దంపతులపై దాడి: 30 తులాల బంగారం చోరీ | Thieves attack on Couple at Raidurgam town | Sakshi
Sakshi News home page

దంపతులపై దాడి: 30 తులాల బంగారం చోరీ

Published Sun, Oct 27 2013 9:41 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Thieves attack on Couple at Raidurgam town

అనంతపురం జిల్లా రాయదుర్గంలో గత అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలోని వ్యాపారి ఇంట్లికి దొంగలు ప్రవేశించి కత్తులతో దాడి చేశారు. అనంతరం ఇంట్లోని 30 తులాల బంగారంతోపాటు అధిక మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు.

 

అయితే ఆ దొంగల దాడిలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దంపతులను రాయదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement