sri chaitanya techno school
-
భవనంపై నుంచి దూకిన టీచర్ !
హైదరాబాద్: పాఠశాల భవనంపై నుంచి దూకి ఉపాధ్యాయుడొకరు ప్రాణం తీసుకున్నారు. కూకట్పల్లి శ్రీచైతన్య టెక్నో పాఠశాలలో పనిచేసే రాజు (34) అనే ఉపాధ్యాయుడు శనివారం మధ్యాహ్నం భవనంపై నుంచి దూకారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. వ్యక్తిగత కారణాలతోనే అతడు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
ఖమ్మం జిల్లా జూలూరుపాడులో సోమవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కొంచెం దెబ్బతినగా.. బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. కొత్తగూడెం శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన బస్సును డ్రైవర్ రాకపోవడంతో క్లీనర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు మహంకాళి కృష్ణ, వందనపు రామారావు, పెండ్యాల నగేశ్, నరసింహారావు సహా పది మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్ బస్సును స్టేషన్‌కు తరలించారు. -
లిమ్కాబుక్‌లో శ్రీ చైతన్య విద్యార్థులకు స్థానం
హైదరాబాద్: శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు అరుదైన ప్రయత్నంతో లిమ్కా బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. వివరాలు....చంపాపేట టెక్నో బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులు సోమవారం గంట వ్యవధిలో టోపీలపై మూడు రంగుల జాతీయ చిహ్నాన్ని చేత్తో పెయింటింగ్ వేశారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 275 బ్రాంచ్‌ల విద్యార్థులు... ఒకేసారి ఓ గంట వ్యవధిలో 20 వేల టోపీలపై జాతీయ చిహ్నాన్ని వేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం దక్కించుకున్నట్టు చంపాపేట శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ నౌషిన్ ఫాతిమా తెలిపారు. (చంపాపేట) -
రాజమండ్రిలో అదృశ్యమైన విద్యార్థినులు క్షేమం
రాజమండ్రి : రాజమండ్రిలో నిన్న అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. రాజమండ్రిలోని శ్రీచైతన్య టెక్నోస్కూల్లో చదువుతున్న సుష్మా సువాసిని, పులగం రేష్మానాయుడు, సింధు జాహ్నవిలు నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దాంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా సింధు జాహ్నవి బంధువుల ఇంట్లో ఉన్నట్లు సమాచారం. దాంతో విద్యార్థినిల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
రాజమండ్రిలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. రాజమండ్రిలోని శ్రీచైతన్య టెక్నోస్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోరంపూడి సెంటర్లోని శ్రీచైతన్య టెక్నో స్కూలులో ఆరో తరగతి చదువుతున్న పొలగం సుష్మా సువాసిని, అదే స్కూలులో ఎనిమిదో తరగతి చదువుతున్న పులగం రేష్మానాయుడు, తొమ్మిదో తరగతి చదువుతున్న సింధు జాహ్నవిలు కనిపించడంలేదు. వీరంతా నిన్న ఉదయం పాఠశాలకు వెళ్లి... సాయింత్రం స్కూల్ బస్సులో ఇంటికి బయలుదేరారు. బస్సు దిగిన తర్వాత వారు కనిపించకుండా పోయారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బొమ్మూరు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను చేపట్టారు.