థియేటర్‌కెళ్తే సినిమా చూపించారు! | Theatre oweners Attack on young man | Sakshi
Sakshi News home page

థియేటర్‌కెళ్తే సినిమా చూపించారు!

Published Sat, May 28 2016 3:27 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

థియేటర్‌కెళ్తే సినిమా చూపించారు! - Sakshi

థియేటర్‌కెళ్తే సినిమా చూపించారు!

ధర్మవరం : వినోదం కోసం థియేటర్‌కు వెళ్తే తమదైన శైలిలో ‘సినిమా’ చూపించారు ఆ థియేటర్ సిబ్బంది. ఈ సంఘటన ధర్మవరంలో శుక్రవారం జరిగింది. స్థానిక జోగోనికుంటకు చెందిన చేనేత కార్మికులు బిల్లే శ్రీనివాసులు, రాము, చాకలి శీనప్ప ఇక్కడి రంగా సినీ సెంట్రల్ థియేటర్‌కు మధ్యాహ్నం సినిమాకు వెళ్లారు. మూడు టిక్కెట్లు కొనుగోలు చేయగా, రెండు సీట్లు ఒక చోట, మరో సీటు ఇంకో చోట వచ్చింది. మూడు సీట్లు ఒకే చోట ఇవ్వాలని థియేటర్ వారిని అడిగారు. అందుకు వారు నిరాకరించగా, తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరారు. డబ్బులు ఇచ్చేందుకు థియేటర్ సిబ్బంది ససేమిరా అనడంతో వారు మొండికేశారు.

దీంతో థియేటర్ సిబ్బంది పది మంది ఏకంగా కర్రలతో వారిపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పైన పేర్కొన్న ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి.  అంతటితో ఆగక వీధి రౌడీల్లా వారిని వీధుల్లో వెంటాడారు. ఘటనలో శ్రీనివాసులు తలకు కుట్లు పడగా, రాము చొక్కా చిరిగింది. అతని కాలికి సైతం గాయాలయ్యాయి. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సినీ సెంట్రల్ థియేటర్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాయుడునాయక్ డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement