కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘ప్రజల సొమ్ముతో బ్యాంకులను ఏర్పాటు చేశారు. కానీ వారికే సేవ చేయడం మరిచిపోగా.. కనీసం బ్యాంకు మెట్లు కూ డా ఎక్కనీయరు. వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయల నిధులను మంజూరుచేసి గ్రౌండింగ్ విషయంలో పట్టించుకోరు.
మీకు బలుపెక్కడంతోనే వా రిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ’ నాగర్‌కర్నూ ల్ ఎంపీ మందా జగన్నాథం బ్యాంకర్లపై తీ వ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో బ్యాంకర్ల తీరుపై ఎంపీతోపాటు, ఎమ్మెల్యేలూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మందా జగన్నాథం మా ట్లాడుతూ.. జిల్లాలో ఏ బ్యాంకులో కూడా పేదలకు ప్రభుత్వం మంజూరుచేసిన పథకాలను అందించడం లేదన్నారు. పేదలంటే బ్యాంకర్లకు అలుసెక్కువ అన్నారు. ఈ విషయమై తాను గతంలో ఓ బ్యాంక్ అధికారి తో మాట్లాడితే.. ‘నువ్వు ఎంపీవైతే నాకేమి, పైగా నీవు చెప్పితే నేను వీరికి రుణాలు ఇవ్వాలాల్ని ఇవ్వాలా.. అని అవమానపరి చాడు. ఈ బ్యాంకర్లకు పేదలంటే, ప్రజాప్రతినిధులులంటే లెక్కనేలేదు. ‘మీ బ్యాంకు లు ప్రజల సొమ్ముతో కాకుండా, మీ సొం తంగా నడిపిస్తున్నారా’ అంటూ ఆయన తీ వ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక కార్పొరేషన్ల ద్వారా పేద నిరుద్యోగులను ఆదుకునేం దుకు మంజూరుచేసిన యూనిట్లను గ్రౌం డింగ్ చేయకుండా, ష్యూరిటీల పేరుతో నా నా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వీరి నిర్లక్ష్యంపై ప్రతి సమావేశంలో ఆర్‌బీఐకి ఫిర్యాదుచేస్తే పరిశీలిస్తామని చెబుతున్నారని ఆర్‌బీఐ ప్రతినిధి పుల్లారెడ్డిపై ఎంపీ మందా అసహనం వ్యక్తంచేశారు.
విద్యారుణాలను ఎవరికిచ్చారు..?
విద్యా రుణాలిచ్చేందుకు రూ.నాలుగు లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ లేదని ఆర్‌బీఐ ఆదేశాలను జారీచేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఎంపీ మందా జగన్నాథం ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో చాలామంది పే ద విద్యార్థులు రుణంకోసం బ్యాంకుల చు ట్టూ తిరుగుతున్నారని చెప్పారు.
ఈ కారణంగా ఏటా కనీసం పదిమంది విద్యార్థులు కూడా రుణాలను పొందలేకపోతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తంచేశారు. ష్యూరిటీ లే కుండా రూ.నాలుగు లక్షల విద్యారుణాన్ని పేద విద్యార్థులకు ఇవ్వాలని, లేదంటే తాను పార్లమెంట్‌లో ఫిర్యాదు చేయాల్సి వస్తుంద ని హెచ్చరించారు. ఆర్‌బీఐ ప్రతినిధి పుల్లారె డ్డి కల్పించుకుని నాలుగు లక్షల వరకు ఎ లాంటి ష్యూరిటీ లేకుండా విద్యార్థులకు ఇ వ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. తదనంతరం గత సమావేశంలో తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం కూడా అమలుకాకపోవడంతో సభ్యులంతా బ్యాంకర్ల తీరుపై అసహనం వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
అచ్చంపేట్ ఎమ్మెల్యే రాములు మాట్లాడుతూ.. రైతులకు పంటరుణాల్లేవు, బల్మూర్ మండలం మంగలపల్లికి చెందిన పేద విద్యార్థి ఎంబీఏ చదివేందుకు రుణం కోసం వెళ్లితే ఇవ్వకుండా హేళనచేశారు. ఎస్సీ, ఎస్టీల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బ్యాంకర్లపై మండిపడ్డారు.
వనపర్తి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో చేతి, కుల వృత్తులవారు చాలా తక్కువమంది ఉన్నా.. వారికి మంజూరైన అతితక్కువ యూనిట్ల లో కనీసం పదిశాతమైన బ్యాంకర్లు గ్రౌం డింగ్ చేయలేదన్నారు. వారి అంత అలుసెందుకుని ప్రశ్నించారు.
దేవరకద్ర ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కడుకుంట్ల, చిన్నచింత కుం ట ప్రాంతాల్లో బ్యాంకులను ఏర్పాటుచేస్తామని చెప్పినా..ఇంతవరకు అతీగతి లేదన్నా రు. ఇలా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.
మక్తల్ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నర్వ ప్రాంతంలో కొత్త బ్యాంకును ఏర్పాటు చేసేటప్పుడు ఎమ్మెల్యేగా తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు బ్యాంకర్లు రుణాలివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుందని మండిపడ్డారు.
కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ.. ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా కఠి నచర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రభు త్వ పథకాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే బ్యాంకుల ను సహించేది లేదని హెచ్చరించారు. అనంత రం అంబట్‌పల్లి శ్రీరంగాపూర్, మక్తల్ ప్రాం తాల్లో కొత్త బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించారు. కార్యక్రమంలో ఏజేసీ డాక్టర్ రాజారాం, నాబార్డ్ ఏజీఎం సురేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌తో పాటు, అన్ని బ్యాంకుల ఏజీఎంలు పాల్గొన్నారు.
పేదలంటే అలుసా..
Published Wed, Sep 25 2013 3:45 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement