రాష్ర్ట విభజన తట్టుకోలేక ముగ్గురి మృతి
Published Wed, Sep 11 2013 2:16 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
అయినవిల్లి, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజనను తట్టుకోలేక వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు గుండెపోటుతో మరణించారు. అయినవిల్లి మండలం మడిపల్లికి చెందిన జల్లి వెంకటరామారావు(42) కాకినాడలోని 108లో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. సమైక్రాంధ్ర ఉద్యమంలో చురుగ్గ్గా పాల్గొంటున్నాడు. కొన్ని రోజులుగా దిగాలుగా ఉంటున్నట్టు బంధువులు తెలిపారు. సోమవారం రాత్రి గుండెపోటుకు గురై మరణించినట్టు తెలిపారు. మృతుడికి భార్య నాగవేణి ఉంది.
ఇంటి అరుగుపై కుప్పకూలి..
డి.రావులపాలెం (అల్లవరం) : డి.రావులపాలెం గ్రామానికి చెందిన మర్రి రాంబాబు(24) రాష్ట్ర విభజన ప్రకటన వెలువడడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి అరుగుపై కూర్చున్న రాంబాబు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని గమనించి అమలాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతిచెందాడు. రాంబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
విభజనతో కోనసీమ ఎడారవుతుందని..
మలికిపురం : తెలంగాణ విడిపోతుందన్న ఆవేదనతో మలికిపురానికి చెందిన దండుబోయిన పెద్దిరాజు (45) మంగళవారం గుండెపోటుకు గురై మరణించాడు. రాష్ర్ట విభజన నేపథ్యంలో కొంతకాలం నుంచి మనోవేదనతో ఉన్న పెద్దిరాజు కోనసీమ ఎడారవుతుందన్న బెంగతో గుండెపోటుకు గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Advertisement
Advertisement