rubi season
-
నిబంధనలతో రైతులకు అగచాట్లు
ముద్దనూరు: రబీ సీజనులో బుడ్డశనగ పంట సాగుచేస్తున్న రైతులు బీమాప్రీమియం చెల్లింపు ప్రక్రియలో ప్రభుత్వం విధించిన నిబంధనలతో అగ చాట్లపాలవుతున్నారు. సోమవారం నాటికి ప్రీమియం డీడీల చెల్లింపు గడువు పూర్తయింది. అయితే ప్రీమియం డీడీలు ఏఐసీ ఆఫ్ ఇండియా ప్రతినిధులకు స్వయంగా అందజేయాల్సి ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. గతంలో మాదిరి కాకుండా నిబంధనలు మారడం, అధికారులకు ముందుచూపు కొరవడటంతోనే తాము ప్రయాసకు గురికావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మంగళవారం స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయం వద్దకు డీడీలు అందజేయడానికి పెద్ద ఎత్తున రైతులు గుమిగూడారు. ఒకదశలో తొక్కిసలాట జరిగే సమయంలో ఎస్ఐ యుగంధర్ సిబ్బందితో వచ్చి అదుపు చేశారు. బుధవారం కూడా డీడీలు స్వీకరిస్తామని ఏఐసీ ప్రతినిధులు తెలిపారు. -
ఎక్కడి ధాన్యం అక్కడే..
ఆరుగాలం కష్టపడే అన్నదాతకు పంట అమ్మకంలోనూ తప్పని అవస్థలు... సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. గన్నీ సంచుల సరఫరాలో నిర్లక్ష్యం.. ధాన్యం రవాణాలో జాప్యం.. హమాలీల కొరత.. వెరసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ రబీ సీజన్లో జిల్లాలో 2.30 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. 13 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన అధికారులు 619 కొనుగోలు కేంద్రాల ద్వారా 5 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నెల 4న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు 341 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, 13 మార్కెట్ కమిటీల ద్వారా 1.54 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. వరికోతలు ముగింపు దశకు చేరడంతో ధాన్యం కుప్పలుతెప్పలుగా వచ్చి చేరుతోంది. కేంద్రాలకు రోజువారీగా వస్తున్న ధాన్యంలో కనీసం 40 శాతం కొనుగోళ్లు కూడా జరగడం లేదని రైతులు అంటున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రవాణా చేసుకోవాల్సిన మిల్లర్లు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు. రోజుకు నాలుగైదు లారీల ధాన్యం కేంద్రాలకు వస్తుంటే.. ఒకట్రెండు వాహనాలు మాత్రమే మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ధాన్యం కేంద్రాల్లోనే మూలుగుతోంది. కొనుగోళ్లు ఆలస్యమవుతుండడంతో అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. శనివారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో, కోరుట్ల మండలం పెద్దాపూర్ రైతులు, ముస్తాబాద్ రైతులు, కాటారం మండలం రేగులగూడెంలో ఆందోళనకు దిగారు. హుస్నాబాద్‌లో సిబ్బందిని నిర్బంధించారు. వసతులేవీ.. పైసలేవీ? ఎన్నికల నేపథ్యంలో ఇంతకాలం అధికారులు రైతుల గోడు పట్టించుకున్న దాఖలాలు లేవు. కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతులకు నోచుకోకపోవడంతో నిల్వలు పేరుకుపోయూరుు. కొనుగోలు చేసిన ధాన్యంలో 40 శాతం కేంద్రాల్లోనే పేరుకుపోగా.. ఎప్పటికప్పుడు రవాణా కాకపోవడంతో కొత్తగా కొనుగోళ్లు జరగడం లేదు. 50 లక్షల వరకు గన్నీ సంచులు అవసరమున్నా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచలేదు. ఇప్పటివరకు 270 ఐకేపీ కేంద్రాల ద్వారా 89,683 టన్నులు, 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 64,231 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా చెల్లించలేదు. రూ.207 కోట్లు చెల్లింపు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈసారి రైతులకు ఆన్లైన్లో బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలు, వివరాలను డాటా ఎంట్రీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో విక్రయించిన ధాన్యం చెల్లింపులు మరింత ఆలస్యం కానుండడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దళారులతో దగా.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,345 కాగా.. రైతులు ఎక్కువగా ఆయా కేంద్రాలకే ధాన్యాన్ని తరలిస్తున్నారు. తూకం, రవాణాలో జాప్యం కావడంతో రోజుల తరబడి పడిగాపులు కాయలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని కల్లాల వద్ద దళారులు క్వింటాల్‌కు రూ.1,260కే కొనుగోలు చేసి అన్నదాతల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు. అధికారులు, దళారులు కుమ్మక్కై మార్కెట్లో ధాన్యం త్వరగా కొనుగోలు చేయకుండా వివిధ కారణాలతో తమ సహనాన్ని పరీక్షిస్తూ ధాన్యాన్ని దళారుల పాలు చేసేలా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం 4, 5 కాంటాలు ఏర్పాటు చేసి ఏరోజుకారోజు ధాన్యాన్ని తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని, హమాలీ డబ్బులు సైతం త్వరగా ఇప్పించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వాహనాలు సమకూరుస్తాం - బి. చంద్రప్రకాశ్, డీఎస్వో కొన్ని చోట్ల ధాన్యం రవాణాలో ఇబ్బందులు తలెత్తిన విషయం మా దృష్టికి వచ్చింది. రవాణా బాధ్యతను మిల్లర్లకు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లకు అప్పగించాం. తిరిగి సమస్య తలెత్తడంతో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు సూచించాం. సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో అన్ని సెంటర్లు పరిశీలించి రెవెన్యూ, పోలీస్, సివిల్సప్లై శాఖలు సంయుక్తంగా వాహనాల సమకూర్పునకు చర్యలు తీసుకుంటాం. చెల్లింపులో ఆన్లైన్లోనే.. - సంపత్, సివిల్సప్లై డీఎం ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదు. రూ.207 కోట్లు చెల్లించాల్సి ఉంది. జేసీ ఆదేశాల మేరకు ఈసారి రైతులకు ఆన్లైన్లో చెల్లిస్తాం. ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు రైతుల వివరాలను డాటా ఎంట్రీ చేసే పనిలో ఉన్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లిస్తాం. -
మిల్లర్లకు పంట
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో మిల్లర్ల పంట పండుతోంది. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం పేరుకుపోయి కాంటాలు, ఎగుమతులు కాక రోజులు గడుస్తున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న మిల్లర్లు మాత్రం మిల్లుల వద్ద తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఐకేపీ కేంద్రాలతోపాటు మార్కెట్‌కు వచ్చే ధాన్యానికి వివిధ రకాల కొర్రీలు పెడుతున్న మిల్లర్లు నేరుగా మిల్లుల వద్దకు వచ్చే 1010 రకం ధాన్యానికి క్వింటాకు రూ.1200కే కొనుగోలు చేస్తున్నారు. మిర్యాలగూడ సమీపంలోని ఏ మిల్లు వద్ద చూసినా ధాన్యం ట్రాక్టర్లు భారీగా బారులు తీరి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 10లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. కానీ జిల్లాలో ఇప్పటివరకు ఐకేపీ కేంద్రాలలో సుమారుగా 90వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఐకేపీ కేంద్రాలలో మహిళా సంఘాల వారు కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకోవడానికి మిల్లర్లు నానా ఇబ్బందులు పెడుతున్నారు. మిల్లుల వద్ద దోపిడీ మిల్లుల వద్దకు నేరుగా ధాన్యం తీసుకొచ్చే రైతులకు క్వింటాకు రూ.1100 నుంచి రూ.1200 లోపు మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్ లోడు ధాన్యానికి హమాలీ ఖర్చుతో పాటు రవాణా చార్జీలు ఉన్నప్పటికీ రైతుకు వెయ్యి రూపాయల అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్ని రైస్‌మిల్లుల్లో ధాన్యం ధర నిర్ణయించిన తర్వాత కూడా దిగుమతి కాగానే తక్కువ ధర ఇస్తామని, లేకుంటే తిరిగి తీసుకెళ్లమని కొర్రీలు పెడుతున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకుంటే రోజుల తరబడి గడపాల్సి వస్తున్నందున నష్టపోతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. అవంతీపురం మార్కెట్లో పేరుకుపోయిన ధాన్యం మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం పేరుకుపోయింది. సోమవారం 77వేల బస్తాల ధాన్యం మార్కెట్‌కు రావడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. అయినా కేవలం కాంటాలు మాత్రమే వేసి ఎగుమతులు మాత్రం నిలిపివేశారు. మిల్లర్ల హమాలీలు కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నందున ఎగుమతులు నిలిచిపోయాయి. ఒక్కరోజు మార్కెట్లో టెండర్లు నిర్వహిస్తే కాంటాలు, ఎగుమతి అయ్యే వరకు మూడు రోజులకు పైగా సమయం పడుతుంది. దీంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే గడపాల్సి వస్తుంది. -
రైతుకు రిక్తహస్తం
రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో రిక్తహస్తం చూపుతున్నాయి. రబీ సీజన్ ముమ్మరంగా ఉన్నా రుణాలివ్వకుండా రకరకాల సాకులతో రైతన్నలను ఇబ్బంది పెడుతున్నాయి. వేదికలు దొరికితే చాలు పాలకులు తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో అవి అసత్య మాటలని తేలిపోతున్నాయి. కౌలు రైతు కోసం ప్రభుత్వం గతేడాది ప్రారంభించిన ‘సాగు రైతు రక్షణ హస్త పథకం’ కూడా రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. దీంతో రైతన్న ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అదును దాటుతుండటంతో రైతులకు ప్రైవేటు వ్యాపారులు తప్ప మరో దిక్కు కనిపించడం లేదు. ఉదయగిరి, న్యూస్‌లైన్ : జిల్లాలో సుమా రు 4.7 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరే కాకుండా మరో 90 వేల వరకు కౌలు రైతులు ఉన్నారు. రైతుల్ని ఆదుకునేందుకు పంట రుణాలపై వడ్డీ లేని రుణం అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తున్నదే తప్ప రైతులకు సక్రమంగా రుణాలు అందించడంలో విఫలమవుతోంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పుకుంటున్నా అది రైతులకు పెద్దగా ఉపయోగపడటం లేదు. కిరణ్ ప్రభుత్వం గతేడాది సాగు రైతు రక్షణహస్తం పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలను (ఎల్డీసీ కార్డులు) పంపిణీ చేసింది. కానీ ఆ పత్రాలు తీసుకుని బ్యాంకులకెళితే రుణం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, తగ్గుతున్న దిగుబడులతో రైతులకు పంటపై వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే వడ్డీ మాఫీ ఉన్నందున రైతులు బ్యాంకుల రుణాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ బ్యాంకులు మాత్రం రైతులందరికీ రుణాలివ్వడం లేదు. తమ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి, పెద్ద పెద్ద రైతులకు, వ్యాపారస్తులకు, రాజకీయ పలుకుబడి కలిగిన వారికి మాత్రమే పంట రుణాలిస్తూ పేద రైతులు, సామాన్యులను విస్మరిస్తోంది. జిల్లాలో మొత్తం సాగు రైతుల్లో 70 శాతం మంది పేదరైతులే. వీరికి రుణాలివ్వడంలో బ్యాంకులు వివక్ష చూపుతుండటంతో పంటల సాగుకు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తూ వారికి అధిక మొత్తంలో వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో రూ.2,400 కోట్లు రుణాలుగా ఇవ్వాలని అధికారులు లక్ష్యం పెట్టుకోగా, ఇంత వరకు కేవలం రూ.355 కోట్లు మాత్రమే అందజేశారు. ఖరీఫ్ సీజన్లో రూ.680 కోట్లు పంపిణీ లక్ష్యంగా పెట్టుకొని కొంత మేరకు రుణాలు పంపిణీ చేశారు. ఇంకా ఎంతోమంది రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాస్తూనే ఉన్నారు. జిల్లాలో 90 వేల మంది కౌలు రైతులు ఉండగా, ఇంతవరకు 41 వేల మందికి ఎన్డీసీ కార్డులు పంపిణీ చేశారు. అందులో కేవలం 3,500 మందికి మాత్రమే రూ.7.36 కోట్లు పంపిణీ చేశారు. గతేడాది 29 వేల మందికి ఎల్డీసీ కార్డులు మంజూరు చేయగా, వారిలో 2,500 మందికి రూ.92 కోట్ల 68 లక్షలు ఇచ్చారు. రీషెడ్యూల్ పేరుతో దగా ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలతో పంట నష్టపోయిన రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేసి కొత్తగా పంట వేసేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని పాలకులు చెబుతున్నా.. ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కొత్తగా రుణాలు మంజూరు చేసి పాత బకాయిలకు జమ చేసుకుంటున్నారు. దీంతో రైతులకు పెట్టుబడికి పైసా కూడా చేతికందటం లేదు. రీషెడ్యూల్ చేస్తే వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉన్నందున రైతులకు కొంత ఉపశమనం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిస్థితి కూడా రైతులకు శాపంగా మారింది. లక్ష్యాలను పూర్తిచేస్తాం: రైతులకు వీలైనంత వరకు రుణా లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నాం. గతేడాది లక్ష్యానికి మించే రుణాలిచ్చాం. ఈ ఏడాది కూడా రుణాల పంపిణీ కార్యక్ర మం వేగంగా జరుగుతోంది. కౌలు రైతులకు కూడా రుణాలిస్తున్నాం. - వెంకటేశ్వరరావు, ఎల్డీఎం -

చి‘వరి’కి నీరందేనా?
దేవరకద్ర, న్యూస్‌లైన్: రబీ సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చివరి ఆయకట్టు రైతులకు కోయిల్‌సాగర్ నీరు ఈ ఏడాది ఆశ నిరాశను కలిగిస్తోంది. ఏటా వర్షాలు బాగా కురిసి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిం డినప్పుడు రబీ సీజన్లో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 12 వేల ఎకరాల కు సాగు నీరు అందిస్తారు. లోతట్టు భూ ముల్లో వరిపంటలు, మెట్టపొలాల్లో ఆరుతడి పంటలు పండించే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తారు. కో యిల్‌సాగర్ ప్రాజెక్టులోకి 31 అడుగు నీ రు చేరిన తరువాత నీటిమట్టం అక్కడితో నే నిలిచిపోయింది. ఆ సమయంలోనే వ ర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇక నీటిమ ట్టం పెరిగే అవకాశం లేదు. పూర్తిస్థాయి ప్రాజెక్టు నీటిమట్టం 32.6 అడుగులు కా గా, మరో అడుగున్నర మేర నీరు చేరితే ప్రాజెక్టు నిండేది. వర్షాకాలం పూర్తి కావడంతో ఇక ప్రాజెక్టు నిండటం సాధ్యం కాకపోవచ్చు. గతేడాది అక్టోబర్ చివరి నాటికి సరిగ్గా 32.6 అడుగుల మేర నీటిమట్టం వచ్చిచేరింది. ఆ తరువాతే కొంతనీటిని కాల్వలకు వదిలారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినా భారీవర్షాలు ఈ ప్రాంతంలో కురియలేదు. అందువల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండలేదు. ప్ర స్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఈనెల చి వరి నాటికి రబీ పంటలకు వదిలే అవకా శం ఉంది. అయితే పెద్ద, చిన్నకాల్వలు, తూములు, డిస్ట్రిబ్యూటరీలు పగిలిపోవ డం వల్ల చివరి ఆయకట్టు భూములకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. చివరి రైతులకు అన్యాయం ఎప్పుడు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండని పరిస్థితిలో చివరి ఆయకట్టు రైతులకు ఎ క్కువ అన్యాయం జరుగుతుంది. దేవరక ద్ర మండలంలోని ఎడమ కాల్వ కింద దే వరకద్ర, బల్సుపల్లి, గూరకొండ, గోప్లాపూర్, నార్లోనికుంట తదితర గ్రామాలకు అరకొరగా సాగునీరందే అవకాశం ఉం ది. కుడికాల్వ కింద ధన్వాడ మండలంలో పూర్తిస్థాయిలో ఆయకట్టు భూములకు నీ రు అందుతుండగా చిన్నచింతకుంట మండలంలోని చివరి ఆయకట్టు భూములకు సాగునీరందని పరిస్థితి ఉత్పన్నమవుతోంది. గతంలో జరిగిన ఒప్పందం మేరకు ముందుగా చివరి ఆయకుట్టు రై తులకు నీరు వదిలిన తరువాత మిగతా భూములకు వదలాలి. కానీ ఈ నిబంధనలను ఎక్కడా పాటించడం లేదు. పాజెక్టు ఐబీ అధికారులు సరి అయిన ప ర్యవేక్షణ చేయక పోవడం వల్ల చివరి ఆ యకుట్టు రైతులు అన్యాయానికి గురువతూనే వస్తున్నాడు. ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు చాలాచోట్ల తూములకు సెట్ట ర్లు లేకపోవడం వల్ల నీరంతా వృథాగా పోతుంది. అలాగే పిల్ల కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉండటం వల్ల పొలాలకు నీ రు పారడం లేదు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ప్రాజెక్టు అధికారులు స్పందించి కాల్వలకు తగిన మరమ్మతులు చేయడంతో పాటు తూ ములకు రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో ఐడీబీ సమావేశం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు రైతులతో త్వర లో ఐడీబీ సమావేశం జిల్లా కేంద్రంలో ని ర్వహించడానకి అధికారులు ఏర్పాట్లు చే స్తున్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఇరిగేషన్‌శాఖ అధికారు లు, ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు ఆయకట్టు సం ఘాల ప్రతినిధులు హాజరై నీటి విడుదల పై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కా ల్వల పరిస్థితి, తూముల పరిస్థితిని చర్చిస్తారు. రైతులకు సంబంధించిన సమస్యలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. -
రబీకి సిద్ధంగా ఉండాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాబోయే రబీ సీజన్‌కు సిద్ధం కావాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో సులభంగా అధిగమించామని చెప్పారు. ఈ సీజన్లో 62 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 71వేల మెట్రిక్ టన్నులు పంపించామన్నారు. వీటితో పాటు డీఏపీ 20 వేల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 25 వేల టన్నులు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్‌కు సరిపడా విత్తనాల పంపిణీ చేయడంతో ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 7.20 లక్షల హెక్టార్లలో సాగవుతోందన్నారు. ఈ సీజన్‌ను ఆదర్శంగా తీసుకుని రాబోయే రబీకి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే జిల్లాకు 77 వేల మెట్రిక్ టన్నుల వేరుశనగ విత్తనాల కోటాను మంజూరు చేశామని, అలాగే మరో 20 వేల టన్నుల పప్పుశనగలను పంపిస్తామన్నారు. ఇంకా కోటా కావాల్సి వస్తే నివేదికలు పంపిస్తే తక్షణమే మంజూరు చేస్తామన్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడు లక్షల హెక్టార్లకు ప్రణాళికలు జిల్లావ్యాప్తంగా రబీలో మూడు లక్షల హెక్టార్లలో పంటలు సా గు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జేడీఏ రామరాజు కమిషనర్‌కు వివరించారు. ఇందుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఆ ప్రకారమే కోటా మంజూరయిందన్నారు. కార్యక్రమంలో ఆత్మ పీడీ రవికుమార్, డీడీలు జయచంద్ర, రఘురాములుతో పాటు, ఏడీఏలు పాల్గొన్నారు.