ముద్దనూరు: రబీ సీజనులో బుడ్డశనగ పంట సాగుచేస్తున్న రైతులు బీమాప్రీమియం చెల్లింపు ప్రక్రియలో ప్రభుత్వం విధించిన నిబంధనలతో అగ చాట్లపాలవుతున్నారు. సోమవారం నాటికి ప్రీమియం డీడీల చెల్లింపు గడువు పూర్తయింది. అయితే ప్రీమియం డీడీలు ఏఐసీ ఆఫ్ ఇండియా ప్రతినిధులకు స్వయంగా అందజేయాల్సి ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు.
గతంలో మాదిరి కాకుండా నిబంధనలు మారడం, అధికారులకు ముందుచూపు కొరవడటంతోనే తాము ప్రయాసకు గురికావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మంగళవారం స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయం వద్దకు డీడీలు అందజేయడానికి పెద్ద ఎత్తున రైతులు గుమిగూడారు. ఒకదశలో తొక్కిసలాట జరిగే సమయంలో ఎస్‌ఐ యుగంధర్ సిబ్బందితో వచ్చి అదుపు చేశారు. బుధవారం కూడా డీడీలు స్వీకరిస్తామని ఏఐసీ ప్రతినిధులు తెలిపారు.
నిబంధనలతో రైతులకు అగచాట్లు
Published Wed, Dec 17 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement
Advertisement