడ్నాప్‌గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అందరూ ఎర్రచందనం స్మగ్లర్లే
- పోలీసుల విచారణలో వెలుగుజూసిన వైనం నాయుడుపేటటౌన్: ఆదివారం రాత్రి జాతీయ రహదారిపై కలకలం సృష్టించిన కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌నకు గురైన వ్యక్తితో పాటు చేసిన వారు కూడా ఎర్రచందనం స్మగ్లర్లేనని పోలీసులు తేల్చారు. పోలీసుల విచారణలో ఎర్రచందన స్మగ్లర్ల మధ్య నెలకొన్న వివాదమే కిడ్నాప్‌నకు కారణంగా వెల్లడైంది. చిత్తూరు జిల్లా పుత్తూరు గ్రామానికి చెందిన అరవ బాలసుబ్రమణ్యం గతంలో ఎర్రచందనం స్మగర్లతో కలిసి అక్రమ రవాణా చేసేవాడని పోలీసులు తెలుసుకున్నారు. బాలసుబ్రమణ్యం పెలైట్గాను, ఎర్రచందనం వాహనాల డ్రైవర్‌గాను వెళుతుండేవాడు. ఈ క్రమంలో తమిళనాడు ప్రాంతానికి చెందిన కొందరు ఎర్రచందనం స్మగర్లతో అక్రమ రవాణా చేస్తూ ఒక వాహనంతో పాటు ఎర్రచందననాన్ని స్మగ్లర్లకు తెలియకుండా గతంలో విక్రయించాడని తెలిపారు. ఈ విషయమై స్మగ్లర్లు కక్ష కట్టి చాకచక్యంగా ఆదివారం చిత్తూరు జిల్లా పరిధిలోని పుత్తూరులో బాలసుబ్రమణ్యంను కిడ్నాప్ చేసి ఎర్రచందనంకు సంబంధించి మోసం చేసిన నగదును రాబట్టేందుకు ప్రయత్నించారు. చివరకు బాలసుబ్రమణ్యం తండ్రి శర కరయ్యకు ఫోన్‌చేసి రూ.5లక్షలు ఇస్తే వదిలి పెడతామంటూ బెదిరించారు. డబ్బులు తెచ్చివ్వకపోవడంతో బాలసుబ్రమణ్యంను హత్య చేసేందుకు పన్నాగం పన్ని కత్తులు సైతం తీసుకుని నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపైకి ఆదివారం రాత్రి చేరుకున్నారు. విన్నమాల వద్ద కారును నిలిపి మద్యం తెచ్చుకునేందుకు ఒకరు వెళ్లాగా కారులో నుంచి బాలసుబ్రమణ్యం తప్పించుకుని వెళుతుండగా మిగిలిని ఇద్దరు స్మగ్లర్లు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడి నుంచి బయటపడిన బాలసుబ్రమణ్యం పోలీసులకు ఇవేమీ చెప్పకుండా తనను గుర్తుతెలియని తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి బారి నుంచి తప్పించుకొని వచ్చానని పోలీసులను తప్పుదోవ పట్టించాడు. విన్నమాల గ్రామస్తులు జాతీయ రహదారిపై అనుమానంగా తిరుగుతున్న ముగ్గురుని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు పరారు కాగా ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు దొరికిన వ్యక్తి బాలసుబ్రమణ్యంను కిడ్నాప్ చేసిన స్మగ్లర్లలో ఒకరైన కార్తీక్‌గా గుర్తించారు. మరో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు మణి, తిరుమలైతో పాటు కారు డ్రైవర్ పరారయ్యారని చెప్పారు. ఎర్రచందనం కేసులో సుబ్రమణ్యంను అరెస్టు చేసి ఉన్న తమిళనాడు పోలీసులు తమిళనాడు పరిధిలోని పల్లిపట్టు ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అక్కడి పోలీ సులు గతంలో సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసి ఉన్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. ఎర్రచందనం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అక్రమ వ్యాపారానికి దూరంగా ఉన్నట్లు బాలసుబ్రమణ్యం కుటుంబసభ్యులు సోమవారం నాయుడుపేట పోలీసులకు తెలిపారు. తమిళనాడుకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు వారి వివరాలు ఎక్కడ తెలుపుతాడోనని అతడిని హతమార్చేం దుకు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని అనుమానం వ్యక్తం చేశారు. గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రత్తయ్య, ఎస్సై ఆంజనేయరెడ్డి ఎర్రదొంగల పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. పుత్తూరు ఎస్సైతో పాటు అక్కడి పోలీసులు నాయుడుపేటకు చేరుకుని ఇక్కడి పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్ కార్తీక్‌తో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే కత్తిపోట్లకు గురై ఉన్న అరవ బాలసుబ్రమణ్యంను విచారించారు. ఈ కేసును పుత్తూరుకు బదిలీ చేయించుకుని విచారించేందుకు అక్కడి పోలీసులు సిద్ధమవుతున్నారు.