ఇసుక తరలింపునకు ఈ వే బిల్లు
సిల్వర్ హోలో గ్రామ్‌తో జారీ
బుక్ చేసుకున్నప్పుడే వాహనం నిర్ధారణ
దారిమళ్లించే చాన్స్ తక్కువంటున్న అధికారులు
ఇసుక తరలింపులో ‘ఈ వే బిల్లు’ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే గుంటూరులో అమలవుతున్న ఈ విధానాన్ని వచ్చే వారం నుంచి జిల్లాలోనూ అమలు చేస్తున్నారు. దీని వల్ల ఇసుక రవాణాలో జరుగుతున్న అవకతవకలకు బ్రేకు పడనుంది.
విశాఖపట్నం: జిల్లాలో గుర్తించిన 16 రీచ్‌లలో ప్రస్తుతం 12 రీచ్‌ల్లో తవ్వకాలు..అమ్మకాలు జరుగుతున్నాయి. మొత్తం 16 రీచ్‌లలో 3,23,565 క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉన్నట్టుగా గుర్తించినప్పటికీ రివైజ్డ్ సర్వేలో ఐదులక్షల క్యూబిక్‌మీటర్ల వరకు ఇసుక ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 50 క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్మకం ద్వారా రూ. 2.49 కోట్లు, రవాణా కింద 22.77లక్షల ఆదాయం వచ్చింది. రవాణా అవుతున్న ఇసుకలో ఇండెంట్ ప్రకారం 60 శాతం ప్రభుత్వ, ప్రైవేటు అవసరాల కోసం కేటాయిస్తుండగా, 40 శాతం సామాన్యులకు విక్రయిస్తున్నారు. కాగా సామాన్యుల పేరిట బుక్ చేసుకోవడం.. మధ్యలో ఇసుకను మాఫియా దొరలు దారి మళ్లించి బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకోవడం జరుగుతున్నది. ఇప్పటి వరకు కొనుగోలుచేసే ఇసుకను పరిమాణాన్ని బట్టి క్యూబిక్‌మీటర్‌కు రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. రవాణా కోసం కిలోమీటర్‌కు నిర్దేశించిన మొత్తాన్ని ఆ తర్వాత చెల్లిస్తున్నారు. దీని వల్ల అనేక అవకతవకలు జరుగుతున్నట్టుగా గుర్తించారు. దీని నిరోధానికి సాధ్యమైనంత త్వరగా జీపీఎస్‌తో పాటు సీసీ కెమెరాలను అమర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగా తొలుత ఈ వే బిల్లు విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మీ సేవలో బుక్ చేసుకున్నప్పుడే ఇసుకతో పాటు రవాణాకు కూడా చెల్లిస్తే కొనుగోలు దారుడికి ఆర్డర్ స్లిప్ ఇస్తారు. అదే విధంగా ఆన్‌లైన్‌లో సంబంధిత రీచ్‌కు డిమాండ్ ఆర్డర్ వెళ్తుంది. ఇందుకోసం 80మప్లాన్‌షీట్‌పై ప్రత్యేకంగా తయారు చేసిన హోలో గ్రామ్‌ను ముద్రించిన మూడు రసీదులుంటాయి. వీటిలో ఒకటి మీసేవా కేంద్రంలో ఉండగా, ఒకటి రీచ్‌కు పంపిస్తారు. మరొకటి లారీడ్రైవర్‌కు ఇస్తారు. డెలవరీ చేయగానే కొనుగోలుదారుడి వద్ద నున్న డిమాండ్ స్లిప్‌ను తీసుకుని హోలోగ్రామ్‌తో ఉన్న స్లిప్‌ను అందజేస్తారు. దీని వల్ల లారీ డ్రైవర్ మధ్యలో దారి మళ్లించే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఎవరైతే బుక్ చేసు కున్నారో వారికే నేరుగా డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఈ నెల నుంచి విశాఖలో కూడా అమలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత లా వాడుతున్నా అక్రమార్కులు రెచ్చి పోతూనే ఉన్నారు.