వైఎస్సార్ జిల్లా కాశీనాయన మండలం కెఎన్ కొట్టాల గ్రామంలో విద్యుదాఘాతంతో ఆదివారం ఒక యువరైతు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన బత్తల చలపతి(30) ఆదివారం ఉదయం పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లాడు. మోటార్ అన్ చేసేందుకు స్విచ్ ముట్టుకోగా.. కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన తోటి రైతులు కాపాడేందుకు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోయింది. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉంది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
Published Sun, Dec 6 2015 2:00 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement