లిమ్కాబుక్‌లో శ్రీ చైతన్య విద్యార్థులకు స్థానం
హైదరాబాద్: శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు అరుదైన ప్రయత్నంతో లిమ్కా బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. వివరాలు....చంపాపేట టెక్నో బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులు సోమవారం గంట వ్యవధిలో టోపీలపై మూడు రంగుల జాతీయ చిహ్నాన్ని చేత్తో పెయింటింగ్ వేశారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 275 బ్రాంచ్‌ల విద్యార్థులు... ఒకేసారి ఓ గంట వ్యవధిలో 20 వేల టోపీలపై జాతీయ చిహ్నాన్ని వేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం దక్కించుకున్నట్టు చంపాపేట శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ నౌషిన్ ఫాతిమా తెలిపారు.
(చంపాపేట)