suramma
-
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
గార మండలం తులుగు గ్రామంలో వడదెబ్బకు బంతుపల్లి సూరమ్మ(69) అనే వృద్ధురాలు మృతిచెందింది. ఎండవేడికి తాళలేక మంగళవారం సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ప్రాణాలు విడిచింది. -
అక్కడ చచ్చినా చావే..!
శ్మశాన రహదారి లేక దళితుల ఇక్కట్లు ఉత్తరపాలెం(మోపిదేవి) : ఉత్తరపాలెం దళితవాడలో మృతిచెందిన మాతంగి సూరమ్మ (82) మృతదేహాన్ని దహనం చేసేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతురాలిని శ్మశాన వాటికకు తరలించేందుకు చెరువు గట్టును దాటాల్సి రావడంతో సర్కస్ ఫీట్లు చేయూల్సి వచ్చింది. శ్మశాన వాటిక రహదారిలో మూడు చోట్ల గండ్లు పడిపోవడంతో 20 సంవత్సరాలుగా ఆ బాటలో వెళ్లలేకపోతున్నామని గ్రామపెద్దలు మాతంగి రత్నబాబు, బడుగు కుటంబరావు, పల్లె వెంకటేశ్వరావు ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో గ్రామసభ, గ్రీవెన్సెల్, రచ్చబండ, జన్మభూమి-మాఊరు గ్రామసభల్లో వినతి పత్రాలు అందజేశామని, అరుునా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మారుతీ వ్యాన్..ఇద్దరు పాస్టర్ల దుర్మరణం
కోదాడటౌన్, న్యూస్‌లైన్: ప్రార్థనల కోసం వెళ్లిన పాస్టర్లు గమ్యం చేరకుండానే అనంతలోకాలకు చేరుకున్నారు. కోదాడ పరిధిలోని దుర్గాపురం క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాల య్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు చెందిన నలుగురు పాస్టర్లు గుంటూరులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. సోమవారం రాత్రి మారుతీ వ్యాన్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. వైజాగ్ నుంచి వస్తున్న లారీని డ్రైవర్ దుర్గాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆపి కాలకృత్యాల కోసం దిగాడు. ఇది గమనించని మారుతీ వ్యాన్‌డ్రైవర్ ఈ లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో వ్యాన్ నుజ్జునుజ్జు కాగా మహబూబ్‌నగర్‌లోని పాలమూర్ కాలనీకి చెందిన సూరమ్మ (65), జయాకర్ (46) అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందిన ఆశీర్వాదం, లలితకుమారిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిం చారు. మృతదేహాలకు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆశీర్వాదం సోదరుడు బాబురావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు పట్టణ సీఐ మధుసూదన్ తెలిపారు.