=లక్కీ డ్రా తీసిన ఉడా వీసీ
= బంపర్ డ్రాలో రూ.లక్ష గెలుచుకున్న ప్రవీణ
విజయవాడ, న్యూస్‌లైన్ : తెలుగునాట సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. పండుగ సంబరాలు అంబరాన్నంటుతాయి. అయితే ఈ పండుగకు 20 రోజులు ముందుగానే ‘సాక్షి’- కళానికేతన్ ప్రజలకు సంక్రాంతి ఆనందాన్ని అందిస్తున్నాయి. ‘సాక్షి’- కళానికేతన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల కార్యక్రమం 22వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు కొనసాగుతుంది. 15 రోజులపాటు కొనసాగే ఈ పండుగలో ప్రతి రోజూ ఒకరిని ‘సాక్షి’ లక్షాధికారిని చేస్తుంది.
అందులో భాగంగా ఎంజీ రోడ్‌లోని కళానికేతన్ షోరూమ్‌లో సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీజీటీఎమ్ ఉడా వైస్ చైర్మన్ ఎం.రామారావు హాజరై లక్కీ కూపన్‌లను డ్రా తీశారు. బంపర్ బహుమతి లక్ష రూపాయలను నెల్లూరు జిల్లా కావలికి చెందిన బేతు ప్రవీణ గెలుచుకున్నారు. కార్యక్రమంలో సాక్షి బ్రాంచి మేనేజర్ ఐ సూర్యనారాయణ, ఏజీఎం (యాడ్స్) వినోద్ మాదాసు, రీజనల్ మేనేజర్ (యాడ్స్) సీహెచ్ అరుణ్‌కుమార్, కళానికేతన్ హెచ్‌ఆర్ మేనేజర్ జీ రాము, స్టోర్ మేనేజర్ వీ దేవేంద్ర, కొనుగోలుదారులు పాల్గొన్నారు.
అభినందనీయం.....
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ‘సాక్షి’ దినపత్రిక, ప్రజలకు విస్తృత శ్రేణిలో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న కళానికేతన్ సంయుక్తంగా సంక్రాంతి సంబరాలను ఆ పండుగకు ముందే నిర్వహిస్తూ కొనుగోలుదారులకు బహుమతులు అందించటం అభినందనీయం. సంక్రాంతి పండుగ అనగానే నూతన వస్త్రాలు కొనడం ఆనవాయితీగా వస్తుంది. కళానికేతన్ షోరూమ్ వారు వస్త్ర ప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త వెరైటీస్ అందిస్తుండటం హర్షణీయం. - ఎం.రామారావు, వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్
అవకాశాన్ని వినియోగించుకోండి...
‘సాక్షి’ సంక్రాంతి సంబరాలలో మా కళానికేతన్ మెయిన్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఎంజీ రోడ్‌లోని మా షోరూమ్‌లో రూ.2000 , ఆైపైబడి కొనుగోలు చేసిన ఖాతాదారులకు ఒక లక్కీ కూపన్ అందజేస్తున్నాం. ప్రతిరోజూ సాయంత్రం ఈ లక్కీ డ్రా నిర్వహించి బంపర్ ప్రైజ్ రూ.లక్షతోపాటు ప్రథమ, ద్వితీయ, తృతీయ, మూడు కన్సొలేషన్ బహుమతులు అందజేస్తాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతున్నాం.
- చలసాని విజయకుమార్, కళానికేతన్ శిల్క్స్ డెరైక్టర్
సంక్రాంతి సంబరాలను ముందే తెచ్చిన ‘సాక్షి’- కళానికేతన్
Published Tue, Dec 24 2013 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement