దేవరకద్ర, న్యూస్‌లైన్: రబీ సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చివరి ఆయకట్టు రైతులకు కోయిల్‌సాగర్ నీరు ఈ ఏడాది ఆశ నిరాశను కలిగిస్తోంది. ఏటా వర్షాలు బాగా కురిసి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిం డినప్పుడు రబీ సీజన్‌లో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 12 వేల ఎకరాల కు సాగు నీరు అందిస్తారు. లోతట్టు భూ ముల్లో వరిపంటలు, మెట్టపొలాల్లో ఆరుతడి పంటలు పండించే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తారు. కో యిల్‌సాగర్ ప్రాజెక్టులోకి 31 అడుగు నీ రు చేరిన తరువాత నీటిమట్టం అక్కడితో నే నిలిచిపోయింది. ఆ సమయంలోనే వ ర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇక నీటిమ ట్టం పెరిగే అవకాశం లేదు. పూర్తిస్థాయి ప్రాజెక్టు నీటిమట్టం 32.6 అడుగులు కా గా, మరో అడుగున్నర మేర నీరు చేరితే ప్రాజెక్టు నిండేది. వర్షాకాలం పూర్తి కావడంతో ఇక ప్రాజెక్టు నిండటం సాధ్యం కాకపోవచ్చు. గతేడాది అక్టోబర్ చివరి నాటికి సరిగ్గా 32.6 అడుగుల మేర నీటిమట్టం వచ్చిచేరింది. ఆ తరువాతే కొంతనీటిని కాల్వలకు వదిలారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినా భారీవర్షాలు ఈ ప్రాంతంలో కురియలేదు.
అందువల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండలేదు. ప్ర స్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఈనెల చి వరి నాటికి రబీ పంటలకు వదిలే అవకా శం ఉంది. అయితే పెద్ద, చిన్నకాల్వలు, తూములు, డిస్ట్రిబ్యూటరీలు పగిలిపోవ డం వల్ల చివరి ఆయకట్టు భూములకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు.
చివరి రైతులకు అన్యాయం
ఎప్పుడు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండని పరిస్థితిలో చివరి ఆయకట్టు రైతులకు ఎ క్కువ అన్యాయం జరుగుతుంది. దేవరక ద్ర మండలంలోని ఎడమ కాల్వ కింద దే వరకద్ర, బల్సుపల్లి, గూరకొండ, గోప్లాపూర్, నార్లోనికుంట తదితర గ్రామాలకు అరకొరగా సాగునీరందే అవకాశం ఉం ది. కుడికాల్వ కింద ధన్వాడ మండలంలో పూర్తిస్థాయిలో ఆయకట్టు భూములకు నీ రు అందుతుండగా చిన్నచింతకుంట మండలంలోని చివరి ఆయకట్టు భూములకు సాగునీరందని పరిస్థితి ఉత్పన్నమవుతోంది. గతంలో జరిగిన ఒప్పందం మేరకు ముందుగా చివరి ఆయకుట్టు రై తులకు నీరు వదిలిన తరువాత మిగతా భూములకు వదలాలి. కానీ ఈ నిబంధనలను ఎక్కడా పాటించడం లేదు.
పాజెక్టు ఐబీ అధికారులు సరి అయిన ప ర్యవేక్షణ చేయక పోవడం వల్ల చివరి ఆ యకుట్టు రైతులు అన్యాయానికి గురువతూనే వస్తున్నాడు. ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు చాలాచోట్ల తూములకు సెట్ట ర్లు లేకపోవడం వల్ల నీరంతా వృథాగా పోతుంది. అలాగే పిల్ల కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉండటం వల్ల పొలాలకు నీ రు పారడం లేదు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ప్రాజెక్టు అధికారులు స్పందించి కాల్వలకు తగిన మరమ్మతులు చేయడంతో పాటు తూ ములకు రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది.
త్వరలో ఐడీబీ సమావేశం
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు రైతులతో త్వర లో ఐడీబీ సమావేశం జిల్లా కేంద్రంలో ని ర్వహించడానకి అధికారులు ఏర్పాట్లు చే స్తున్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఇరిగేషన్‌శాఖ అధికారు లు, ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు ఆయకట్టు సం ఘాల ప్రతినిధులు హాజరై నీటి విడుదల పై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కా ల్వల పరిస్థితి, తూముల పరిస్థితిని చర్చిస్తారు. రైతులకు సంబంధించిన సమస్యలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.
చి‘వరి’కి నీరందేనా?
Published Sun, Nov 10 2013 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement
Advertisement