మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లాలో చిరుతల సంచారం ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేవరకద్ర మండలం గద్దెగూడెంలో మూడు చిరుత పులులు సంచరిస్తున్నారు. గ్రామంలోని ఓ ఆవుపై చిరుత దాడి చేయటంతో ఆవు మృతి చెందింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.