
సాక్షి, విశాఖ: దసరా పండుగ రోజు అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. హౌరా నుంచి విజయవాడకు వస్తుండగా నర్సీపట్నం రోడ్ స్టేషన్‌లో ట్రైన్ బోగీ పైకప్పు ఊడిపోయింది. దీంతో అప్రమత్తమైన రైలు సిబ్బంది ట్రైన్‌ను స్టేషన్‌లోనే నిలిపివేశారు. హైటెన్షన్ లైన్‌కు ఇంచు దూరంలో ఉండగా రైలు ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.