సాక్షి, హైదరాబాద్: మంగళవారం విశాఖ ఏజెన్సీలో విషాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా కొండచరియలు విరిగి పడటంతో అక్కడ రైలు పట్టాలపై చేస్తున్న తొమ్మిది మంది కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని దగ్గరలో ఉన్న ఎస్‌కోట ఆసుపత్రికి తరలిస్తుండగా ముగ్గురు మార్గమధ్యంలోనే మృతి చెందారు. కెకె లైన్లో టైడా- చిముడు పల్లి రైలు మార్గంలో మంగళవారం అనుకోకుండా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ సమయంలో అక్కడ తొమ్మిది మంది కార్మికులు పట్టాలపై పనిచేస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వారంతా తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంలోనే ముగ్గురు మరణించగా మిగిలిన వారికి ఎస్‌కోట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న గూడ్స్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్మికుల మరణంతో విశాఖ ఏజెన్సీలో విషాద ఛాయలు అలముకున్నాయి. (వలస కార్మికులను పంపిస్తాం : కానీ...!)
Comments
Please login to add a commentAdd a comment