మొదటి రోజు నాలుగునామినేషన్లు
అవన్నీ జహీరాబాద్‌లోనే..
మిగతా చోట్ల బోణీ కాని వైనం
అభ్యర్థులకు టికెట్లు ఖరారు కాకపోవడమే కారణం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ మొదటి రోజైన సోమవారం జిల్లా వ్యాప్తంగా కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, మెదక్ మున్సిపాలిటీలతోపాటు అందోల్, గజ్వేల్ నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. నామినేషన్ల దాఖలుకు మొదటి రోజు కావడంతోపాటు ప్రధాన పార్టీల్లో అభ్యర్థులకు టికెట్లు ఖరారు కాకపోవడం కూడా కారణమని చెప్పవచ్చు. ఒక్క జహీరాబాద్ మున్సిపాలిటీలోనే నాలుగు నామినేషన్లు దాఖలు కాగా మిగతా చోట్ల బోణీ కాకపోవడం గమనార్హం. నామినేషన్ల దాఖలుకు 14వ తేదీ వరకు గడువు ఉంది.
మున్సిపోల్స్..
Published Tue, Mar 11 2014 2:15 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement