
పెళ్లి రోజే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
రాయదుర్గంటౌన్ : వివాహం జరగాల్సిన రోజే ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన రాయదుర్గం పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం...పట్టణంలోని కేబీ ప్యాలెస్ థియేటర్ ప్రాంతంలో నివాసముంటున్న జాఫర్‌సాబ్ కుమారుడు మహబూబ్ బాషా(35). కూలి పనులు చేసుకుని జీవనం సాగించే బాషాకు ఆదివారం బళ్లారిలో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అతను శనివారం సాయంత్రం అదృశ్యమయ్యారు. ఆదివారం ఉదయం బీటీపీ రోడ్డు చింతతోపు సమీపంలోని రైల్వేట్రాక్‌పై శవమై తేలారు. తలసగభాగం కోసుకుపోయింది. కాళ్లకు బలమైన గాయాలు ఉన్నాయి.
ఇది ఆత్మహత్య, హత్య, ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడి మృతి చెందరా అనే కోణంలో స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి గతంలో రెండు సార్లు వివాహం జరిగింది. ఆ ఇద్దరు భార్యలు అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం.