
ఎన్నికల జోరు
మరో స్థానిక సమరం షురూ!
జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎలక్షన్లు
నేడు నోటిఫికేషన్ వెలువడే అవకాశం
అయోమయంలో ఆయా పార్టీల నేతలు
ఏర్పాట్లలో అధికారులు తలమునకలు
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్:
ఎన్నికలన్నీ ఒకేసారి పోటెత్తుతున్నాయి. ఇదివరకే మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతండగా, మరో సా ్థనిక ఎన్నికల సమరానికి తెరలేవనుంది. కాగా రాజకీయ పార్టీల నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనున్నట్టు సమాచా రం. జిల్లాలో 46 జడ్పీటీసీ, 685 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అధికారుల సమాచారం మేరకు వచ్చేనెల 6న జడ్పీటృసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. 9వ తేదీన ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో అధికారులు ఏర్పాట్లకు సమాయత్తం అవుతున్నారు. ఇది వరకే జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ రిజర్వేషన్లను వెల్లడించిన అధికారులు ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. పంచాయతీరాజ్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జడ్పీ అధికారులు షెడ్యూల్‌కు అనుగుణంగా ఓటరు జాబితాలను పంచాయతీల్లో ప్రచురించటంతోపాటు పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
అధికారులు ఇది వరకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారం అందజేయారు. అయితే ఎంపీటీసీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం ఉంది.
పార్టీలకు పరీక్షే
ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే క్రమం లో ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మునుపెన్నడూ లేని విధంగా ఒకేమారు అన్ని ఎన్నికలు ఒకే సారి రావటంతో రాజకీయపార్టీలు ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలో తెలియక సతమతం అవుతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను వెతికే పనిలో ప్రధాన రాజకీయపార్టీలైన కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, టీడీపీలు నిమగ్నమయ్యాయి. మున్సిపల్ ఎన్నికలతో పట్టణాల్లో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేవనున్న నేపథ్యంలో పల్లెల్లో సైతం రాజకీయాలు రాజుకోనున్నాయి.