ప్రజా సంక్షేమం విస్మరించిన ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా
దాచేపల్లి : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజా సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విమర్శించారు. దాచేపల్లిలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యూరని ఆరోపించారు. వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడంపై తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 2న ఆందోళన కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు.
జంగా వెంట పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, సర్పంచ్ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు మందపాటి రమేష్‌రెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజా సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విమర్శించారు. దాచేపల్లిలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యూరని ఆరోపించారు. వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు.
ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడంపై తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 2న ఆందోళన కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు. జంగా వెంట పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, సర్పంచ్ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు మందపాటి రమేష్‌రెడ్డి ఉన్నారు.