అనంతపురం: అమ్మవారి ఆలయంలో ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు శఠగోపం, కిరీటం, హుండీ ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కదిరిలోని మరకతమహాలక్ష్మి ఆలయంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇది గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్‌టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.