అక్కడ చచ్చినా చావే..!
శ్మశాన రహదారి లేక దళితుల ఇక్కట్లు
ఉత్తరపాలెం(మోపిదేవి) : ఉత్తరపాలెం దళితవాడలో మృతిచెందిన మాతంగి సూరమ్మ (82) మృతదేహాన్ని దహనం చేసేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతురాలిని శ్మశాన వాటికకు తరలించేందుకు చెరువు గట్టును దాటాల్సి రావడంతో సర్కస్ ఫీట్లు చేయూల్సి వచ్చింది.
శ్మశాన వాటిక రహదారిలో మూడు చోట్ల గండ్లు పడిపోవడంతో 20 సంవత్సరాలుగా ఆ బాటలో వెళ్లలేకపోతున్నామని గ్రామపెద్దలు మాతంగి రత్నబాబు, బడుగు కుటంబరావు, పల్లె వెంకటేశ్వరావు ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో గ్రామసభ, గ్రీవెన్‌సెల్, రచ్చబండ, జన్మభూమి-మాఊరు గ్రామసభల్లో వినతి పత్రాలు అందజేశామని, అరుునా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.