సాక్షి రూ.లక్ష విజేత గాజువాక వాసి
విశాఖపట్నం: సాక్షి-ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పండుగ సంబరాలు 15 రోజు డ్రాలో లక్ష రూపాయల బహుమతి గాజువాక ఎస్‌ఆర్ షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన గాజువాకకు చెందిన సత్యనారాయణను వరించింది. డైమండ్ పార్క్ గెలాక్సీ షోరూమ్‌లో బుధవారం సాయంత్రం ఎల్‌జీ ఏరియా మేనేజర్ ఎ.మహేష్, గెలాక్సీ ఎండీ కనుమూరి హరనాథరాజు డ్రా తీసి విజేతను ఎంపిక చేశారు. గెలాక్సీ షోరూమ్ కస్టమర్లతో కన్సోలేషన్ బహుమతులకు డ్రా తీసి విజేతల పేర్లను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎల్‌జీ ఏరియా మేనేజర్ మాట్లాడుతూ నాలుగేళ్లగా సాక్షి నిర్వహిస్తున్న పండగ సంబరాలకు విశేష స్పందన వస్తుందన్నారు. ఫలితంగా గెలాక్సీ విక్రయాలు బాగా పెరిగాయని చెప్పారు. గెలాక్సీ కొనుగోలు దారులకు కూడా పలు బహుమతులు రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సాక్షి యాడ్స్ ఏజీఎంలు బి.రంగనాథ్, వినోద్(హైదరాబాద్), అసిస్టెంట్ మేనేజర్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కస్టమర్లు ఉత్సాహం చూపారు.
సాక్షి పండగ సంబరాల్లో కస్టమర్లు ఉత్సాహం చూపారు. సాక్షి పండగ సంబరాల్లో కోస్పాన్సర్‌గా గెలాక్సీకి అవకాశం కల్పించడం సంతోషకరం. మా కస్టమర్లు అనేక బహుమతులు గెలుచుకున్నారు. 20 ఏళ్లుగా కస్టమర్లకు నమ్మకమైన సేవలందిస్తున్నాం.
-కనుమూరి హరనాథరాజు, గెలాక్సీ ఎండీ