నేలకోట(చింతూరు) : ఓ మహిళకు ముగ్గురు మృత శిశువులు జన్మించిన సంఘటన నేలకోట గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన పైదా రంగమ్మకు సోమవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. గ్రామంలోనే ప్రసవమై, ముగ్గురు మృత శిశువులు జన్మించారు. ఇద్ద రు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ అని ఆమె భర్త భద్రయ్య తెలిపాడు. మృత శిశువులను గ్రా మంలోనే పూడ్చిపెట్టినట్టు చెప్పాడు. ఆరోగ్యపరిస్థితి సరిగా లేకపోవడంతో రంగమ్మను నేలకోట నుంచి మోతుగూడెం వరకు నడిపించి, అక్కడినుంచి 108లో చింతూరు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.
కాన్పు కాదు.. అబార్షన్ : డాక్టర్ అశోక్‌కుమార్
రంగమ్మ గర్భం దాల్చి 24 వారాలే కావడంతో సోమవారం ఆమెకు అబార్షన్ జరి గినట్టు చింతూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు అశోక్‌కుమార్ తెలిపారు. ఇటీవల రంగమ్మ ను పరీక్షించి, సూచనలు చేశానని చెప్పారు. 28 వారాలు దాటితే కాన్పు అయ్యే అవకాశం ఉందని, 24 వారాలే కావడంతో కచ్చితంగా అబార్షన్ జరిగి ఉంటుందని వివరించారు. గర్భంలో మరో బిడ్డ ఉందనే అనుమానంతో స్కానింగ్ కోసం భద్రాచలం పంపినట్టు తెలిపారు. పౌష్టికాహారం సక్రమంగా తినకపోవడంతో రంగమ్మకు అబార్షన్ జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు.
ఒకే కాన్పులో ముగ్గురు మృత శిశువులు
Published Tue, Nov 24 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM
Advertisement
Advertisement