కుట్టులోగుట్టు! | The intention of the government were you | Sakshi
Sakshi News home page

కుట్టులోగుట్టు!

Published Wed, Dec 10 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

కుట్టులోగుట్టు!

కుట్టులోగుట్టు!

యూనిఫాం కుట్టేందుకు అధికార పార్టీకి
అనుకూలమైన ఏజెన్సీలకు అప్పగింత
{పతిఫలంగా అధికార పార్టీ నేతలకు 10 శాతం కమీషన్
37 మండలాల్లో మాత్రమే యూనిఫాం పంపిణీ
16 మండలాల విద్యార్థులకు అందని వైనం
{పతి ఏటా ఇదే పరిస్థితి.. ముందస్తు చర్యలు కరువు
{పభుత్వ నిర్లక్ష్యం..అధికారుల అలసత్వం
విద్యార్థులకు తప్పని ఇబ్బందులుయూనిఫాం.. మారిన అర్థాలు..

 
ప్రభుత్వ ఉద్దేశం.. అందరూ సమానమే..

ధనిక, పేద అనే తేడా లేకుండా తరగతి గదిలో అందరూ సమానమేననే భావన విద్యార్థులలో కలిగించడానికి ప్రభుత్వం యూనిఫాం (ఒకే రకమైన దుస్తులు)ను ప్రవేశపెట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫాం అందజేయాలి.
 
అధికారుల కొత్త నిర్వచనం.. అందరికీ ఒకే కొలతలు..

ఎత్తు, లావు, పొట్టి అనే తేడా లేకుండా తరగతి గదిలో అందరూ సమానమేనని చెప్పడానికి ప్రస్తుతం ఒకే సైజు యూనిఫాం (ఒకే విధమైన కొలతలతో) పంపిణీ చేస్తున్నారు. దీంతో కొందరికి వదులుగా,  మరికొందరికి టైటుగా ఉంటున్నాయి. ఆరు నెలలు గడిచినా యూనిఫాం అందజేయలేదు.
 
కర్నూలు విద్య :

అధికార పార్టీకి చెందిన నేతలు కమీషన్‌కు కక్కుర్తిపడి పేద విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అందించే యూనిఫాంను కుట్టేందుకు తమకు అనుకూలమైన ఏజెన్సీలకు మాత్రమే ఇప్పించుకున్నారు. కుట్టే బాధ్యతలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా అధికార పార్టీ నాయకులకు 10 నుంచి 15 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో సర్వశిక్ష అభియాన్‌లో పని చేస్తున్న ఓ అధికారి బినామీ పేరు మీద 10 ఏజెన్సీలను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. కుట్టు కూలిలో కమీషన్‌తో క్లాత్‌ను సరఫరా చేసే ఆప్కో అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు 10 శాతం కమీషన్ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

37 మండలాల్లో యూనిఫాం పంపిణీ

జిల్లాలో మొత్తం 2798 ప్రభుత్వం పాఠశాలలు ఉండగా ఇందులో 3,45,442 విద్యార్థులు   ఉన్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి రెండేసి జతలు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాం బట్టకు రూ.160 , కుట్టు కూలి జతకు రూ.40  ప్రకారం రెండు జతలకు రూ.400 మంజూరు చేస్తుంది. 2014-15 విద్యా సంవత్సరానికి గాను యూనిఫాంలకు రూ.13.81 కోట్లు కేటాయించింది. జిల్లాలో సుమారు 3 వేల స్కూల్ యాజమాన్య కమిటీలు ఉన్నాయి. యూనిఫాంలకు అయ్యే ఖర్చులను సర్వశిక్ష అభియాన్ అధికారులు ఆయా పాఠశాల యాజమాన్య కమిటీల ఖాతాల్లో జమ చేశారు. అయినా పూర్తి స్థాయిలో యూనిఫాం పంపిణీ చేయలేదు. జిల్లాలో కేవలం ఇప్పటి వరకు 37 మండలాలకు చెందిన విద్యారులకు మాత్రమే యూనిఫాం అందజేశారు. మిగతా 16 మండలాలకు దుస్తులు అందజేయలేదు.
 
పాత కొలతలు.. కొత్త అవస్థలు..!


విద్యార్థుల యూనిఫాం కోసం క్లాత్‌ను పంపిణీ చేస్తున్న అప్కో అధికారులు నాసిరకమైన బట్టను అందజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ళుగా ఏ ఏడాది కూడా నిర్ణిత గడువులోపు విద్యార్థులకు దుస్తులను అందించిన దాఖలాలు లేవని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యా సంవత్సర ప్రారంభంలోనే విద్యార్థుల దుస్తుల కొలతలు తీసుకోవాల్సి ఉంది. కుట్టు కూలి తక్కువగా ఉందని..ప్రభుత్వం ఇచ్చే ధర గిట్టదని స్థానికులు ముందుకు రారని ఏజెన్సీలకు కట్టబెడుతున్నారు. దుస్తులు కుట్టు కూలి పెంచకపోవడంతో ఏజెన్సీలు ఎలాంటి కొలతలు తీసుకోకుండానే తరగతి వారీగా సుమారుగా ఇష్టానుసారంగా కుట్టుతుండడంతో విద్యార్థులకు సరిపోవడం లేదు. ఇటీవల గోనెగండ్ల మండల కేంద్రంలో ఉన్న ఓ స్కూల్‌కి పంపిణి చేయగా సగానికిపైగా సరైన కొలతలు లేకుండా కుట్టడంతో తిరిగి కుట్టించుకున్నట్లు ఆ స్కూల్ టీచర్లు చెబుతున్నారు. కొంత మంది విద్యార్థులకు దుస్తులు సరిపోకపోవడంతో ఇళ్ల దగ్గరే విడిచి పెట్టి రంగుల దుస్తుల్లోనే స్కూళ్లకు వస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఏజెన్సీలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
 
యూనిఫాం కుట్టుతో సంబంధం లేదు

2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు జత యూనిఫాంకు నిధులు వచ్చాయి. ఈ మొత్తం ఆయా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాలకు జమ చేశాం. 45 మండలాలకు చెందిన యూనిఫాం కుట్టు పూర్తి అయింది. మిగతా మండలాలకు చెందిన యూనిఫాం త్వరలోనే కుట్టు పూర్తి చేసి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కుట్టుతో మాకేలాంటి సంబంధం లేదు. కుట్టించేందుకు స్కూల్ యాజమాన్య కమిటీలకే పూర్తి బాధ్యతలు అప్పగించారు. వారు స్థానికంగా కుట్టించినా..ఏజెన్సీలతో కుట్టించినా అది వారిష్టం.                 -

మురళీధర్ రావు,
 సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి
 

Advertisement
Advertisement