ఎల్‌ఎల్‌సీకి గండి
సాక్షి, బళ్లారి (కర్ణాటక): తుంగభద్ర ఎల్‌ఎల్‌సీకి మంగళవారం ఉదయం మోకా సమీపంలో 119వ కి.మీ వద్ద చిన్న పాటి గండి పడి నీరు వృథాగా పోతోంది. ఎల్‌ఎల్‌సీ ఈఈ నారాయణ నాయక్ తదితరులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గండిని పూడ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఎల్‌ఎల్‌సీ ద్వారా కర్నూలు జిల్లా రైతులకు ప్రతి రోజూ దాదాపు 700 క్యూసెక్కుల నీరు అందజేయాల్సి ఉంది. ఈ సమయంలో గండి పడడంతో ఆ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కాలువకు నీటి ప్రవాహం తగ్గించి, మరమ్మతు పనులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.