రాజమండ్రిలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం | three school students missing in rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం

Published Wed, Jan 22 2014 11:35 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

three school students missing in rajahmundry

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. రాజమండ్రిలోని శ్రీచైతన్య టెక్నోస్కూల్‌లో చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మోరంపూడి సెంటర్‌లోని శ్రీచైతన్య టెక్నో స్కూలులో ఆరో తరగతి చదువుతున్న పొలగం సుష్మా సువాసిని, అదే స్కూలులో ఎనిమిదో తరగతి చదువుతున్న పులగం రేష్మానాయుడు, తొమ్మిదో తరగతి చదువుతున్న సింధు జాహ్నవిలు కనిపించడంలేదు. వీరంతా నిన్న ఉదయం పాఠశాలకు వెళ్లి... సాయింత్రం స్కూల్ బస్సులో ఇంటికి బయలుదేరారు. బస్సు దిగిన తర్వాత వారు కనిపించకుండా పోయారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బొమ్మూరు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement